SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

NTR Anil Ravipudi Movie Update: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ అన్ని ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ‘దేవర’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. ఆ తర్వాత వార్ 2తో పలకరించాడు. ప్రస్తుతం ‘డ్రాగన్’ మూవీతో పలకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సడెన్‌గా అనిల్ రావిపూడితో కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నట్టు ప్రకటించాడు.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 15, 2026, 11:12 AM IST | Updated: Nov 15, 2026, 11:15 AM IST
Image Credit: Adhurs Sequel (X/Source)
Join

Adhurs Sequel: ఎన్టీఆర్ వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది రెండు నెలల గ్యాప్‌లో రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.  ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో కార్తికేయ స్వామిపై ఓ పౌరాణిక చిత్రం చేయనున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ గ్యాప్‌లోనే అనిల్ రావిపూడితో ఓ కామెడీ ఎంటర్టైనర్‌ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

2028 సంక్రాంతి కానుకగా రిలీజ్.. 

ఈ సినిమాను వచ్చే యేడాది జూన్‌లో ప్రారంభించి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ చిత్రాన్ని అదుర్స్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. వినాయక్ తెరకెక్కించిన ‘అదుర్స్’ సినిమా కల్ట్ కామెడీ క్లాసిక్‌గా నిలిచిపోయింది. అనిల్ రావిపూడి కూడా ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టు పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నాడు.

కామెడీ ఎంటర్టైనర్‌గా అదుర్స్ 2

ఇప్పటి వరకు పూర్తి యాక్షన్ మోడ్‌లో వెళుతున్న ఎన్టీఆర్‌.. కాస్త రిలీఫ్‌గా ఈ కామెడీ ఎంటర్టైనర్  చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం చేసింది కళ్యాణ్ రామ్ కావడం విశేషం. ఇపుడు మరోసారి అనిల్ రావిపూడి ఈ బ్యానర్‌లో సినిమా చేయడం విశేషం. మొత్తంగా ఎన్టీఆర్‌, అనిల్ రావిపూడి కాంబో ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మొత్తంగా అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్, బాలయ్య, ఇపుడు ఎన్టీఆర్‌ సహా ముగ్గురు నందమూరి హీరోలతో సినిమా చేసిన దర్శకుడుగా నిలవడం విశేషం.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES