SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

డార్లింగ్ ఫ్యాన్స్ ఇంకా ఆగాల్సిందేనా? ప్రభాస్ ‘స్పిరిట్’ విడుదల వాయిదా! కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమా ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సందీప్ రెడ్డి వంగా విడుదల చేసిన లేటెస్ట్ పోస్టర్ ప్రకారం, స్పిరిట్ మూవీ 2027 అక్టోబర్ 29న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ కావడంతో, స్పిరిట్ సినిమా మరోసారి వాయిదా పడిందని అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Written By Renuka Godugu
Published: Oct 18, 2026, 04:40 PM IST | Updated: Oct 18, 2026, 04:46 PM IST
Image Credit: prabhas spirit movie release date:
Join

prabhas spirit movie release date: డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే.. ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తోన్న స్పిరిట్‌ మూవీ విడుదల డేట్‌ వాయిదా పడింది. నిజానికి వచ్చే ఏడాది మార్చినెలలో విడుదల కావాల్సింది. మరింత ఆలస్యం కానుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన తృప్తి డిమ్రీ నటిస్తోంది. ఈ క్రేజీ జంట నటించిన ఈ సినిమాలో ప్రభాస్ ప్రధానంగా ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈయనతో పాటు వివేక్ ఒబేరాయ్, సీనియర్ నటి కాంచన తదితరులు కూడా నటిస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా టి సిరీస్ సమర్పణతో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాణంలో ఉంది.

చాలామంది ఫౌజీ సినిమా డిసెంబర్ లేదా జనవరిలో వస్తుందని ఎదురు చూశారు. ఈ పీరియాడిక్ డ్రామా యాక్షన్ సినిమా స్పిరిట్ కంటే ముందు వస్తుందా ?లేదా అనే కన్ఫ్యూజన్‌లో ఉన్నవారు, డార్లింగ్ బర్త్ డే సందర్భంగా తేదీలు క్లియర్ అవుతాయని ఆశించారు. అయితే తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే, ఫౌజీ కోసం స్పిరిట్ సినిమా వాయిదా పడిందని అర్థమవుతోంది.

 

 

డిసెంబర్ లోనే ఫౌజీ సినిమా రావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యం కావడంతో అది 2027కు షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం అంతా కుదిరితే మార్చి 18వ తేదీన ఈ భారీ ప్రాజెక్టును ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మార్చిలో హోలీ, గుడ్ ఫ్రైడే సెలవులు ఉండటంతో కలెక్షన్లకు మంచి బూస్టర్ లభిస్తుందని భావిస్తున్నారు. అయితే ఫౌజీ సినిమా మార్చిలో రావడం వల్ల, స్పిరిట్ షెడ్యూల్స్ మరింత వెనక్కి జరిపి దీపావళి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు.

 

Read Also: బాలీవుడ్ దర్శకులకు గేట్లు క్లోజ్ చేసిన మన హీరోలు.. సౌత్ దర్శకులే బెస్ట్ అంటున్న హీరోలు..
 

స్పిరిట్ సినిమా విషయానికి వస్తే, ఇప్పటికే 50 శాతం పైగా నిర్మాణం పూర్తయింది. మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం దొరకడం ఒక అద్భుతమైన అవకాశం. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను మరింత యాక్షన్ డ్రామాగా ఎలా డిజైన్ చేస్తారో చూడాలి. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత, సందీప్ రెడ్డి వంగా డార్లింగ్ ప్రభాస్‌ను మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నారు. దీపావళి సమయంలో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉన్నప్పటికీ, డార్లింగ్ ఆ సినిమాలను ఎదుర్కొని నిలబడతారా? అనేది చూడాలి. మొత్తానికి స్పిరిట్ సినిమా ప్రభాస్ కెరీర్‌కు, సందీప్ రెడ్డి వంగాకు అత్యంత కీలకమైనది. దీపావళి సమయంలో సెలవులు ఉండటం వల్ల కలెక్షన్లకు కలిసి వస్తుందనే అంచనాతోనే ఈ సమయాన్ని ఎంచుకున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES