SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

HBD Prabhas: కొన్ని సార్లు కటౌట్ చూసి నమ్మేయాలి డ్యూడ్.. దటీజ్ ప్రభాస్..

Happy Birthday Indias Biggest Super Star: ప్రభాస్ ‘బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్న బాహుబలి. ప్యాన్ సినిమాను నడిపిస్తూన్న నాయకుడు (సలార్). ఆరడుగుల ఆజానుబాహుడు. ఆ హైట్ కు తగ్గ పర్సనాలిటి.. ఆ పర్సనాలిటి తగ్గ వాయిస్. ఇవే ప్రభాస్ ను హీరోగా టాప్ లో నిలబెట్టాయి. ఈ స్పెషాలిటే ప్రభాస్ ను ఇండియా బిగ్గెస్ట్‌ సూపర్ స్టార్‌ను స్టార్ ను చేసాయి.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 23, 2026, 12:00 AM IST | Updated: Oct 23, 2026, 12:00 AM IST
Image Credit: Happy birthday Prabhas (X/Source)
Join

HBD Prabhas: హీరోలందూ ప్రభాస్ వేరయా అని చెప్పాలి. తన యాక్టింగ్‌తో ప్రేక్షకుల మనుసుు దోచిన ఫౌజీ. టాలీవుడ్‌కు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన కల్కి. ప్రేక్షకులను గర్వపడేలా డార్లింగ్ అంటూ వాళ్లలో స్పిరిట్ నింపే యోగి. క్రేజ్, స్టార్ డమ్‌, మంచి మనసులో  నీకు ఎవరు లేరే 
సాటి. అందుకే లోకల్ నుంచి గ్లోబల్ వరకు అందరు ప్రభాస్ అంటే పడిసచ్చిపోతున్నారు.  బాహుబలి తర్వాత భారతీయ సినిమాను కొత్త కీర్తి శిఖరాలకు చేర్చారు.‘ఈశ్వర్’ మూవీతో మొదలైన సినీ ప్రయాణం గత 24 యేళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.

అందరినీ ప్రేమించే తత్వమే ప్రభాస్ ను అందరూ ఇష్టపడే డార్లింగ్ లా మార్చేసింది. ఓ రకంగా  స్టార్ గా ప్రభాస్ స్టామినా బాక్సాఫీస్ రికార్డులు చెబితే, అందరూ ప్రేమగా పిలిచే డార్లింగ్ అనే మాట వ్యక్తిగా ఆయన గొప్పదనం చూపిస్తుంది. ప్రభాస్ కొత్త సినిమా వచ్చిందంటే అది ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు కొత్త చరిత్రను వెతుక్కోవాల్సిందే. రెబల్ స్టార్ భారీ లైనప్, ఆ సినిమాల్లో శ్రమతో, అంకితభావంతో, నటనా ప్రతిభతో తను చేస్తున్న క్యారెక్టర్స్, బ్యాక్ టు బ్యాక్ ఈ భారీ మూవీస్ చేసేందుకు ఆయన పడుతున్న కష్టం...ఇవన్నీ ప్రభాస్ ను మరో స్టార్ అందుకోలేనంత ఎత్తులో నిలబెడుతున్నాయి. ఆయన అభిమానులు గర్వించేలా చేస్తున్నాయి.

టాలీవుడ్ కు పేరు తెచ్చిన ప్రభాస్..

టాలీవుడ్ లో హీరోలు దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడం చూస్తుంటాం కానీ టాలీవుడ్ కే పేరు తెచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరో ప్రభాస్. ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పాలి. బాహుబలి సినిమా లాటరీ అన్నవాళ్లకు తన సినిమాలతో గట్టి సమాధానమే ఇచ్చాడు. అంతేకాదు ప్రస్తుతం మన దేశంలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్  సూపర్ స్టార్‌గా తన ఎరా ఏంటో చూపిస్తున్నాడు.  


ప్రభాస్ సినిమా అంటే రికార్డుల వేట.. 
ప్రభాస్ సినిమాల బాక్సాఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ పరంగా.. ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల వరకు  పిల్లల నుంచి పెద్దల దాకా థియేటర్స్ కు క్యూ కట్టడం ఓ స్పెషాలిటీ. ప్రభాస్ సినిమా విడుదల అవుతుంటే.. బాక్సాఫీస్ దగ్గర  డే 1 రికార్డ్స్, ఫస్ట్ వీక్ రికార్డ్స్, వరల్డ్ వైడ్ హయ్యెస్ట్ గ్రాస్, రికార్డ్ స్థాయి ఓవర్సీస్ కలెక్షన్స్ అన్ని లెక్కలు తీయడం మొదలు పెడతారు బాక్సాఫీస్ ట్రేడ్ పండితులు. ఒక్క థియేట్రికల్ గానే కాకుండా..  డిజిటల్, శాటిలైట్, ఓవర్సీస్ బిజినెస్..ఇలా ఏ విషయంలో చూసినా ప్రభాస్ మరే స్టార్ హీరో అందుకోలేనంత స్థాయికి చేరుకున్నారు.

సలార్ లో ప్రభాస్ హ్యూజ్ యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఆ కటౌట్ కు కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనేలా ఉంటాయి. అదీ కదా స్క్రీన్ ప్రెజెన్స్ లో ప్రభాస్ కున్న ఛరిష్మా. బాహుబలి నుంచి పాన్ ఇండియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత సాహో, సలార్, కల్కి 2898ఎడి సినిమాలతో దిగ్విజయంగా వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. కొన్ని సినిమాలు క్యాస్ట్ ఫెల్యూలర్స్ గా నిలిచాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించాయి.

రెండు వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన హీరో.. 
వెయ్యి కోట్ల రూపాయల  గ్రాస్ క్లబ్.. రీజనల్ స్టార్స్ కే కాదు ఎంతోమంది బాలీవుడ్ స్టార్స్ కు కూడా ఒక నెరవేరని కల. అలాంటి సాధ్యం కాని ఫీట్. కానీ ప్రభాస్ అలవోకగా బాహుబలి 2, కల్కి 2898 ఎడి సినిమాలతో రెండు సార్లు వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న రీజనల్ హీరోగా రికార్డులకు ఎక్కాడు.  

పాన్ ఇండియా స్టార్ డమ్ దాటేసి గ్లోబల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన నటించే ప్రతి సినిమా దేశ సరిహద్దులు  దాటి ప్రేక్షకులను అలరిస్తోంది.  ప్రభాస్ లా ప్రాంతీయ సినిమా హద్దులు దాటి గ్లోబల్ రేంజ్ కు వెళ్లిన స్టార్ హీరోస్ చాలా కొద్దిమందే కనిపిస్తారు. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ పాన్ ఇండియా జర్నీ దిగ్విజయంగా కొనసాగుతోంది.

వన్ అండ్ ఓన్లీ ప్యాన్ ఇండియా స్టార్..

ప్రభాస్ సినిమాలు బాలీవుడ్ స్టార్స్ ‌కు ధీటుగా ఉత్తరాదిలో  కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఛరిష్మా నార్త్  ప్రేక్షకుల్ని ముగ్ధులను చేస్తోంది. అందుకే బాలీవుడ్ లో తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ప్రభాస్. తమిళ, మలయాళ, కన్నడలోనూ స్థానిక స్టార్ హీరోలతో ప్రభాస్ సినిమాలు పోటీ పడటం నిజమైన పాన్ ఇండియా ట్రెండ్ కు నిదర్శనం. ఓవర్సీస్ లోనూ ప్రభాస్ స్టార్ డమ్‌కు కు తిరుగులేదు. థియేట్రికల్, ఓటీటీ, ఇతర బిజినెస్ ల ద్వారా ప్రభాస్ సినిమాలు నిర్మాణ వ్యయానికి ఎన్నో రెట్ల లాభాలు ఆర్జిస్తున్నాయి. నిర్మాతలకు ప్రభాస్ సినిమాలు బెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ తీసుకొస్తున్నాయి.ఓవ‌ర్‌సీస్ మార్కెట్‌లో ప‌ది మిలియ‌న్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించిన తొలి హీరోగా ప్ర‌భాస్‌ రికార్డ్ క్రియేట్ చేశారు.

లోకల్ నుంచి గ్లోబల్ వరకు ప్రభాస్ ఫ్యాన్స్..

దేశం నలుమూలలా ప్రభాస్ కు అభిమానులు ఉన్నారు, ఆయన సినిమాలను ఇష్టంగా చూసేవాళ్లున్నారు. ఓవర్సీస్ లో యూఎస్, యూకే, జపాన్..ఇలా ప్రతి దేశంలోనూ ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులున్నారు. తన సినిమాలకు ఆయా దేశాల్లో వచ్చే బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రభాస్ యూనివర్సల్ క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తుంటాయి. అందుకే ప్రభాస్ చేసే ప్రతి సినిమా నిజమైన పాన్ వరల్డ్ మూవీ అవుతోంది. స్టార్ గా ఎంత ఎదిగినా ఆయన గొప్ప వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు లేదు. సమాజ హితం కోరే ఏ కార్యక్రమానికైనా తన వంతు సపోర్ట్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. డ్రగ్స్ వద్దని ప్రచారం చేసినా, ప్రకృతి విపత్తుల సమయంలో భారీ విరాళాలు ఇచ్చినా అది ఆయన మంచి మనసుకు నిదర్శనం. ప్రభాస్ ను అభిమానులే కాదు ఆయనతో పనిచేసిన ప్రతి నటీనటులు, టెక్నీషియన్స్ ఇష్టపడతారు. రీసెంట్ గా డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ దర్శకుల విజన్ ను నమ్మే ప్రభాస్ లాంటి స్టార్ దొరకడం తన అదృష్టమని చెప్పడం విశేషం.

ప్రభాస్ లైనప్.. 

అభిమానుల, ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో ప్రభాస్ తన భారీ పాన్ ఇండియా సినిమాల లైనప్‌లో ఉన్నాయ.. సందీప్ వంగా దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మిస్తున్న స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ, వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న కల్కి 2, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించనున్న సలార్ 2 చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. ఫౌజీ సినిమా  వచ్చే యేడాది సమ్మర్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతుంది.  అలాగే స్పిరిట్ సినిమా వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  కల్కి 2 ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే సలార్ 2 సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. మొత్తంగా లోకల్ నుంచి గ్లోబల్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోన్న ప్రభాస్‌ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES