పుట్టిన రోజున అన్నింటికీ సమాధానం చెప్పిన ప్రభాస్..
Prabhas Answers on Upcoming Movies: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఫుట్టినరోజున తన సినిమాలకు సంబంధించిన బిగ్ అప్‌డేట్స్ ఇచ్చారు. మొత్తంగా ‘ఫౌజీ’ మూవీ నుంచి స్పిరిట్, కల్కి 2, సలార్ 2 సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.
Prabhas Big Updates: డార్లింగ్ తన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటైన కల్కి 2 నుంచి ప్రత్యేక ట్రీట్ అందించింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ భారీ సీక్వెల్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే మొదటి భాగంతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన కల్కి టీమ్, రెండో భాగంతో ఎలాంటి అద్భుతాన్ని చూపించబోతోందన్న ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది. ఈ సారి కర్ణుడిగా.. భైరవుడిగా ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తైయినట్టు సమాచారం. ‘కల్కి 2’ షూటింగ్‌లో ప్రభాస్ ఎపుడు జాయిన్ అవుతాడనే దానిపై ఈ సినిమా రిలీజ్ ఆధారపడి ఉంది. భైరవగా డార్లింగ్ మరోసారి ఎప్పుడు సెట్స్‌లో అడుగుపెడతాడు? ఈ ప్రశ్నలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో మాత్రం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే కదా. ఇక జూన్ 2027 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ప్రశాంత్ నీల్ బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఇక ‘స్పిరిట్’ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను ప్రభాస్ పుట్టినరోజున కాకుండా దసరా నవరాత్రిల్లోనే ఈ చిత్రం వచ్చే యేడాది సమ్మర్ నుంచి దీపావళికి పోస్ట్ పోన్ అయినట్టు ప్రకటించారు.
ఇక రాత్రి ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. ఈ గ్లింప్స్‌లో ఆజాద్ హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగిన సంభాషణలో యుద్దంలో గెలవాలంటే బలం సరిపోదు. తెలివి కావాలి. తన దగ్గర పనిచేసే ఓ సీక్రెట్ ఏజెంట్ గురించి చెప్పే సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఆజాద్ హింద్ ఫౌజ్ కు సంబంధించిన గూఢచారిగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. అంతేకాదు ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించి ప్రభాస్ అభిమానులను సంతృప్తి పరిచారు. మొత్తంగా ప్రభాస్ తన పుట్టినరోజు సందర్బంగా నాలుగు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేశారు.