Jabardasth Comedian: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు టాలీవుడ్ జబర్దస్త్ కామెడియన్లకు తీవ్రగాయాలు..
Dorababu and Rising raju Injured: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దొరబాబు, రైజింగ్ రాజు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి ప్రయాణిస్తున్న కారు ధ్వంసమైంది.
Jabardasth comedian dorababu and raising raju injured west Godavari: ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ జబర్దస్త్ కామెడియన్ లు రైజింగ్ రాజు, దొరబాబులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపక్కనే ఉన్న విద్యుత్ స్తంభంను ఢీకొట్టింది.ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. దొరబాబు, రైజింగ్ రాజులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ సైతం గాయపడ్డాడు.
జనసేన ప్రచారం ముగించుకుని వస్తుండగా జబర్దస్త్ దొరబాబు, రైజింగ్ రాజుకు ప్రమాదంజరగడంతో కూటమి నేతలు ఆందోళనవ్యక్తంచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గోరగనమూడి దగ్గర అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై జబర్దస్ట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.