Kamal Haasan Title Controversy: ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్‌పై తమిళనాడులో కేసు నమోదైంది. ఆయన బర్త్ డే సందర్భంగా ఇటీవల ప్రకటించిన సినిమా టైటిల్ తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రాంతీయ, కుల ఘర్షణలను రెచ్చగొట్టేలా ఉద్దేశపూర్వకంగానే ఈ పేరును ఎంచుకున్నారంటూ పుదియ తమిళగం పార్టీ నేతలు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈనెల 7న కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘సండియర్’ టైటిల్‌కు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
చిత్ర బృందంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పుదియ తమిళగం పార్టీ నేతలు..
ఈ పేరు గతంలోనూ వివాదాస్పదమైందని, దీనిని ప్రకటించవద్దని తాము ముందుగానే వారించినప్పటికీ చిత్ర బృందం పెడచెవిన పెట్టిందని పుదియ తమిళగం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ టైటిల్ దక్షిణ తమిళనాడులో కులాల మధ్య ఉద్రిక్తతలను, ఘర్షణలను రెచ్చగొట్టేలా ఉందని ఆరోపిస్తూ పుదియ తమిళగం నేతలు పోలీసులను ఆశ్రయించారు. సినిమా పేరును తక్షణమే మార్చకపోతే దక్షిణ తమిళనాడులో తీవ్రమైన అల్లర్లు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ తమిళనాడులో కులాల మధ్య ఘర్షణలు, రెచ్చగొట్టేలా ఉందని ప్రధాన ఆరోపణ..
వారిచ్చిన కంప్లైంట్ ఆధారంగా కమల్ హాసన్‌తో పాటు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అరుణ్ కుమార్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే కమల్ సినిమాలకు టైటిల్ వివాదాలు కొత్త కాకపోయినా, ఈ తాజా కేసు తమిళ రాజకీయాల్లో సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కమల్ హాసన్ ప్రస్తుతం రజినీకాంత్‌తో ‘ధర్మన్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.