Chewing Cloves Benefits: సాధారణంగా మనం బిరియాని, బగారా రైస్, ఇతర మసాలా కూరల వంటల్లో లవంగాలను వాడుతుంటాం. ఇది ఆహారానికి మంచి రుచిని అందించడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. లవంగాలు చూడటానికి చిన్నవిగా, నల్లగా ఉన్నప్పటికీ, వీటిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా నోటి దుర్వాసనను, పంటి నొప్పిని తగ్గిస్తాయి. రోజు లవంగాన్ని నోటిలో పెట్టుకుని నమలడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి.
లవంగం ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది, ఇది జీవక్రియ ప్రక్రియలకు ఎంతో ఉపయోగకరం. రోజువారీ అలవాటు వల్ల వృద్ధాప్య ఛాయలను కూడా ఇది తగ్గిస్తుంది. కాబట్టి, ఈ మసాలా దినుసును పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో కలిపి మీ డైట్‌లో భాగంగా తీసుకోవడం మంచిది
లవంగం తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేటరీ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిని నమిలినప్పుడు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం కలుగుతుంది, కాబట్టి వీటిని సమతుల్య ఆహారంతో పాటు తీసుకోవాలి. లవంగాల్లో ఉండే యాంటీ మైక్రోబియల్ ప్రభావం నోటి సమస్యలను పోగొట్టడమే కాకుండా, ఆహారానికి మంచి రుచిని ఇస్తుంది. సీజనల్ జబ్బుల నుండి రక్షణ ఇస్తుంది.
ప్రతిరోజూ ఉదయం ఒక లవంగాన్ని నమలడం మీ దినచర్యలో భాగం చేసుకుంటే, పంటి సమస్యలు తగ్గి నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో మెడిసినల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుంది. అయితే, లవంగాలను అతిగా వాడకూడదు, అలా చేస్తే ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. వైద్యుల సూచన మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి. రోజుకు ఒకటి నమలడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి కానీ, మోతాదు మించకూడదు. ఒకవేళ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తే వాడటం ఆపేయాలి. ముఖ్యంగా బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారు లేదా గర్భిణీలు వైద్యుల సలహా లేకుండా లవంగాలు తీసుకోకూడదు.
కొందరు టీలో కూడా లవంగం వేసుకుని తీసుకుంటారు. దీనివల్ల అందులోని ఔషధ గుణాలు శరీరానికి అంది, నోటి సమస్యలు, అజీర్తి తగ్గుతాయి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)