• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /అరెరే కాన్సెప్ట్ భళేగా ఉందే.. తెలుగు తెరపై ఇప్పటి వరకు సబ్జెక్ట్‌తో ‘హైకూ.. ట్రైలర్‌ చూస్తే మైండ్ బ్లాంకే..

అరెరే కాన్సెప్ట్ భళేగా ఉందే.. తెలుగు తెరపై ఇప్పటి వరకు సబ్జెక్ట్‌తో ‘హైకూ.. ట్రైలర్‌ చూస్తే మైండ్ బ్లాంకే..

Haiku Trailer Talk Review: ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన చిత్రం ‘హైకు’. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించారు. రొమాంటిక్, లవ్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వం వహించారు. డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 06, 2026, 12:23 PM IST|Updated: Oct 06, 2026, 09:28 PM IST
joinshare
అరెరే కాన్సెప్ట్  భళేగా ఉందే.. తెలుగు తెరపై ఇప్పటి వరకు సబ్జెక్ట్‌తో ‘హైకూ..  ట్రైలర్‌ చూస్తే మైండ్ బ్లాంకే..
Image Credit: Haiku Trailer Talk (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Shriya Saran: అండగా నిలబడ్డారు.. అతనికన్నా ముందే నన్ను ఇంటికి పంపేవారు.. శ్రియ శరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Shriya Saran: అండగా నిలబడ్డారు.. అతనికన్నా ముందే నన్ను ఇంటికి పంపేవారు.. శ్రియ శరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

2

Jason Sanjay: ఆమెతో లవ్ బ్రేకప్…బయటపడిన విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ప్రేమ కథ..!

3

Telangana C Section Rate: తెలంగాణలో పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు.. గ్రామీణ జిల్లాల్లో 80 శాతానికి పైగా..!

4

Andaru Mogullu Kurnool Poyi: అందరూ మొగుళ్లు కర్నూల్ పోయి బిజినెస్ చేస్తుంటే.. సోషల్ మీడియాని ఊపేస్తున్న పాట

5

Telangana Liquor Sales: తెలంగాణకు 'లిక్కర్ కిక్కు'.. 13 ఏళ్లలో 200 శాతం పెరిగిన ఆదాయం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Haiku Trailer Talk Review:  ‘హైకూ’ ఫేరుతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.   ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా  పెంచేశాయి. చాలా రోజులకు మళ్లీ ఓ ఫ్రెష్ లవ్ స్టోరీని తెరపై చూడబోతోన్నామని ప్రేక్షకులు నమ్మకం పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టు తాజాగా ట్రైలర్‌‌ కూడా అట్రాక్టివ్‌గా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

అమ్మాయిల కాలేజ్‌లో అబ్బాయి జాయిన్ అవ్వడం, కాలేజ్ మొత్తానికి ఒకే అబ్బాయి ఉండటం అనే విచిత్ర పరిస్థితులను చూపిస్తూ ట్రైలర్‌ను  కట్ చేసిన విధానం సరికొత్తగా ఉంది. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఫ్రెండ్‌షిప్, లవ్ అనే ఎమోషన్స్‌ని చూపించారు దర్శకుడు. ఇక కళాశాల జీవితం.. ఉద్యోగ బాద్యతల్లో  ఉన్న ప్రేమ కథలోని సంఘర్షణను హృధ్యంగా తెరకెక్కించారు. ట్రైలర్ చివర్లో వచ్చే ‘ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు.. బాగా చూసుకోవాలి.. వన్స్ తను వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ అయితే కాళ్లు పట్టుకుని బతిమిలాడినా ఉపయోగం ఉండదు’ డైలాగ్‌తో ‘హైకూ’ కథ  మొత్తం స్టోరీ ఏంటో చెప్పేశారు.

‘హైకూ’  బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా  ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఆడియెన్స్ ముందుకు రాబోతోందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.  మ్యూజిక్ ఎంతో సూథింగ్‌గా ఉండగా.. విజువల్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. యువత, కుటుంబ ప్రేక్షకులకు  నచ్చే అందమైన ప్రేమ కథా చిత్రంగా ‘హైకూ’ అక్టోబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

‘హైకూ’ షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ  నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాకు ఉన్న ఫ్రెష్ స్టోరీ, ప్రత్యేకమైన ప్రజెంటేషన్ నెట్‌ఫ్లిక్స్‌ను ఆకట్టుకోవడంతో ఫ్యాన్సీ రేటుకు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

‘హైకూ’ సినిమాకి ప్రియేష్ గురుస్వామి కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు.  శక్తి ప్రణేష్ ఎడిటర్‌గా ఉన్నారు.  సిద్ధు కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రేమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. రొమాంటిక్ ప్రపంచాన్ని అందమైన విజువల్స్‌తో పరిచయం చేసేందుకు‘హైకూ’ సినిమా 2026 అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా టాకీస్‌లలో  రిలీజ్‌ కాబోతుంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie