అరెరే కాన్సెప్ట్ భళేగా ఉందే.. తెలుగు తెరపై ఇప్పటి వరకు సబ్జెక్ట్‌తో ‘హైకూ.. ట్రైలర్ చూస్తే మైండ్ బ్లాంకే..
Haiku Trailer Talk Review: ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన చిత్రం ‘హైకు’. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరుళానందు, మాథ్యూ అరుళానందు నిర్మించారు. రొమాంటిక్, లవ్ ఎంటర్‌టైనర్ ‘హైకూ’. యువరాజ్ చిన్నసామి రచన, దర్శకత్వం వహించారు. డిఫరెంట్ లవ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.
Haiku Trailer Talk Review: ‘హైకూ’ ఫేరుతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెంచేశాయి. చాలా రోజులకు మళ్లీ ఓ ఫ్రెష్ లవ్ స్టోరీని తెరపై చూడబోతోన్నామని ప్రేక్షకులు నమ్మకం పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టు తాజాగా ట్రైలర్ కూడా అట్రాక్టివ్‌గా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
అమ్మాయిల కాలేజ్‌లో అబ్బాయి జాయిన్ అవ్వడం, కాలేజ్ మొత్తానికి ఒకే అబ్బాయి ఉండటం అనే విచిత్ర పరిస్థితులను చూపిస్తూ ట్రైలర్‌ను కట్ చేసిన విధానం సరికొత్తగా ఉంది. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఫ్రెండ్‌షిప్, లవ్ అనే ఎమోషన్స్‌ని చూపించారు దర్శకుడు. ఇక కళాశాల జీవితం.. ఉద్యోగ బాద్యతల్లో ఉన్న ప్రేమ కథలోని సంఘర్షణను హృధ్యంగా తెరకెక్కించారు. ట్రైలర్ చివర్లో వచ్చే ‘ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు.. బాగా చూసుకోవాలి.. వన్స్ తను వదిలేసి వెళ్లిపోవాలని డిసైడ్ అయితే కాళ్లు పట్టుకుని బతిమిలాడినా ఉపయోగం ఉండదు’ డైలాగ్‌తో ‘హైకూ’ కథ మొత్తం స్టోరీ ఏంటో చెప్పేశారు.
‘హైకూ’ బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు ఆడియెన్స్ ముందుకు రాబోతోందని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మ్యూజిక్ ఎంతో సూథింగ్‌గా ఉండగా.. విజువల్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. యువత, కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అందమైన ప్రేమ కథా చిత్రంగా ‘హైకూ’ అక్టోబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
‘హైకూ’ షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమాకు ఉన్న ఫ్రెష్ స్టోరీ, ప్రత్యేకమైన ప్రజెంటేషన్ నెట్‌ఫ్లిక్స్‌ను ఆకట్టుకోవడంతో ఫ్యాన్సీ రేటుకు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
‘హైకూ’ సినిమాకి ప్రియేష్ గురుస్వామి కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. శక్తి ప్రణేష్ ఎడిటర్‌గా ఉన్నారు. సిద్ధు కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రేమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. రొమాంటిక్ ప్రపంచాన్ని అందమైన విజువల్స్‌తో పరిచయం చేసేందుకు‘హైకూ’ సినిమా 2026 అక్టోబర్ 23న ప్రపంచవ్యాప్తంగా టాకీస్‌లలో రిలీజ్ కాబోతుంది.