Telugu Heroes Distance Maintance to Bollywood Directors: బాలీవుడ్ డైరెక్టర్స్‌ని మన హీరోలు దూరం పెడుతున్నారు. వారితో దూరం మెయింటేన్ చేస్తున్నారు. మహేష్ బాబు విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళితో ప్రెజెంట్ ‘వారణాసి’ సినిమా చేస్తున్నారు. నెక్ట్స్ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగా పేరు వినిపిస్తుంది. మొదట్నుంచీ తెలుగు దర్శకులకే ప్రాధాన్యత ఇస్తు వస్తున్నాడు పండుగాడు. ప్రభాస్ సైతం ఆదిపురుష్ తర్వాత తన లైనప్‌లో సౌత్ దర్శకులకే పెద్దపీట వేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ను నమ్మి చేసిన ‘ఆదిపురుష్’ సినిమాతో ప్రభాస్‌ను నట్టేటా ముంచేశాడు. ఓ రకంగా ప్రభాస్ కెరీర్లో పెద్ద రాడ్ దింపాడు.
ప్రభాస్ లైనప్‌లో ఓన్లీ తెలుగు దర్శకులు..
ప్రభాస్ లైనప్ చూస్తే హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, నాగ్ అశ్విన్‌తో కల్కి 2, ప్రశాంత్ నీల్‌తో సలార్ 2 వంటి ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అంటే ఒక్కో సినిమాకు ఒక్కో జోనర్ ఎంచుకుంటూనే, దర్శకుడి విషయంలో మాత్రం మనవాళ్లకే ఛాన్సులు ఇస్తున్నాడు. మన దర్శకులతోనే ప్యాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు. ఇది కేవలం కథల ఎంపికలో భాగమా? లేక ఆదిపురుష్ నేర్పించిన గుణపాఠం అనేది అందరు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.
సౌత్ దర్శకులనే నమ్ముకున్న బన్ని..
అల్లు అర్జున్ కూడా దక్షిణాది డైరెక్టర్స్‌నే నమ్ముకుంటున్నారు. పుష్ప తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా.. ప్రస్తుతం అట్లీతో రాకా సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా, మలయాళ దర్శకుడు బాసిల్ జోసఫ్‌తో సూపర్ హీరో ప్రాజెక్ట్ అంటూ కేవలం తెలుగులోనే కాదు తమిళం, మలయాళ దర్శకులను లైన్లో పెట్టుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా సౌత్ టాలెంట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు.
వార్ 2తో ఎన్టీఆర్‌కు తెలిసొచ్చింది..
ప్రభాస్‌కు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో చేసిన ‘ఆదిపురుష్’తో బిగ్గెస్ట్ ఫ్లాప్ అందుకుంటే.. ఎన్టీఆర్.. డైరెక్ట్‌గా యశ్ రాజ్ బ్యానర్లో చేసిన ‘వార్ 2’ సీక్వెల్ దారుణంగా డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో బాలీవుడ్ పై పట్టు సాధించాలనుకున్నాడు. కానీ అయాన్ ముఖర్జీ మాత్రం ఎన్టీఆర్‌కు ‘వార్ 2’ రూపంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. ఈ దెబ్బతో ఇక బాలీవుడ్ ముఖం చూడొద్దని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అందుకే ప్రస్తుతం ప్రశాంత్ నీల్లో ‘డ్రాగన్’ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం మూడు నెలల గ్యాప్‌లోనే రెండు పార్టులుగా విడుదల కానుంది. ఆ తర్వాత తివిక్రమ్‌తో ‘కార్తికేయ’ స్వామి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ తో చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా మన హీరోలు బాలీవుడ్ దర్శకులను నమ్మడం మానేసినట్టు తెలుస్తుంది.
రామ్ చరణ్..
రామ్ చరణ్ కూడా అప్పుడెప్పుడో పుష్కరం కింద వచ్చిన ‘జంజీర్’ తర్వాత బాలీవుడ్ దర్శకులు అంటేనే నో మొహమాటం లేకుండా నో చెబుతున్నాడు. ప్రస్తుతం సుకుమార్‌తో సినిమా చేయబోతున్న చరణ్.. నెక్ట్స్ కూడా మన దర్శకులతోనే సినిమాలకు ఓకే అంటున్నారు. ఒకవేళ బాలీవుడ్‌కు వెళ్లాల్సి వచ్చినా.. మన సినిమాలతోనే వెళ్తానంటున్నారు రామ్ చరణ్.
మొత్తానికి మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. ఇలా టాప్ స్టార్స్ లైనప్‌లో సౌత్ దర్శకుల పేర్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో మన దర్శకులు అట్లీ షారుఖ్‌కు జవాన్, సందీప్ రెడ్డి షాహిద్, రణ్‌బీర్‌లకు కబీర్ సింగ్, యానిమల్ లాంటి చిత్రాలను ఇచ్చాడు. వంశీ పైడిపల్లి సల్మాన్‌తో భారీ ప్రాజెక్టులు చేస్తున్నాడు. బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తూ తమ మార్కెట్‌ను విస్తరిస్తున్నారు. మరి సౌత్ హీరోలు బాలీవుడ్ దర్శకులను నమ్మట్లేదా లేదంటే పాన్ ఇండియా సినిమాలు మనోళ్లే తీయగలరని బలంగా నమ్ముతున్నారా అనేది చూడాలిక.