‘బా బా బ్లాక్ షీప్’ మూవీపై మేఘాలయ సీఎం ప్రశంసలు.. సినిమాలో అంతగా ఏముందంటే..?
Baa Baa Black Sheep Praises by Meghalaya CM: ప్రస్తుతం మన చిత్రాలను చిత్రీకరిస్తున్నారు. కానీ మన దేశంలోనే విదేశాలను తలదన్నే లొకేషన్స్ ఎన్నో ఉన్నాయి. అక్కడ షూటింగ్ కాదని ఎక్కడో దూరం కొండలు నునుపు అని అక్కడి వెళుతున్నారు మన మేకర్స్. కానీ ‘బా బా బ్లాక్ షీప్’ నిర్మాతలు మన దేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలకు నెలవైన మేఘాలయలో తమ సినిమాను చిత్రీకరించారు. దీంతో ఆ రాష్ట్ర సీఎం స్వయంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
Conrad Sagma Praises: ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మేఘాలయ అందమైన లోయలు, పర్వతాలతో పర్యాటకులకు ఆకర్షించడంలో ముందు వరసలో ఉంది. ఇక్కడ బాలీవుడ్, ఇతర భాషలకు సంబంధించిన చిత్రాలను షూట్ చేసిన ఇప్పటి వరకు మన తెలుగు దర్శక, నిర్మాతలు ఈ రాష్ట్రం వైపు చూడలేదు. తాజాగా ‘బా బా బ్లాక్ షీప్’ అనే క్రైమ్ కామెడీ సినిమాను మేఘాలయలో పిక్చరైజ్ చేశారు. పూర్తిగా బ్లాక్ క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉందని మేకర్స్ తెలిపారు.
ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, రెండు పాటలు ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేశాయి. ఈ నేపథ్యంలో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా.. ‘బా బా బ్లాక్ షీప్’ చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ వీడియో విడుదల చేశారు. అంతేకాదు తమ రాష్ట్రంలో పిక్చరైజ్ చేస్తే ప్రత్యేక రాయితీలు ఇస్తామంటున్నారు.
ఈ సందర్బంగా మేఘాలయ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “ఇది మా రాష్ట్రానికి గర్వకారణమైన క్షణం”. మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి తెలుగు సినిమా ఇదే అన్నారు. ఓ రకంగా తొలి దక్షిణ భారత చలనచిత్రం ఇదేనని కితాబిచ్చారు. ఈ సినిమా రాష్ట్ర అందాలను మన కొండలకు ఆవల ఉన్న ప్రేక్షకులకు చేరువ చేస్తుందనని ఆనందం వ్యక్తం చేశారు. పొగతో నిండిన మంచు కొండలు, అద్భుతమైన జలపాతాలు, స్వచ్ఛమైన నదులు, సజీవ వేర్ల వంతెనలను ఆయన ప్రస్తావిస్తూ..“మన నేలను ప్రపంచంతో పంచుకునేందుకు సినిమా మరో చక్కని అవకాశమన్నారు.
నిర్మాత వేణు దోనేపూడికి, చిత్రాలయం స్టూడియోస్‌కు, నటీనటులకు, సాంకేతిక బృందానికి సంగ్మా అభినందనలు తెలిపారు. “సినిమా చిత్రీకరణ కోసం మేఘాలయ రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. దాని అందాలను వెండితెరపైకి తెచ్చినందుకు ధన్యవాదాలన్నారు. సినిమా నిర్మాణం రాష్ట్ర యువతకు, స్థానిక సమాజాలకు అవకాశాలనిస్తుందన్నారు. వారు తమ ప్రతిభను చాటుకునేందుకు, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు వీలు కల్పిస్తుందన్నారు. ఈ సినిమా తర్వాత మరింత మంది సినీ నిర్మాతలను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నామని సంగ్మా పేర్కొన్నారు.
అక్టోబర్ 9న రిలీజ్ అవుతున్న బా బా బ్లాక్ షీప్ చిత్రం హాస్యం, ఊహించని మలుపులు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తుందని సంగ్మా తెలిపారు. “తెరపై మేఘాలయ ప్రకృతి అందాలు ఆకట్టుకున్నప్పుడు, దాని అందాన్ని, సంస్కృతిని, ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వయంగా అనుభవించేందుకు థియేటర్స్‌కు రండి” అని ఆయన అన్నారు.
చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. “మేఘాలయ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా మద్దతు, ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు. మేఘాలయ ప్రజలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. అక్కడి ప్రకృతి దృశ్యాలు, ఆతిథ్యం ‘బా బా బ్లాక్ షీప్’కు ప్రాణం పోశాయన్నారు. ఈ రాష్ట్రంలో మరెన్నో చిత్రాలు తీయాలని ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. సంగ్మా ప్రోత్సాహం మా బృందానికి ఎంతో విలువైనదన్నారు. అక్టోబర్ 9న విడుదలయ్యే ఈ చిత్రం మేఘాలయకు గర్వకారణంగా నిలుస్తుందన్నారు.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ చిత్రాన్ని దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై గుణి మంచికంటి డైరెక్ట్ చేశారు. వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 9న సినిమా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని చెప్పుకొచ్చారు.