బాక్సాఫీస్ దగ్గర నాని ఊర మాస్ ఊచకోత.. ఫస్ట్ డే ‘ప్యారడైజ్’ రికార్డుల జాతర..
The Paradise Movie First Day Box Office Collections: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన ‘ది ప్యారడైజ్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తుంది. అంతేకాదు ఫస్ట్ డే పలు రికార్డులను తన పేరున నమోదు చేసుకునే పనిలో పడింది.
The Paradise Movie Box office Predictions: అవును నాని.. బాక్సాఫీస్ దగ్గర మాయ చేస్తున్నాడనే చెప్పాలి. గతంలో ఆయన హీరోగా నటించిన పలు చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నింటిని ఒక్క రోజులోనే రాబట్టే పనిలో పడ్డాడు. రిలీజ్ కు ముందు బుక్ మై షో ఓపెన్ చేయగానే ‘ది ప్యారడైజ్’ మూవీ ఊహించని రేంజ్‌లో ఊచకోత కోసిందనేది ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. అంతేకాదు నాని కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ‘ది ప్యారడైజ్’ మూవీ రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా దాదాపు రూ. 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే మాములు విషయం కాదు. టైర్ 2 హీరోల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
ప్రపంచ వ్యాప్తంగా 2 వేల స్క్రీన్స్‌లో విడుదల..
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 900 స్క్రీన్స్‌లో విడుదలైంది. కర్ణాటక, భారత్‌లోని ఇతర ప్రాంతాల్లో 500 వరకు స్క్రీన్స్ , ప్రపంచ వ్యాప్తంగా కలుపుకుంటే 2 వేల స్క్రీన్స్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్‌తో రూ. 10 కోట్ల గ్రాస్ రచ్చ చేసిన ‘ది ప్యారడైజ్’ మూవీ.. ఓవర్సీస్‌లో $1.5 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టనుంది. అంతేకాదు అక్కడ ఎంత లేదన్నా.. రూ. 15 కోట్ల నుంచి రూ. 16 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశాలున్నాయి.
ప్రీమియర్స్ తో కలిపి రూ. 50 కోట్ల గ్రాస్..
డే వన్ ప్రీమియర్స్ అన్ని కలిపి దాదాపు రూ. 50 కోట్ల గ్రాస్ దాటడం పక్కా అని చెబుతున్నారు. చాలా మటుకు మీడియం రేంజ్ సినిమాలు డబుల్ డిజిట్ షేర్.. గ్రాస్ కోసం కష్టపడుతుంటూ.. నాని ‘ది ప్యారడైజ్’ మాత్రం ఏకంగా మొదటి రోజు రూ. 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 కోట్ల షేర్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఈ సినిమాకు వచ్చిన మిక్స్‌డ్ టాక్ నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి మరి.