SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

కాంట్రవర్సీలో ప్రభాస్ ‘ఫౌజీ’.. అసలు మ్యాటర్ ఏమిటంటే..!!

Fauzi Controversy: ప్రభాస్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘ఫౌజీ’. రీసెంట్‌గా ప్రభాస్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన ‘ఫౌజీ’ గ్లింప్స్ పై వివాదాలు చెలరేగుతున్నాయి. అంతేకాదు ఫౌజీ నుంచి విడుదల చేసిన కంటెంట్ పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడైన సుభాష్ చంద్రబోస్‌ను తక్కువ చేసి చేపినట్టు ఉంది. మరోవైపు కల్పిత పాత్రను హైలెట్ చేయడం పై కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 29, 2026, 07:24 AM IST | Updated: Oct 29, 2026, 07:25 AM IST
Image Credit: Fauzi Movie Controversy (X/Source)
Join

Prabhas Fauzi: ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగ విడుదల చేసిన ‘ఫౌజీ’ వీడియోలోని ఒక సీన్ సామాజిక మాధ్యమాల్లో  సెన్సేషన్‌గా మారింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్  లాంటి స్వతంత్య్ర సమరయోధుడు హిట్లర్ ముందు హీరోని ఆకాశానికెత్తేయడం చరిత్రను వక్రీకరించడమే అనే విమర్శలొస్తున్నాయి.  దీనిపై సుభాష్‌ చంద్రబోస్‌ మనవడు చంద్రమార్‌ కుమార్‌ బోస్‌ అగ్గిమీద గుగ్గిలం  అయ్యారు. డైరెక్టర్లు ఇలాంటి క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నా.. మరీ ఇలా ఏంటనే ప్రశ్న వేశారు.  

మహాత్మ గాంధీ, నెహ్రూల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..

ఫౌజీ బ్యాక్‌డ్రాప్ అంతా ఇండిపెండెన్స్ స్ట్రగుల్ చుట్టూ తిరుగుతుండటంతో మహాత్మా గాంధీతో సహా ఆ టైమ్‌లో ఉన్న మరికొందరు జాతీయ నాయకుల క్యారెక్టర్లు ఇందులో ఉండబోతున్నాయి. హీరో వాళ్ళందరితో కలిసి జర్నీ చేయనున్నాడు. ఆ సీన్స్ అన్నీ భారీ స్థాయిలో ప్లాన్ చేశారని తెలుస్తుంది. అయితే అందర్నీ స్క్రీన్ మీద ఎలా ప్రెజెంట్ చేస్తారో అనే కంగారు అందరిలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో మనందరం చెప్పుకునే వారిని ఎలా  ప్రెజెంట్ చేస్తారేది చూడాలి.  

మార్చి 19న ఫౌజీ రిలీజ్.. 
మార్చి 19న హోళి పండగ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.  ఇప్పటికే ‘ఫౌజీ’ మూవీకి సంబంధించిన షూటింగ్ కంప్లీటైంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్‌లతో పాటు ఇపుడు బెంగాలీ, ఒడియా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. నేతాజీకి పశ్చిమ బంగాల్‌తో పాటు ఒడిశాతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆయా భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, అన్ని భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనుల మొదలు పెట్టనున్నారు. మరోవైపు సినిమాలోని  కాంట్రవర్సీస్ టెన్షన్ మేకర్స్‌కు బాగానే ఉంది.

నెగిటివ్ కామెంట్స్.. 
ఓవైపు ఈ కామెంట్స్ ఫేస్ చేస్తూనే.. మరోవైపు షూట్‌తో పాటు VFX ఆన్ టైమ్ పూర్తి చేయడం హనుకు పెద్ద సవాలే. మొత్తానికి ఫౌజీ ఫస్ట్ వీడియో ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో.. ఇకపై మేకర్స్ ఆచితూచి అడుగులు వేయాల్సిందే.  లేకపోతే సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన అభిమానులు ఈ సినిమాపై కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. మరోవైపు సెన్సార్ చిక్కులు ఉండనే ఉన్నాయి. మొత్తంగా లీజ్ డేట్ దగ్గరపడుతున్న తరుణంలో మేకర్స్ ఈ వివాదాల సుడిగుండం నుంచి ప్రాజెక్టును ఎలా బయటపడేస్తారనేది చూడాలి మరి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES