SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే ‘మన డాక్టర్ బాబే’ మూవీ.. !!

Mana Doctor Babe movie review: టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఓ పుష్పక విమానం వంటిది. ఇక్కడ ఎంత మంది ఉన్నా.. కొత్తవాళ్లకు చోటు దక్కుతూనే ఉంటుంది. ఈ కోవలో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా శ్రీ స్కంధ హీరోగా ‘మన డాక్టర్ బాబే’ మూవీతో పరిచయం అయ్యాడు. ఇప్పటికే టైటిల్‌తో పాటు టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి అంచనాలను ఈ చిత్రం ఏ మేరకు అందుకుందో మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 20, 2026, 13:01 IST | Updated: Nov 21, 2026, 08:10 IST
Image Credit: Mana Doctor Babe Review (X/Source)
Join

Mana Doctor Babe movie review: శ్రీ స్కంద హీరోగా    మోహన సిద్ధి, శృతి శంకర్ హీరో, హీరోయిన్లుగా పరిచయమైన చిత్రం ‘మన డాక్టర్ బాబే’. శృతి శంకర్, అలీ, రాజీవ్ కనకాల, శాంతి, కోటేశ్వరరావు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. శరణ్య, సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద కృతాక్షి నిర్మాణంలో తెరు చలపతి కుమార్ పువ్వల డైరెక్ట్ చేసిన  చిత్రం ‘మన డాక్టర్ బాబే’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..

కథ విషయానికొస్తే..

రాజు (శ్రీ స్కంద) చిన్నపుడే తల్లిదండ్రులు దూరమవుతారు. అతని మేనమామ దుర్గారావు (రాజీవ్ కనకాల) రాజుపై పెద్దగా సదభిప్రాయం ఉండదు. తన మేనల్లుడు రాజుకి తన కూతురు సింధు (శ్రుతి శంకర్)ని ఇచ్చి మ్యారేజ్ చేయడానికి  దుర్గారావ్ ఓ షరతు పెడతాడు. డాక్టర్ అయితేనే తన అల్లుడిగా చేసుకుంటాను అని బంపర్ ఫిట్టింగ్ పెడతాడు. దీంతో రాజు తన మరదలి కోసం కష్టపడి ఎలాగో డాక్టర్ అవుతాడు. కానీ అతను అందులో ఆండ్రాలిజ్డ్ స్పెషలిస్ట్ అవుతాడు. కానీ మామ ఆండ్రాలిజ్డ్‌కు తన కూతురును ఇవ్వను. డాక్టర్ పక్కన ఆండ్రాలిజ్డ్‌ను తీసేయమని చెబుతాడు. దానికి రాజు ససేమిరా అంటాడు. ఈ క్రమంలో గౌతమి (మోహన సిద్ది), డాక్టర్ సుఖం (అలీ), తాత రత్నం (కోటేశ్వరరావుల)ల వల్ల రాజుకు ఎలాంటి సాయం చేశారు. ఈ క్రమంలో ఏం జరిగింది. చివరకు రాజుకు తన మరదలిని పెళ్లి చేసుకున్నాడా..?  లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


కథనం, విశ్లేషణ..

దర్శకుడు చిన్నపుడే తల్లిదండ్రులు చనిపోయి మేనమామ దగ్గర పెరుగుతాడు. కానీ మేనమామకు మేనల్లుడిపై అంత సదభిప్రాయం ఉండదు. తన కూతురును ఇచ్చి చేయడం అతనికి ఇష్టం ఉండదు. అందుకే డాక్టర్ చదివితేనే తన కూతురును ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. అంటే అన్నామంటారు కానీ.. డాక్టర్ చదవడం అంత ఈజీనా.. డబ్బులు సంపాదించడం అన్నా ఏదో రకంగా చేయవచ్చు. డాక్టర్, ఇంజినీర్ వంటి వాటిని చదవాలంటే మంచి తెలివి తేటలు గట్రా ఉండాలి. నువ్వు డాక్టర్ అయిపో అన్నంత మాత్రమానా అయిపోతారా అనేవి కామన్ ఆడియన్స్ లాజిక్‌కు అందని ప్రశ్న. ఇందులో అందమైన ఊరు.. ప్రేమలు.. మేనమామ.. మరదలు కాన్సెస్ట్ నాచురల్ ఫీల్ ఇస్తాయి. బంధాలు, అనుబంధాల మధ్య సంఘర్షణను చూపించిన విధానం బాగుంది.

ఇందులో హీరో డాక్టర్ చదివే క్రమంలో పుట్టే కామెడీ.. మధ్యలో అలీ అడల్డ్ కంటెంట్ కమెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. దర్శకుడు ఈ విషయంలో తన లిమిట్స్ దాటలేదు. మొదటి భాగం అంతా కూడా అండ్రాలిజిస్ట్ డాక్టర్, అతని చుట్టూ జరిగే కామెడీతోనే నడిపించాడు దర్శకుడు.

రాజు, గౌతమి ట్రాక్.. మరదలితో ఇంకో ట్రాక్ ఇలా అన్నీ సాగుతుంటాయి. మేనమామ పెట్టే కండీషన్‌తో ఇంటర్వెల్ బ్లాక్ పడుతుంది. ఆ తర్వాత కథలో మరో ట్విస్ట్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. కామెడీగా సాగుతూనే ఎమోషనల్ టచ్‌తో ఎండ్ కార్డ్ వేసాడు దర్శకుడు. కామెడీతో పాటు ఎమోషన్ టచ్‌తో ఫ్యామిలీ ప్రేక్షకులు చూసేలా ఈ సినిమా ఉంది.

ఈ మూవీకి కిషోర్ బోయిడపు అందించిన విజువల్స్ నాచులర్‌గా ఉన్నాయి. మనోజ్ కుమార్ బీజీఎం మెప్పిస్తుంది. సెల్వ కుమార్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కమర్షియల్‌గా ఈ సినిమా ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి మరి.


నటీనటుల విషయానికొస్తే.. 
హీరోగా తొలి చిత్రమే అయినా శ్రీ స్కంద తన నటనతో మెప్పించే ప్రయత్నం చేశాడు. కొత్త పిల్లాడు ఉన్నంతో బాగా చేశాడు. కామెడీ, యాక్షన్ సీన్స్‌లో మెప్పించినా.. ఎమోషనల్ సీన్స్‌లో ఇంకాస్త బెటర్‌గా చేసి ఉండాల్సింది. మోహన సిద్ది, శ్రుతి శంకర్ తెరపై గ్లామరస్‌గా కనిపించారు. ఇద్దరి పాత్రలకు తగిన ప్రాధాన్యం లభించింది. తాతగా కోటేశ్వరరావు, మేనమామగా రాజీవీ కనకాల, శాంతి పాత్రలు కథలో భాగంగా కుదిరాయి.  అలీ మరోసారి తన అడల్ట్ కామెడీతో మెప్పించారు. మిగిలిన పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

పంచ్ లైన్.. కామెడీ + ఎమోషనల్‌గా సాగే ‘మన డాక్టర్ బాబే’..


రేటింగ్: 3/5

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES