నాని కొత్త అవతార్.. బ్లడీ రొమియో కోసం పూర్తి మేకోవర్..
Nani Make over: నాని కొత్త లుక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్యారడైజ్ కోసం మాస్ లుక్‌లోనే రెండేళ్లకు పైగా ఉన్న నాని.. ఇప్పుడు సుజీత్ తెరకెక్కిస్తున్న బ్లడీ రోమియో కోసం పూర్తిగా స్టైలిష్‌గా మారిపోయారు. ఇన్నాళ్లూ కాస్త సీక్రెట్‌గానే ఉంచిన ఈ లుక్‌ను రీసెంట్‌గా బయట పెట్టాడు. అలియాస్ రుక్మిణీ జామ్ పార్టీ వీడియోలో నాని లుక్ చూసి అందరు ఫిదా అవుతున్నారు.
Nani Look: నాని గత కొన్నేళ్లుగా ఒక సినిమాలో ఉన్నట్టు మరో సినిమాలో ఉండటం లేదు. అంటే సుందరానికి సినిమాలో క్లాస్‌గా కనిపించిన ఈయన.. దసరా పూర్తిగా మాస్‌లుక్‌లో కనిపించాడు. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’ చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. తాజాగా ‘ప్యారడైజ్’ కోసం పూర్తి మాస్ లుక్‌లో దర్శనమిచ్చి సర్ప్రైజ్ చేశాడు. తాజాగా తన నెక్ట్స్ సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు. సుజీత్ డైరెక్షన్‌లో వస్తున్న ‘బ్లడీ రోమియో’ సినిమా కోసం నాని అల్ట్రా స్టైలిష్ లుక్‌లోకి ట్రాన్ఫామ్ అయి పోయి ఆడియన్స్‌ను సర్రైజ్ చేశాడు.
తాజాగా బయటికి వచ్చిన అలియాస్ రుక్మిణీ జామ్ పార్టీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నాని చాలా ఫ్రెష్‌గా, మునుపెన్నడూ చూడని కంప్లీట్ స్టైలిష్ గెటప్‌లో కనిపించి ఇంప్రెస్ చేస్తున్నాడు. సినిమా థీమ్‌కు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడంలో నాని డెడికేషన్ ఏంటో అర్ధమైవుతుంది.
హీరోలను సూపర్ స్టైలిష్‌గా, యాక్షన్ మోడ్‌లో చూపించడంలో సుజీత్ టేకింగ్ ఎంత బాగుంటుందో సాహోలో ప్రభాస్, ఓజిలో పవన్‌ను చూస్తే అర్ధం చేసుకోవచ్చు. తాజాగా నానితో ‘బ్లడీ రోమియో’ను కూడా యాక్షన్ ఎలిమెంట్స్‌తో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసారు.
ఎక్కడా విరామం లేకుండా వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు సుజీత్. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను 2027 వేసవిలో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. నాని కొత్త లుక్, సుజీత్ టేకింగ్‌తో బ్లడీ రోమియోపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్యారడైజ్‌తో కాస్త స్లో అయిన నాని కెరీర్‌కు ఈ సినిమా మళ్లీ ఊపు తేవడం ఖాయం అని చెప్పాలి.