SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Teja Sajja Engagement: తేజ సజ్జా జీవితంలో కొత్త అధ్యాయం.. ఘనంగా నిశ్చితార్థం!

Teja Sajja Marriage: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో తన జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యారు. తాజాగా ఆయన నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వార్త బయటకు రావడంతో తేజ సజ్జా అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

Written By Vishnu Priya
Published: Nov 16, 2026, 15:39 IST | Updated: Nov 16, 2026, 15:50 IST
Join

Teja Sajja Engagement: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తాజ్ కృష్ణ హోటల్‌లో తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించినట్లు సమాచారం. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, బంధువులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరై కాబోయే జంటను ఆశీర్వదించారు. సినిమా పరిశ్రమతో పాటు రాజకీయ రంగానికి చెందిన కొందరు ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించారు.

తేజ సజ్జా చేసుకోబోయే అమ్మాయి గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఆమె అమెరికాలో పెరిగిన టెక్నాలజీ రంగానికి చెందిన ప్రొఫెషనల్ అని సమాచారం. అంతేకాదు, ఆమెకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. దీంతో తేజ సజ్జా జీవిత భాగస్వామి ఎవరనే విషయంపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఆమె పేరు, ఇతర వ్యక్తిగత వివరాలపై పూర్తి అధికారిక సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

ఇక తేజ సజ్జా వివాహం డిసెంబర్‌లో జరగనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిశ్చితార్థం కూడా పూర్తవడంతో పెళ్లి ఏర్పాట్లపై చర్చ మొదలైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ వివాహ వేడుకను నిర్వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పెళ్లి తేదీ, వేదికకు సంబంధించిన పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన తేజ సజ్జా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'హనుమాన్' సినిమా ఆయన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో తేజకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.

ఇటీవల 'ది ట్రైటర్స్' తెలుగు రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలతో పాటు కొత్త తరహా కార్యక్రమాల్లోనూ కనిపిస్తున్న తేజ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త అడుగు వేస్తున్నారు. మొత్తానికి తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్ వార్త టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఆయన పెళ్లి వేడుక ఎప్పుడు, ఎలా జరగనుందో తెలుసుకోవడానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Also: ఇంట్లో ఎన్ని కిటికీలు ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందో తెలుసా? ఈ నియమాలు తెలుసుకోండి!


Read Also: ఇంట్లో ఇత్తడి తాబేలును ఎందుకు ఉంచాలి? ధన ప్రాప్తికి, విజయానికి 5 శక్తివంతమైన కారణాలు ఇవే!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ZEENEWS TRENDING STORIES