• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /ఆసక్తి రేకిస్తోన్న ‘జయహో రామానుజ’ ట్రైలర్.. 24న వరల్డ్ వైడ్‌గా రిలీజ్..

ఆసక్తి రేకిస్తోన్న ‘జయహో రామానుజ’ ట్రైలర్.. 24న వరల్డ్ వైడ్‌గా రిలీజ్..

Jayaho Ramanuja Trailer: ‘ఓం నమో నారాయణాయ:’ అంటూ అష్ఠాక్షరి మంత్రాన్ని లోకానికి ఉపదేశించిన శ్రీ వైష్ణవ మత స్థాపకుడు శ్రీ రామానుజ చార్యుల జీవిత చరిత్ర ఎందరికో ఆదర్శం. సుమారు వెయ్యేళ్ల క్రితమే సమసమాజ స్టాపన చేసిన చూపించారు. దళితులకు, బడుగు బలహీన వర్గాలకు ఆలయ ప్రవేశం కల్పించడంతో పాటు ముని వాహన సేవతో మనుషులంతా ఒక్కటే అని చెప్పారు.ఈయన జీవితంపై ‘జయహో రామానుజా’ సినిమా రాబోతుంది. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 15, 2026, 12:00 AM IST|Updated: Oct 15, 2026, 09:40 PM IST
joinshare
ఆసక్తి రేకిస్తోన్న  ‘జయహో రామానుజ’ ట్రైలర్.. 24న వరల్డ్ వైడ్‌గా రిలీజ్..
Image Credit: Jayaho Ramanuja (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
YSRCP Candidates: స్థానిక సమరానికి వైఎస్సార్‌సీపీ సిద్ధం.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల

YSRCP Candidates: స్థానిక సమరానికి వైఎస్సార్‌సీపీ సిద్ధం.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల

2

Elnino reduce tips: ముంచుకొచ్చిన ఎల్ నినో గండం.. ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..?..

3

Bigg Boss 10 Elimination: బిగ్‌బాస్‌ 10లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీళ్లే? హౌస్‌లోకి ముందే స్క్రిప్ట్ వెళ్లిందా?

4

Vijayawada: మూల నక్షత్రం వేళ భక్తులకు శుభవార్త.. ఇంద్రకీలాద్రిపై రేపు వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు.!.

5

కిక్ కొడితే తల పగలాల్సిందే.. పాములను వేటాడే రాక్షస పక్షి.. సెక్రటరీ బర్డ్ వింత ప్రవర్తన వెనుక సీక్రెట్ ఇదే..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jayaho Ramanuja Release Date: రామానుజ చార్యుల  జీవిత చరిత్రపై తెలుగులో పలు చిత్రాలు, ధారావాహికలు  వచ్చాయి. ఈ నేపథ్యంలో రామానుజచార్యుల జీవిత చరిత్రపై ‘జయహో రామానుజ’అనే మరో  మూవీ రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ లాంఛ్ గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రంలో లయన్ డాక్టర్ సాయి వెంకట్  ఈ సినిమాలో టైటిల్ రోల్ రామానుజ చార్యుల వేషంతో పాటు శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన పలు అవతారాల్లో విభిన్న పాత్రల్లో  కనువిందు చేయనున్నారు. ఈయనే డైరెక్ట్ చేస్తున్నారు.

సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ కథానాయికగా నటించారు. సీనియర్ హీరో సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 24న "జయహో రామానుజ" సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించిన  ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో, డైరెక్టర్ లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ - సినిమా ఇండస్ట్రీలో పాతికేళ్ల సినీ ప్రయాణం తనదని గుర్తు చేసుకున్నారు.  మొదటి సినిమా హీరో సుమన్. ఆయన ఇప్పటికీ అలుపెరుగక సినీ ప్రయాణం కొనసాగిస్తున్నారు.  "జయహో రామానుజ" చిత్రంలో మంచి క్యారెక్టర్ చేశారు. ఆధ్యాత్మిక విప్లవకారుడు రామానుజాచార్యుల జీవిత కథతో ఈ సినిమాను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి తెరకెక్కించిన విధానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  గొప్ప సినిమాలను ప్రజలు తండోపతండాలుగా థియేటర్స్ కు వెళ్లి చూస్తుంటారు. మా సినిమాకు కూడా అలాంటి ఆదరణే దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని  డబ్బుల కోసం తీయలేదన్నారు.  రామానుజాచార్యుల వారి గొప్ప కథను ఈ తరం వారికి చూపించాలని ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రాన్ని నిర్మించామన్నారు. టెక్నికల్ గా మంచి క్వాలిటీతో మా సినిమా ప్రేక్షకుల ముందుకు ఈ నెల 24న తీసుకొస్తున్నట్టు చెప్పారు.

నటి, ప్రొడ్యూసర్ ప్రవళ్లిక మాట్లాడుతూ - "జయహో రామానుజ" సినిమాను నిర్మించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు.  అందుకు మా నాన్నకి  థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నిర్మాణ బాధ్యతల వహిస్తూనే పాటు కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించాను. ఈ తరం ప్రేక్షకులకు రామానుజాచార్యుల వారి గొప్పదనం తెలియాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాము.  ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నమ్మి ఈ సినిమాను నిర్మించిన విషయాన్ని ప్రస్తావించారు.

నటుడు సుమన్ మాట్లాడుతూ - ఈ సినిమా గురించి సాయి వెంకట్  చెప్పినప్పుడు చాలా కష్టంతో కూడుకున్న మూవీ కదా అన్నాను. ఆయన మేము ఈ సినిమాను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు  చెప్పారు. ఆయన చాలా కన్విక్షన్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. మన దేశంలో ఎన్నో మతాలు, కులాలు, వర్గాలు ఉన్నాయి. అయినా మనమంతా కలిసే ఉంటున్నాం. ఈ భావనకు మొదట కృషి చేసింది రామానుజాచార్యులవారు. మనమంతా ఒక్కటే అని ఆయన చెప్పిన గొప్ప మాటలు మనల్ని ఇప్పటికీ ఐక్యంగా నడిపిస్తున్నాయన్నారు. ఈ సినిమా మీ ఫ్యామిలీతో కలిసి సంతోషంగా చూడండి పిలుపునిచ్చారు.  రామానుజాచార్యులవారి గొప్పదనం ఏంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుందన్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News