Due Date: వరిష్ స్టూడియోస్ పతాకంపై పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘డ్యూ డేట్’. ఈ సినిమాతో ఆనంద్.కె. దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది.
హీరో, హీరోయిన్ ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉండబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్ చుట్టు పూర్తి వాణిజ్య అంశాలతో అల్లుకున్నకమర్షియల్ లవ్ స్టోరీ ఇది.
టైటిల్ దగ్గర నుంచి సినిమాపై అంశాలు..
టైటిల్ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని అందించే కథ, కథనాలతో ఈ సినిమా రాబోతుంది. ఈ రోజు నుంచి 15 రోజుల పాటు ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తవుతుందని చెబుతున్నారు. తప్పకుండా ఈ చిత్రం అందర్ని ఆలోచింపజేస్తుందని మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుందన్నారు.
ఈ చిత్రంలో నటీనటులు.. సాంకేతిక విభాగం విషయానికొస్తే.. లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ, ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి జవ్వాడి నాయుడు ఆర్ట్ వర్క్ అందిస్తున్నారు. హరీష్ మీనన్ మాటలు అందిస్తున్నారు. సత్య గిడుటూరి మాటలు అందిస్తున్నారు. చెంచు జింక డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. పవన్ తరిగోపుల, ఏలూరు శ్రీను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఆనంద్.కె దర్శకత్వం వహిస్తున్నారు.