• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Jason Sanjay: ఆమెతో లవ్ బ్రేకప్…బయటపడిన విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ప్రేమ కథ..!

Jason Sanjay: ఆమెతో లవ్ బ్రేకప్…బయటపడిన విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ప్రేమ కథ..!

Jason Sanjay: జాసన్ సంజయ్ దర్శకుడిగా తన తొలి అడుగు వేసిన ‘సిగ్మా’ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. విజయ్ కుమారుడిగా ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్ కిషన్‌తో కలిసి ఓ ప్రత్యేక వ్లాగ్‌లో పాల్గొన్న జాసన్, తన వ్యక్తిగత జీవితం, కాలేజ్ రోజులు, సినిమాలపై తన ఆసక్తి, విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ చదివిన అనుభవం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Written ByVishnu Priya
Published: Oct 06, 2026, 09:33 PM IST|Updated: Oct 06, 2026, 09:36 PM IST
joinshare
Jason Sanjay: ఆమెతో లవ్ బ్రేకప్…బయటపడిన విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ప్రేమ కథ..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Shriya Saran: అండగా నిలబడ్డారు.. అతనికన్నా ముందే నన్ను ఇంటికి పంపేవారు.. శ్రియ శరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Shriya Saran: అండగా నిలబడ్డారు.. అతనికన్నా ముందే నన్ను ఇంటికి పంపేవారు.. శ్రియ శరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

2

Jason Sanjay: ఆమెతో లవ్ బ్రేకప్…బయటపడిన విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ప్రేమ కథ..!

3

Telangana C Section Rate: తెలంగాణలో పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు.. గ్రామీణ జిల్లాల్లో 80 శాతానికి పైగా..!

4

Andaru Mogullu Kurnool Poyi: అందరూ మొగుళ్లు కర్నూల్ పోయి బిజినెస్ చేస్తుంటే.. సోషల్ మీడియాని ఊపేస్తున్న పాట

5

Telangana Liquor Sales: తెలంగాణకు 'లిక్కర్ కిక్కు'.. 13 ఏళ్లలో 200 శాతం పెరిగిన ఆదాయం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jason Sanjay: తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఇటీవల దర్శకుడిగా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. సిగ్మా సినిమాతో ఆయన డైరెక్టర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జాసన్ సంజయ్ హీరో సందీప్ కిషన్‌తో కలిసి వి.జే. సిద్ధు వ్లాగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని జాసన్ బయటపెట్టాడు.

వ్లాగ్‌లో జరిగిన రూఫ్‌టాప్ పార్టీ సందర్భంగా జాసన్ సంజయ్ తన కాలేజ్ ప్రేమ గురించి మాట్లాడాడు. తాను జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రేమలో పడ్డానని చెప్పాడు. అది తన కాలేజ్ రోజుల్లో జరిగిన ప్రేమ అని వెల్లడించాడు. ఆ సంబంధం సుమారు ఏడాదిన్నర పాటు కొనసాగిందని జాసన్ చెప్పాడు.

అయితే ఆ తర్వాత ఇద్దరూ విడిపోవాల్సి వచ్చిందట. తమ బ్రేకప్ విషయంలో ఎవరి తప్పు లేదని, ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఆ నిర్ణయం తీసుకున్నామని జాసన్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా తాను విదేశాల్లో ఫిల్మ్ మేకింగ్ చదువుతున్న సమయంలో దూరం తమ మధ్య సమస్యగా మారిందని తెలిపాడు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ వల్ల ఒంటరిగా అనిపించేదని జాసన్ చెప్పాడు. ఆ సమయంలో బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ప్రేమ పాటలు వినేవాడినని చెప్పాడు. ఈ విషయం తనకు సంగీతం ఎంత దగ్గరగా ఉందో కూడా తెలియజేస్తుంది.

బ్రేకప్ సమయంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండాలని అనిపించలేదని జాసన్ తెలిపాడు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలు పెట్టడం కూడా కావాలని మానేశానని చెప్పాడు. తాము మళ్లీ కలిసినా, సోషల్ మీడియా పోస్టుల వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారకూడదనే ఉద్దేశంతో దూరం పాటించామని వివరించాడు. తన బ్రేకప్ జరిగి కొన్ని సంవత్సరాలు అవుతున్నాయని జాసన్ చెప్పాడు. ఇప్పుడు ఆ విషయం గురించి తాను పూర్తిగా ఓకే అని తెలిపాడు. ఇద్దరూ తమ జీవితాల్లో ముందుకు వెళ్లిపోయామని చెప్పాడు. ప్రేమ తర్వాత తన దృష్టి మొత్తం సినిమా తీయడంపైనే పెట్టానని వెల్లడించాడు.

జాసన్ సంజయ్ 2018 నుంచి 2020 వరకు కెనడాలోని టొరంటో ఫిల్మ్ స్కూల్‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత 2020 నుంచి 2022 వరకు లండన్‌లోని సెంట్రల్ ఫిల్మ్ స్కూల్‌లో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్నాడు. ఇక ఆయన దర్శకత్వం వహించిన సిగ్మా సినిమాలో సందీప్ కిషన్, ఫారియా అబ్దుల్లా, రాజు సుందరం తదితరులు నటించారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతున్న జన నాయకన్తో క్లాష్ కాకుండా సిగ్మా విడుదల తేదీని మార్చారు. అయితే సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది.

Read More: Janhvi Kapoor: టాలీవుడ్‌లోకి అనవసరంగా వచ్చిన జాన్వీ కపూర్.. వరుస వివాదాలతో పెరుగుతున్న డ్యామేజ్!

Read More: ఎంటర్ ది ‘డ్రాగన్’ .. మళ్లీ షూటింగ్‌ కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్.. ?

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News