SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పెద్ది, ప్యారడైజ్, పుష్ప ఈ మూడు సినిమాల్లో ఉన్న పోలిక ఇదే..

Peddi -Paradise - Raaka: అవును రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’, నాని హీరోగా నటించిన ‘ప్యారడైజ్’, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రాకా’ ..ఈ మూడు సినిమాల్లో ఉన్న పోలిక ఇదే అంటున్నారు. ‘పెద్ది’ సినిమా ఆల్రెడీ విడుదలైంది. ప్యారడైజ్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Reported By TA Kiran Kumar Sharma Written By TA Kiran Kumar Sharma
Published: Sep 22, 2026, 06:48 AM IST | Updated: Sep 23, 2026, 10:38 AM IST
Image Credit: Movie Story
Join

Same Concept Movies: ఏం చేసినా గుర్తింపు కోసమే.. తెలుగు ఇండస్ట్రీలో స్టోరీలన్ని  ఐడెండిటీ కోసమే అన్నట్టుగా వస్తున్నాయి.  వాటి చుట్టూనే కథలు అల్లుకుంటున్నారు డైరెక్టర్స్.  హీరోలు కూడా అలాంటి కథలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ మూడు సినిమాలు పేర్లు కూడా ఇంగ్లీష్ అక్షరం ‘P’తోనే మొదలు కావడం విశేషం.  

ఇంటి పేరు కోసమే ‘పుష్ప’
అల్లు అర్జున్ పుష్ప సినిమా కథ అంతా ఇంటి పేరు కోసమే ఉంటుంది. ఎంత చేసినా ఏం చేసినా హీరో పేరు ముందు ఓ ఇంటి పేరు వచ్చాకే కథ ముగింపుకు వస్తుంది. ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. అంతేకాదు ఈ సినిమా తెలుగులో కంటే హిందీ బెల్ట్‌లో ఇరగదీసింది. అంతేకాదు హిందీ చిత్ర సీమలో బాహుబలి తర్వాత ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ప్రాంతీయ భాష చిత్రంగా రికార్డులు తిరగరాసింది.

పెద్ది..

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా కథ అంతా ఊరికి గుర్తింపు కోసం.. తమను మనుషులుగా గుర్తించాలంటూ కథానాయకుడు చేసే పోరాటం ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది. ఊరు నుంచి రైల్వే ట్రాక్ వెళుతున్న రైల్వే స్టేషన్ ఉండని ఊరు కోసం హీరో ఏం చేశాడనేది మనందరం తెరపై చూశాము. ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన మిగతా భాషల్లో ఈ సినిమాకు పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. తెలుగులో కూడా ఒక్క తెలంగాణలో మాత్రమే బ్రేక్ ఈవెన్ అయింది. మిగిలిన ప్రాంతాల్లో ఈ సినిమా  బయ్యర్స్ కొత్త మేర నష్టపోయారు.

‘ది ప్యారడైజ్’.. 
తాజాగా  నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’  కథ కూడా షికారి అనే ఓ జాతి గుర్తింపు కోసం నాయకుడు చేసే పోరాటం ఇతి వృత్తంతో రాబోతుంది. దాని చుట్టూనే ఈ కథ అంతా నడుస్తుంది. ఈ సినిమాలో మోహన్ బాబు షికంజా మాలిక్ అనే పాత్రలో నటించాడు. షికాంజా మాలిక్ హీరో అనధికార తండ్రి పాత్ర. తన తండ్రి తమను గుర్తించడు. దాని కోసం హీరో చేసే పోరాటమే ‘ది ప్యారడైజ్’ స్టోరీ.  ఓ రకంగా తండ్రి ఇంటి పేరు కోసం హీరో చేసే పోరాటమే ‘ది ప్యారడైజ్’ మూవీ స్టోరీ. మొత్తంగా ఈ మూడు కథలు కూడా దాదాపు గుర్తింపు కోసమే అన్నట్టుగా రాబోతున్నాయి. ఈ సినిమాకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చారు. మరి తొలిసారి నాని సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కాస్త మంచి టాక్ వచ్చినా.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇరగదీయడం ఖాయం. తేడా కొడితే మాత్రం  మరో ‘టాక్సిక్’ అయినా.. ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES