• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Delhi: వీడెంట్రా బాబు.. ఏకంగా 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు వలపు వల.. ఢిల్లీలో వెలుగులోకి షాకింగ్ ఘటన..

Delhi: వీడెంట్రా బాబు.. ఏకంగా 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు వలపు వల.. ఢిల్లీలో వెలుగులోకి షాకింగ్ ఘటన..

Man cheats 20 woman constables in delhi: ఒక పెద్ద బిజినెస్ మెన్ గా సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్న విక్రాంత్ తోమర్ ఏకంగా 20 మంది లేడీ కానిస్టేబుళ్లను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Oct 24, 2026, 03:37 PM IST|Updated: Oct 24, 2026, 03:52 PM IST
joinshare
Delhi: వీడెంట్రా బాబు.. ఏకంగా 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు వలపు వల.. ఢిల్లీలో వెలుగులోకి షాకింగ్ ఘటన..
Image Credit: man cheated 20 delhi lady constables news

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Ind vs NZ Highlights: న్యూజిలాండ్‌పై భారత్‌ ఉత్కంఠ విజయం.. గెలుపు బాట పట్టించిన తెలుగు క్రీడాకారులు

Ind vs NZ Highlights: న్యూజిలాండ్‌పై భారత్‌ ఉత్కంఠ విజయం.. గెలుపు బాట పట్టించిన తెలుగు క్రీడాకారులు

2

Sonia Gandhi: తొలిచూపులోనే రాజీవ్‌ గాంధీతో లవ్‌లో పడ్డా: సోనియా గాంధీ

3

Bigg Boss 10 Elimination: బిగ్‌బాస్ 10లో ఊహించని పరిణామం..ఏడో వారం డబుల్ ఎలిమినేషన్..ఎవరెవరు?

4

Minister Seethakka: చేపకు నీళ్లే బలం.. నాయకుడికి ప్రజలే బలం.. మంత్రి సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

5

Delhi: వీడెంట్రా బాబు.. ఏకంగా 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు వలపు వల.. ఢిల్లీలో వెలుగులోకి షాకింగ్ ఘటన..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Man cheats 20 female constables over marriage promise: సమాజంలో ఇటీవల సోషల్ మీడియాలో కొత్తవారి పరిచయాలు కొంపలు ముంచుతున్నాయి. ఫెక్ డీపీలు పెట్టుకుని అవతలి వారికి రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ఆ తర్వాత ప్రేమ పేరుతో  నెమ్మదిగా మాటలు కల్పుతున్నారు. వీరిమాయలో పడితే ఇక రొమాంటిక్ చాట్ లు ఆతర్వాత  వీడియో కాల్ లు, న్యూడ్ కాల్ అంటూ అవతలి వారిని ముంచెసి అసలు రంగు బైటపెడుతున్నారు.   ఈ క్రమంలో ఇటీవల మోస పోతున్న వారిలో ఎక్కువగా చదువుకున్న వారు ఉండటం కూడా ఆందోళనలు కల్గిస్తుంది. ఇక అక్రమార్కుల నుంచి ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులే సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో  ఢిల్లీలో ఏకంగా 20 మహిళా కానిస్టేబుళ్లు ఒక కేటుగాడి వలలో పడ్డారు. ఈ ఘటన కాస్త వార్తలలో నిలిచింది.


ఢిల్లీలో విక్రాంత్ తోమర్ అనే కేటుగాడు ఏకంగా 20 మంది మహిళ కానిస్టేబుళ్లను మోసంచేశాడు.  అందరికి పెళ్లి పేరుతో, లగ్జరీ లైఫ్ తో బురిడికొట్టించాడు. ఈ ఘటన ఢిల్లీలో సంచలనంగా మారింది. కరోల్ బాగ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్, తాను మోసపోయానంటూ ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బురిడి ప్రాంతంలో ఉంటున్న విక్రాంత్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో  అనేక విస్తుపోయే విషయాలు  వెలుగులోకి వచ్చాయి. 

విక్రాంత్ సోషల్ మీడియాలో తన లగ్జరీ లైఫ్ తో కూడిన ఫోటోలు పెడుతూ అందరిని నమ్మించాడు. ఆ తర్వాత అందరికి ఫ్రెండ్ రిక్వెస్టులు పెడుతూ తన బుట్టలో వేసుకున్నాడు. అయితే ఇటీవల అతను ఒక లేడీ కానిస్టేబుల్ తో సహాజీవనం సాగిస్తున్నట్లు  గుర్తించారు. ఆమె బ్యాచ్ కు చెందిన వారే దీనిలో ఎక్కువగా ఉన్నట్లు విషయం బైటపడింది.  

ఈ క్రమంలో  వాళ్లతో సరదాగా మాట్లాడి ఆ తర్వాత వారిని ముగ్గులోకి లాగేవాడు. వారి పర్సనల్ విషయాలు ఎమోషనల్ గా వారితో కనెక్ట్ అయినట్లు నటించి వారిని మోసం చేసేవాడు. ఈ విధంగా 20 మంది లేడి కానిస్టేబుళ్ల నుంచి దాదాపు రూ. 24 లక్షల వరకు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ డబ్బులతో ఒకరికి తెలియకుండా మరోకరితో తరచుగా విలాసవంతమైన లైఫ్ ను గడిపేవాడని, దీనిలో కొంత డబ్బులను బెట్టింగ్ కి కూడా ఉపయోగించే వాడని పోలీసులు గుర్తించారు. 

విక్రాంత్ పై ఇప్పటికే ఢిల్లీలో  ఐదు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మాయాపురి, హరి నగర్, ఇందర్‌పురి, తూర్పు జిల్లా సైబర్ పోలీస్ స్టేషన్లలో అతనిపై కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్‌లో అతను బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు.  ప్రస్తుతం సదరు మహిళ కానిస్టేబుల్ ను సైతం పొలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని ఫోన్ లను, లాప్ ట్యాప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఢిల్లీ లో సంచలనంగా మారింది.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Delhi
Crime News
National News
Telugu News