Chiranjeevi: ఏఐ, డీప్ ఫేక్‌ల దుర్వినియోగంకు చెక్ పెట్టండి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిరంజీవి కీలక విజ్ఞప్తి..
Chiranjeevi letter to kishan reddy: డీప్ ఫెక్ లు, ఏఐ దుర్వినియోగంపై చర్యలు తీసుకొవాలని మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ప్రత్యేకంగా వినతి పత్రం అందజేశారు.
Chiranjeevi letter to Union minister kishan reddy over ai misuse: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ఏఐ టెక్నాలజీ, డీప్ ఫెక్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే.. దీన్ని కొంత మంది డెవలప్ మెంట్ కోసం ఉపయోగిస్తే మరికొంత మంది మాత్రం తప్పుడు మార్గంలో ఉపయోగించుకుని మానవ భద్రతనే ప్రశ్నార్థకంగా మార్చేశారు. ముఖ్యంగా డీప్ ఫెక్ తో అశ్లీల వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ, సినిమా రంగ ప్రముఖుల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. దీంతో చాలా మంది ఈ ఘటనపై సైబర్ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తాజాగా.. మెగాస్టార్ చిరంజీవి డీప్ ఫెక్, ఏఐ లను దుర్వినియోగంపై చర్యలు తీసుకొవాలంటూ మెగా స్టార్ చిరంజీవి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి లేఖను అందజేశారు.
ప్రముఖ నటుడు, చిరంజీవిత డీప్ ఫెక్, ఏఐ టెక్నాలజీ దుర్వినియోగంపై చర్యలు తీసుకొవాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞాపన పత్రంను అందజేశారు. ఈ కంటెంట్ వల్ల చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల వ్యక్తిత్వ హననంకు గురౌతున్నారని, గౌరవానికి తీవ్ర ఇబ్బందులు వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు.
దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. అంతే కాకుండా.. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితన భరోసా ఇచ్చారు.మరోవైపు ఇటీవల కేంద్ర హోమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వచ్చినప్పుడు సైతం చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి ఏఐ, డీప్ ఫెక్ దుర్వినియోగంపై వినతి పత్రం అందజేసిన విషయం తెలిసిందే.