• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Janhvi Kapoor Chuttamalle AI: జాన్వీకపూర్ వీడియో చేసిందెవరు? AI టెక్నాలజీ మనిషిలకే ప్రాణాతంకమా?

Janhvi Kapoor Chuttamalle AI: జాన్వీకపూర్ వీడియో చేసిందెవరు? AI టెక్నాలజీ మనిషిలకే ప్రాణాతంకమా?

Janhvi Kapoor Chuttamalle AI Case:'దేవర' సినిమాలోని హిట్ సాంగ్ 'చుట్టమల్లే' ఒరిజినల్ వీడియో ఫుటేజ్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో డీప్‌ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ చర్యను యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని వంటి హీరోలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఇప్పుడు హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Written ByHarish Darla
Published: Oct 04, 2026, 07:24 PM IST|Updated: Oct 04, 2026, 07:28 PM IST
joinshare
Janhvi Kapoor Chuttamalle AI: జాన్వీకపూర్ వీడియో చేసిందెవరు? AI టెక్నాలజీ మనిషిలకే ప్రాణాతంకమా?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Janhvi Kapoor Chuttamalle AI: జాన్వీకపూర్ వీడియో చేసిందెవరు? AI టెక్నాలజీ మనిషిలకే ప్రాణాతంకమా?

Janhvi Kapoor Chuttamalle AI: జాన్వీకపూర్ వీడియో చేసిందెవరు? AI టెక్నాలజీ మనిషిలకే ప్రాణాతంకమా?

2

లవంగం బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే జరిగే వింత ఇదే! ఎవ్వరూ చెప్పని 5 సీక్రెట్స్!

3

Jio 3-In-1 Home Pack: జియో వినియోగదారులకు గుడ్‌న్యూస్..ఒకే రీఛార్జ్‌పై 1000 టీవీ ఛానళ్లు, 12 ఓటీటీలు ఉచితం!

4

Manchu Manoj: భార్య మౌనిక పుట్టినరోజున ఎమోషనల్ అయిన మంచు మనోజ్..!

5

Kollam Anju Case: అశ్లీల వెబ్‌సైట్‌లో శోభనం వీడియోలు..నవ వధువును ఘోరంగా టార్చర్ చేస్తున్న వరుడు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Janhvi Kapoor Chuttamalle AI Case: టెక్నాలజీ ఎంత వేగంగా విస్తరిస్తుందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దుర్వినియోగం కూడా అంతే ప్రమాదకరంగా మారుతోంది. అందుకు ఇటీవలే జరిగిన 'దేవర' సినిమాలోని 'చుట్టమల్లే' సాంగ్ డీప్ ఫేక్ వీడియో బయటకు రావడం ప్రధాన కారణంగా నిలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ 'చుట్టమల్లే' పాట దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యింది. 

అయితే, కొందరు ఆకతాయిలు ఈ పాట ఒరిజినల్ వీడియోను ఆధారంగా చేసుకుని ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేస్తూ జాన్వీ కపూర్‌ను అసభ్యంగా చూపించేలా డీప్ ఫేక్ వీడియోను సృష్టించారు. అంతే కాకుండా ఆ అసభ్యకరమైన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో విపరీతంగా ఆ వీడియో వైరల్ అయ్యింది.

ఈ ఘటనపై టాలీవుడ్ కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా అత్యంత తీవ్రంగా స్పందించారు. మహిళలను గౌరవించే మన దేశంలో ఏఐ సాంకేతికతను ఇలా దిగజారిన పద్ధతిలో ఉపయోగించడం తీవ్రమైన సిగ్గుచేటైన చర్య అని ఆయన మండిపడ్డారు. ఈ మార్ఫింగ్ వీడియోను క్రియేట్ చేసే వాళ్లే కాకుండా.. దాన్ని షేర్ చేస్తూ ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలను ఎవరూ చూడవద్దని, షేర్ చేయవద్దని, వాటితో ఎంగేజ్ కాకూడదని అభిమానులకు, ప్రజలకు జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. నేడు సినీ ప్రముఖులకు ఎదురైన ఈ సైబర్ ముప్పు, రేపు మన ఇళ్లలోని ఆడపిల్లలకు కూడా ఎదురయ్యే ప్రమాదముందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

ఎన్టీఆర్ ఆందోళనకు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఘాటుగా స్పందించారు. ఏఐ సాంకేతికతతో మహిళల గౌరవానికి భంగం కలిగించడం అత్యంత క్రూరమైన, అమోగ్యమైన చర్య అని ఖండించారు. ఈ సమస్య కేవలం ఒక నటిది లేదా చిత్రసీమది కాదని, సమాజంలోని మహిళలందరి భద్రతకు సంబంధించినదని స్పష్టం చేశారు. 

తెలుగు ఫిలిం చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లతో చర్చించి సైబర్ వేధింపుల అడ్డుకట్టకు సినీ పరిశ్రమ తరఫున ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ హేయమైన చర్యను ముక్తకంఠంతో ఖండించారు.

హైదరాబాద్‌లో కేసు నమోదు..
మరోవైపు, ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి, డిజిటల్ ఆధారాల సాయంతో వీడియోను మొదట సృష్టించినవారిని, ఆ తర్వాత ప్రచారం చేసినవారిని గుర్తించేందుకు వేట ప్రారంభించారు. ఆకతాయిల ప్రచారాలకు తావు ఇవ్వకుండా నెటిజన్లు ఇలాంటి ఫేక్ కంటెంట్‌ను చూడటం, డౌన్‌లోడ్ చేయడం లేదా షేర్ చేయడం నిలిపివేసి నేరుగా సైబర్ క్రైమ్ అధికారులకు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు రిపోర్ట్ చేయాలని పోలీసులు, సినీ ప్రముఖులు పిలుపునిచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Movie
Telugu News