మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో రెడీ.. ఈ నెల 30న నింగిలోకి GSLV-F18 రాకెట్ ప్రయోగం..
ISRO Crucial Mission: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (Indian Space Research Organisation) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంగా ఈ నెల 30న జీఎస్ఎల్వీ-ఎఫ్18 (Geosynchronous Satellite Launch Vehicle) రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
GSLV-F18: ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ సేవలకు సంబంధించిన ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ వ్యాబ్‌లో రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్ తిచేశారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు ఈ నెల 30వ తేదీ రాత్రి 11.55 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.
భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన దిక్సూచి వ్యవస్థ..
మన రోజువారీ ప్రయాణాల నుంచి కీలకమైన నావిగేషన్ సేవల వరకు శాటిలైట్ పాత్ర ఎంతో కీలకం. అయితే భారత్ సొంత నావిగేషన్ వ్యవస్థ నావిక్ మరింత బలోపేతం కావాలంటే ఈ ప్రయోగం మరో కీలక అడుగు అని చెప్పాలి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో NVS-03 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ సేవలను తిరిగి మెరుగుపరచడంలో ఈ ప్రయోగం కీ రూల్ పోషించనుంది. గతంలో ఉపగ్రహాల్లోని అణు గడియారాల పనితీరు నిలిచిపోవడం, వాటి సేవాకాలం ముగియడం, కొన్ని ఉపగ్రహ ప్రయోగాలు విఫలం కావడం వంటి కారణాలతో ఈ వ్యవస్థలో సమస్యలు ఏర్పడ్డాయి.
నావిగేషన్ సేవలను మరింత మెరుగు పరిచేందుకు NVS-03 ఉపగ్రహం..
NVS-03 ఉపగ్రహం రెండో తరం నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో మూడోది. అలాగే భారత ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ IRNSS లో ఇది 12వ ఉపగ్రహం. ఈ ప్రయోగాన్ని ముందుగా 2026 అక్టోబర్ 15 నుంచి 20 మధ్య చేపట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతకు ముందు 2025 చివర్లోనే ప్రయోగించాలనే ప్రణాళిక ఉన్నప్పటికీ, పలు కారణాలతో వాయిదా పడింది.
PSLV
ఇటీవల PSLV ప్రయోగాల్లో ఎదురైన అవాంతరాల నేపథ్యంలో ఇస్రో మరింత జాగ్రత్తగా వ్యవహరించి షెడ్యూల్‌ను సవరించింది. ఈ ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరితే నావిగేషన్ వ్యవస్థకు అవసరమైన కనీసం నాలుగు పనిచేసే ఉపగ్రహాల సంఖ్యను అందుకోవడానికి సహాయపడుతుంది. తద్వారా స్థాన నిర్ధారణ సమాచార సేవలను పునరుద్ధరించే అవకాశం ఉంటుంది.