తెలుగులోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’.. క్రైమ్ కామెడీ డ్రామా గ్లింప్స్ చూశారా..!
Odia Blockbuster Jadi: ఒడియా ఇండస్ట్రీలో ఘనవిజయం అందుకున్న క్రైమ్ కామెడీ డ్రామా ‘జడి’ (ది అన్‌టోల్డ్ సైడ్ ఆఫ్ ఇఫ్) త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Odia Blockbuster Jadi: ఒడియాలో సూపర్ హిట్‌గా నిలిచిన క్రైమ్ కామెడీ డ్రామా మూవీ జడి (ది అన్‌టోల్డ్ సైడ్ ఆఫ్ ఇఫ్) త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ప్రొడక్షన్స్ అధినేత ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ సమర్పణలో ఈ సినిమాలో తెలుగులో విడుదల కానుంది. శ్రీయాన్ష్ ప్రొడక్షన్స్ పతాకంపై కాజల్ రే నిర్మించిన ఈ చిత్రానికి దిబ్య జ్యోతి ఉదయ సింగ్ దర్శకత్వం వహించారు. సైలేంద్ర సమంతరాయ్, ప్రియంబద స్వైన్, ఆకాశ్ హోతా ప్రధాన పాత్రలు పోషించారు. సుశాంత్ దాస్ మహాపాత్ర, రబి మిశ్రా, బాలకృష్ణ నాయక్, కృష్ణ రౌత్ కీలక పాత్రల్లో నటంచారు. తాజాగా తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.
గ్లింప్స్‌లో పల్లెటూరి వాతావరణంలో సాగే ఈ కథలో కాలేజ్ యువకుల స్నేహం, అల్లరి, స్వచ్ఛమైన ప్రేమ ప్రధానంగా చూపించారు. కాలేజీలో ఫ్రెండ్స్ స్నేహం, అనుబంధాలు, ప్రేమ, ఫ్రెండ్స్ మధ్య గొడవ, ఊహించని మలుపులతో సీరియస్ క్రైమ్ డ్రామాగా మారుతుంది. జీవితంలో మనం తీసుకునే చిన్న చిన్న తప్పుడు నిర్ణయాలు, అనుకోని పరిస్థితులు ఎలాంటి సంక్షోభాలకు దారితీస్తాయి..? వాటి పరిణామాలు ఆ యువకుల భవిష్యత్తును, వారి బంధాలను ఎలా ప్రభావితం చేశాయి..? అనే అంశాలను ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో, వినోదం , భావోద్వేగాలతో ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది.
గ్రామీణ వాతావరణం రుద్రకాంత సింగ్ తన కెమెరా పనితనంతో అద్భుతంగా తెరకెక్కించగా.. అభిషేక్ పనిగ్రాహి సమకూర్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి మరింత ప్లస్ అయింది. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా రాకేందు మౌళి అందించిన డైలాగ్స్, పాటల సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సోమేశ్ సత్పతి మ్యూజిక్ అందించగా.. మనస్ కుమార్ సాహూ ఎడిటర్‌గా పని చేశారు. తెలుగు వర్షన్ విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
టెక్నీకల్ టీమ్:
- సమర్పణ (తెలుగు): ఉడుగుల అశ్విని కుమార్ గౌడ్ (మెగా ప్రొడక్షన్స్)
- నిర్మాత: కాజల్ రే (శ్రీయాన్ష్ ప్రొడక్షన్స్)
- రచన, దర్శకత్వం: దిబ్య జ్యోతి ఉదయ సింగ్
- తెలుగు డబ్బింగ్, మాటలు, పాటలు: రాకేందు మౌళి
- సినిమాటోగ్రఫీ: రుద్రకాంత సింగ్
- మ్యూజిక్: సోమేశ్ సత్పతి
- బీజీఏం: అభిషేక్ పనిగ్రాహి
- ఎడిటింగ్: మనస్ కుమార్ సాహూ
- మార్కెటింగ్: స్టార్ సర్కిల్
- PRO: సాయి సతీష్