SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కెమెరా ముందే కాదు... కార్గిల్ సరిహద్దుల్లో తుపాకీ పట్టిన ఏకైక నటుడు నానా పాటేకర్..!

Nana Patekar As Soldier: తెరపై ఎన్నో చిత్రాల్లో సైనికుడి పాత్రల్లో అలరించిన నానా పాటేకర్.. నిజ జీవితంలో కూడా సైనికుడిగా కార్గిల్ యుద్ధంలో పనిచేసారు. అవును వెండితెరపై ఎన్నో చిత్రాల్లో జవానుగా అలరించిన ఈయన 1999 కార్గిల్ యుద్దంలో పాల్గొన్న విషయం చాలా మందికి తెలియదు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 08, 2026, 01:52 PM IST | Updated: Oct 08, 2026, 01:54 PM IST
Image Credit: Nana Patekar (File Pic/Source)
Join

Nana Patekar: ‘కార్గిల్ వార్’ దాదాపు రెండు నెలల పాటు జరిగిన ఈ యుద్ధంలో పాకిస్తాన్‌ పై భారత్ విజయం సాధించింది. అంతేకాదు మే 3న ప్రారంభమైన యుద్ధం జూలై 26న ముగిసింది. ఆ రోజున భారత్.. విజయ్ దివస్‌గా సెలబ్రేట్ చేసుకోంటోంది. ఆ యుద్ధంలో పాల్గొన రోజులను పలు ఇంటర్వ్యూల్లో నానా పాటేకర్ ప్రస్తావించారు. దేశానికి తన వంతు సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో నానా ఆర్మీలో చేరారట.

ఆర్మీలో చేరడం అంతా ఈజీ కాదు.. 
ఇక ఆర్మీలో చేరాలంటే ఎన్నో కఠిన నియమ నిబంధనలున్నాయి. ముఖ్యంగా రన్నింగ్ సహా ఎన్నో ఫిజికల్ టెస్టుల్లో పాస్ అయి ఆ తర్వాత రాత పరీక్షల్లో ఉత్తీర్ణలై  ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ తర్వాత వారిని ఆర్మీలో తీసుకుంటారు.  

ఇక కార్గిల్ యుద్ద సమయంలో ఆర్మీలో చేరాలనే తన ఆకాంక్షను అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కలిసి తన మనసులో కోరికను బయటపెట్టారు. అప్పట్లో  దానికి ఆయన నో చెప్పారు. దాంతో తాను గతంలో కమాండ్ కోర్సు చేసిన విషయంతో పాటు  ఆయుధాలు ఉపయోగించే విషయంలో శిక్షణ కూడా తీసుకున్నట్టు చెప్పారట. అంతేకాదు నేషనల్ లెవల్లో రైఫిల్ షూటింగ్‌లో కాంస్య పతకం కూడా గెలిచినట్టు చెప్పుకొచ్చారు.

60 రోజులు ఆర్మీతో ప్రయాణం..

నానా పటేకర్ చెప్పిన విషయాలన్నీ విన్న ఫెర్నాండెజ్.. మీరు ఎపుడు వెళ్లాలనుకుంటున్నారు..? తాను రెడీ ఉన్నట్టు చెప్పారు. అలా 60 రోజులు పాటు ఆర్మీతో కలిసి పనిచేశాను. అప్పట్లో నానా.. లెహ్, కుప్వారా, బారాముల్లా, ద్రాస్, పోపోరి ప్రాంతాల్లో ట్రూప్స్‌తో కలిసి పనిచేసినట్టు చెప్పారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే క్విక్ రియాక్షన్ టీమ్‌లో సభ్యుడిగా చేర్చుకున్నారు. అంతేకాదు 76 కేజీలతో వెళ్లి.. ఆ తర్వాత 56 కేజీలతో తిరిగివచ్చినట్టు చెప్పారు.

అసలు పేరు ఏంటి?
నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పాటేకర్. ఆయన 1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుడ్ - జంజీరాలో జన్మించారు. ముంబైలోని సర్ జె.జె. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్‌‌లో డిగ్రీ తీసుకున్నారు. స్టేజ్ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నానా పాటేకర్.. 1978లో వచ్చిన 'గమన్' సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు.

'పరిందా'తో వచ్చిన భారీ గుర్తింపు..
నానా పాటేకర్ కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించినా 1988లో వచ్చిన 'సలామ్ బాంబే!' చిత్రంతో నటనకు మంచి ఫేమ్ సంపాదించారు. ఆ తర్వాత 1989లో విడుదలైన 'పరిందా' ఆయన కెరీర్‌ను మరింత మలుపు తిప్పింది. ఈ చిత్రంలోని నటనకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.ఈ సినిమాలో అన్నగా ఆయన  నటనను ఎవరు మరిచిపోలేరు. అనిల్ కపూర్, మాధురి దీక్షిత్‌లను శోభనం రోజు చంపే సీన్ హైలెట్‌గా నిలిచింది.

అదే 1994లో ‘క్రాంతివీర్’ సినిమాలో నటనకు జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక ఈయన సైనికుడిగా నటించిన ‘తిరంగ’, ‘ప్రహార్’ చిత్రాలు మంచి విజయాలనే సాధించాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES