SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Komal Rani: గోవిందను నాశనం చేయడమే ఆమె టార్గెట్.. సునీతా అహుజాపై కోమల్ రాణి షాకింగ్ కామెంట్స్..

Komal rani fires on govinda wife: గత కొన్నేళ్లుగా సునీతా అహుజా గోవింద పతనం కోసం మాత్రమేపనిచేస్తుందని, అలాంటి మహిళ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని కోమల్ రాణి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సునీతా అహుజాపై సంచలన ఆరోపణలు చేసింది.

Written By Inamdar Paresh
Published: Sep 26, 2026, 07:55 PM IST | Updated: Sep 26, 2026, 08:04 PM IST
Image Credit: Komalrani(file)
Join

Komal rani slams on sunita Ahuja over govinda row: బాలీవుడ్ లో ఇటీవల నటుడు గోవింద, కోమల్ రాణిల మధ్య ఎఫైర్ ఉందంటూ రచ్చ నడుస్తొంది. ఈ క్రమంలో గోవింద భార్య సునీతా అహుజా తరచుగా వీరిపై విమర్శలు చేస్తునే ఉంది. కోమల్ రాణికి తన భర్త షుగర్ డాడీలా మారాడని తీవ్ర విమర్శలు చేసింది. ఆయన వద్ద ఉన్న డబ్బుల కోసం కోమల్ రాణి తన వల్లో వేసుకుందని ఆరోపణలు చేసింది. మరోవైపు తన భర్తకు ఎంత మందితో ఎఫైర్ ఉన్నా కూడా ఆయనను వదిలే ప్రసక్తిలేదని చెప్పింది. ఈ ఆరోపణలపై హీరో గోవింద సైతం కౌంటర్ ఇచ్చారు. 

ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల సమాజంలో  తన గురించి చెడుగా  అనుకుంటారని వాపోయాడు. ఒకరి క్యారెక్టర్ గురించి చెడుగా ప్రచారం చేయడం మానుకొవాలని హితవు పలికారు. తాజాగా.. సునీతా అహుజా ఆరోపణలపై కోమల్ రాణి రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సునీతపై కౌంటర్ వేశారు. వారి మధ్య వివాదాలు రావడానికి తాను కారణంకాదని తెల్చి చెప్పారు. తన పోస్ట్ లో.. ఇప్పటికే విచ్ఛిన్నమైన కాపురంలో ఎవరూ కొత్తగా చిచ్చు పెట్టలేరని ఆమె పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా గోవిందాను నాశనం చేసేందుకు సునీత కంకణం కట్టుకుందని విమర్శించింది. 

దీనిలో భాగంగానే ఆయనపై లేనిపోని అసత్య ఆరోపణలు, తనపై ఎఫైర్ ఉందంటూ వాదిస్తుందని కోమల్ రాణి చెప్పుకొచ్చింది. అయితే.. ఇలాంటి వారు చేస్తున్న ఆరోపణలు, శాపాలు ఎవరికి తలగలవని అన్నారు.
గోవిందాను వేధించడం, సమాజంలో ఒంటరిని చేయడంలో పక్కాగాకుట్రకోణంఉందని చెప్పుకొచ్చింది. ఇలాంటి భార్యల వేధింపుల నుంచి ఆ దేవుడే వాళ్లను కాపాడాలని కోమల్ రాణి ఎమోషనల్ అయ్యింది. 

ఇక నటుడు గోవింద, కోమల్ రాణితో కలిసి రూపాలో నటించారు.  వీరిద్దరు ముంబై ఎయిర్ పోర్ట్ లో కన్పించడం, తరచుగా మూవీ ప్రమోషన్లలలో కన్పించడంతో వీరి మధ్య ఎఫైర్ ఉందని సునీతా అహుజా తరచుగా ఆరోపణలు చేస్తుంది. ఇటీవల వీరు ముంబైలోని లాల్‌బాగ్‌చా రాజాను కూడా కలిసి దర్శించుకున్నారు. గోవిందా, సునీతలకు 1987లో వివాహం కాగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కోమల్ రాణి వ్యాఖ్యలతో మరోసారి హీరో గోవింద ఫ్యామిలీ రచ్చ వార్తలలో నిలిచింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES