Tiger Shroff: సినీ పరిశ్రమలో కలకలం.. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు
Gun Shots Fired On Tiger Shroff: బాలీవుడ్లో మరోసారి కాల్పుల కలకలం రేపింది. సినీ నటుడు టైగర్ ష్రాఫ్పై కొందరు దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ముంబైలో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే త్రుటిలో ప్రమాదం నుంచి నటుడు తప్పించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Lawrence Bishnoi Gang: అత్యంత సంపన్నులు.. సినీ, వ్యాపార ప్రముఖులు నివసించే ముంబైలో ఒక్కసారిగా సంచలన సంఘటన చోటుచేసుకుంది. సినీ నటుడు టైగర్ ష్రాఫ్పై పట్టపగలు కొందరు దుండుగులు కాల్పులకు తెగబడ్డారు. టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా కాల్పులు జరపడం తీవ్ర సంచలనం రేపింది. అయితే కాల్పుల నుంచి టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా కొందరికి గాయాలయ్యాయి. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్ర అలజడి రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బాఘీ, బాఘీ 2, వార్ సినిమాలతో సినీ ప్రేక్షకుల గుర్తింపు పొందిన బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ముంబైలోని ఆదివారం జూహూ ప్రాంతంలో ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఆదివారం సాయంత్రం బీఎండబ్ల్యూ ఆరులో ఉండగా టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా కాల్పులు జరిగాయి. అయితే ప్రమాదం నుంచి టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా అతడి కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనలోనే మరో వ్యక్తి గాయపడగా అతడిని ఆస్పత్రికి తరలించారు.
టైగర్ ష్రాప్పై కాల్పులకు తెగబడింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకున్నట్లు చర్చ జరుగుతోంది. గతంలో కూడా ఈ ముఠా పలువురిపై దాడి చేసిన విషయం తెలిసిందే. వారిలో స్టార్ నటుడు సల్మాన్ ఖాన్పై కూడా ఆ గ్యాంగ్ కాల్పులకు తెగబడింది. జుహు పరిధిలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో టైగర్ ష్రాఫ్ క్షేమంగా ఉన్నారని డీసీపీ మోహిత్ గార్గ్ స్పష్టం చేశారు.
ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు లేదా వారి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా ధ్రువీకరించలేదు. బైక్పై వచ్చిన గుర్తుతెలియని దుండగులని గుర్తించేందుకు, దాడి వెనుక ఉన్న అసలు కారణాలను తేల్చేందుకు ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణను కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. విచారణకు ఆదేశించారు.