‘GEN Z GIRLS’ టైటిల్‌తోనే సినిమాపై పాజిటివ్ వైబ్స్..
‘GEN Z GIRLS’: తెలుగులో ‘నల్లమల్ల’, లాంటి విభిన్న మైన చిత్రం తో గుర్తింపు తెచ్చుకున్న రవి చరణ్.. ఇపుడు ‘GEN Z GIRLS’ సినిమాతో రాబోతున్నాడు. తాజాగా విజయ దశమి సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
‘GEN Z GIRLS’ New Title: ‘నల్లమల’ వంటి హార్డ్ కోర్ సబ్జెక్ట్ తర్వాత పూర్తిగా కొత్త జానర్‌లో రవిచరణ్ ఇపుడు ‘GEN Z GIRLS’ పేరుతో కొత్త తరహా యూత్ సబ్జెక్ట్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటి గర్ల్స్ మనస్తత్వం, సోసల్ మీడియాలో వారి బిహేవియర్, సమాజంలో ఎలా ప్రవర్తిస్తున్నారనే అంశంతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
ఎస్‌జేసీ క్రియేషన్స్, శ్రీ జ్యోతిర్మయి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రాబోతున్నట్టు ప్రకటించారు. కొత్త తరహా పోస్టర్‌తో ఈ సినిమాపై ఆసక్తి రేకిత్తించే ప్రయత్నం చేశాడు. ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘GEN Z GIRLS’ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
పండుగ సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేసి,షూటింగ్‌ను అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. అంతేకాదు ఈ చిత్రంలో ఇప్పటికే పాపులర్ అయిన నటీనటులను ఈ సినిమాలో తీసుకోబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులను కూడా తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, కథాంశం, ఇతర సాంకేతిక వివరాలను చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించనున్నారు. అంతేకాదు త్వరలో ‘GEN Z GIRLS’ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలతో రాబోతున్నట్టు ప్రకటించారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత రెండు నెలల్లో కంప్లీట్ చేసిన సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.