• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /వరంగల్
  • /Minister Seethakka: చేపకు నీళ్లే బలం.. నాయకుడికి ప్రజలే బలం.. మంత్రి సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Minister Seethakka: చేపకు నీళ్లే బలం.. నాయకుడికి ప్రజలే బలం.. మంత్రి సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Minister Seethakka: మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్నా.. ఏదో ఒక రూపంలో వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారని మంత్రి సీతక్క అన్నారు. పురుష మంత్రులకు దక్కినంత గౌరవం కూడా మహిళా మంత్రులకు లభించదన్నారు. ఒక సాధారణ పేద కుటుంబం నుంచి ఉద్యమ బాట పట్టి.. న్యాయవాదిగా, ఎమ్మెల్యేగా, చివరకు మంత్రిగా ఎదిగిన తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు.

Written ByAshok Krindinti
Published: Oct 24, 2026, 03:46 PM IST|Updated: Oct 24, 2026, 03:48 PM IST
joinshare
Minister Seethakka: చేపకు నీళ్లే బలం.. నాయకుడికి ప్రజలే బలం.. మంత్రి సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Image Credit: Minister Seethakka (Source: Facebook)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Ind vs NZ Highlights: న్యూజిలాండ్‌పై భారత్‌ ఉత్కంఠ విజయం.. గెలుపు బాట పట్టించిన తెలుగు క్రీడాకారులు

Ind vs NZ Highlights: న్యూజిలాండ్‌పై భారత్‌ ఉత్కంఠ విజయం.. గెలుపు బాట పట్టించిన తెలుగు క్రీడాకారులు

2

Sonia Gandhi: తొలిచూపులోనే రాజీవ్‌ గాంధీతో లవ్‌లో పడ్డా: సోనియా గాంధీ

3

Bigg Boss 10 Elimination: బిగ్‌బాస్ 10లో ఊహించని పరిణామం..ఏడో వారం డబుల్ ఎలిమినేషన్..ఎవరెవరు?

4

Minister Seethakka: చేపకు నీళ్లే బలం.. నాయకుడికి ప్రజలే బలం.. మంత్రి సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

5

Delhi: వీడెంట్రా బాబు.. ఏకంగా 20 మంది మహిళా కానిస్టేబుళ్లకు వలపు వల.. ఢిల్లీలో వెలుగులోకి షాకింగ్ ఘటన..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Minister Seethakka: మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. మహిళల రాజకీయ ఎదుగుదలలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయని.. వాటన్నిటికీ భయపడకుండా  వాటిని అధిగమించి మహిళలు ఉన్నత స్థానాల్లోకి చేరుకోవాలని సూచించారు. తన చిన్నతనంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పారు. ఆకలి బాధలు అనుభవించానని.. అయినా అన్ని కష్టాలను ఎదుర్కొని నేడు ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పారు. ములుగు ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ పెద్దల అండదండలతో అతిపెద్ద శాఖ అయిన పంచాయతీరాజ్ శాఖకు మంత్రి కాగలిగానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌ బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సదస్సుకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

"నాకు ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేదు. నా జీవితం కష్టాల కలపోత, పోరాటాల మయం.  నా కష్టాలను, పోరాటాలను ఎప్పటికీ మర్చిపోను. అపార వనరులు ఉన్న ప్రాంతం ములుగు. అలాంటి ప్రాంతంలో ఒక పేద కుటుంబంలో నేను జన్మించాను. చిన్నతనంలో అన్యాయాలను చూడలేక నక్సలైట్ అయ్యాను. నేనెప్పుడూ నక్సలైట్ అవుతానని అనుకోలేదు.. కానీ నక్సలైట్ అయ్యాను.. ఆ తర్వాత లాయర్, ఎమ్మెల్యే మంత్రి అవుతానని ఎన్నడూ ఊహించలేదు. కానీ కష్టాన్ని నమ్ముకొని పనిచేశాను.. నేడు మంత్రిగా మీ ముందు ఉన్నాను. నేను మంత్రిగా ఉన్నప్పటికీ ఎప్పుడు నా మూలాలు మరిచిపోలేదు.

ప్రజా జీవితమంటే ప్రజలతోనే ఉండాల్సిందే.. ఇప్పటికీ ప్రతివారం రెండు రోజులు నేను నా ములుగు ప్రజల మధ్యనే ఉంటాను. ప్రజలతో ఎన్నుకున్న వాళ్లం కాబట్టి ప్రజలతోనే ఉండాలన్నది నా సిద్ధాంతం. ఎమ్మెల్యే మంత్రి కాగానే ప్రజలతో దూరంగా ఉండాలని.. అప్పుడే గౌరవం కలుగుతుందని  కొందరు భావిస్తారు. కానీ నేను ఆ భావనకు పూర్తి విరుద్ధం.. మనము ప్రజలకు జవాబుదారులం.. మనం బాసులం కాదు.. మనం సేవకులం. చేపకు నీళ్లే బలం.. అలాగే నాయకులకు ప్రజలే బలం. నీళ్లు లేకుండా చేత బతకదు.. ప్రజలు లేకుండా నాయకుడు రాజకీయంగా బతకడు.

అయితే మహిళలు ఎంత ఎత్తు ఎదిగినా.. వివక్షతను ఎదుర్కొంటూనే ఉంటారు. పురుష మంత్రులకు వచ్చినంత గౌరవం మహిళా మంత్రులకు ఇవ్వరు. పురుష మంత్రులను గౌరవించినట్టుగా.. మహిళా మంత్రులను గౌరవించరు. అయినప్పటికీ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. డెడికేషన్ డిటర్మినేషన్‌తో పనిచేస్తూ పోవాలి.."     అని మంత్రి సీతక్క సూచించారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Warangal
Telangana News
Telugu News