• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష.. మ్యాటర్ ఏమిటంటే..?

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష.. మ్యాటర్ ఏమిటంటే..?

Bandla ganesh check bounce case: రూ. 95 లక్షల విలువైన చెక్ బౌన్స్ కేసులో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు ఓంగోల్ కోర్టు ఏడది పాటు జైలు శిక్ష విధించింది. అంతే కాకుండారూ. 95 లక్షల జరిమాన సైతం విధించింది. ఈ ఘటన టాలీవుడ్ లో రచ్చగా మారింది.

Written ByInamdar Paresh
Published: Nov 18, 2026, 17:36 IST|Updated: Nov 18, 2026, 17:46 IST
joinshare
Bandla Ganesh:  ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది  జైలు శిక్ష.. మ్యాటర్ ఏమిటంటే..?
Image Credit: Bandlaganesh(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bandla ganesh 1 year jail sentenced by ongole court: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాన్ తో తీసిన గబ్బర్ సింగ్ మూవీతో ఆయన  జీవతమే మారిపోయిందని చెప్తుంటారు. తరచుగా మెగాస్టార్ చిరంజీవితో పాటు, పవన్ కళ్యాణ్ లపై ఉన్న తన స్వామి భక్తిని చాటుకుంటు ఉంటారు. పవన్ కళ్యాణ్ పై ఎవరైన ట్రోల్స్ చేస్తే బండ్ల గణేష్ ఎంట్రీ ఇచ్చి ట్విటర్ వేదికగా వారికి కౌంటర్ లు వేస్తారు. అయితే.. తాజాగా.. బండ్ల గణేష్ ఊహించని చిక్కుల్లో పడ్డారు.  చెక్ బౌన్స్  కేసులో ఒంగోలు కోర్టు  ఏడాది సాధారణ జైలు శిక్ష విధించింది. అంతే కాకుండా..రూ. 95 లక్షల భారీ జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునివ్వడం టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బండ్ల గణేష్  జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి తన నిర్మాణ సంస్థ ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరిట రూ. 95 లక్షల విలువైన చెక్ ఇచ్చారు. అయితే బ్యాంక్ లో మాత్రం నిధులు లేవు. దీంతో బాధితుడు చెక్ బౌన్స్ పై ఒంగోలు కోర్ట్ ను ఆశ్రయించాడు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. 

చివరగా ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, బండ్ల గణేష్ ను దోషిగా ఒంగోలు కోర్టు తెల్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ. 95 లక్షల జరిమానా విధించింది. అంతే కాకుండా.. జరిమానాతో పాటు, ఈ కేసు విచారణ నిమిత్తం బాధితుడికి అయిన కోర్టు ఖర్చులను సైతం బండ్ల గణేశే పూర్తిగా భరించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. గతంలో కూడా కూడా చెక్ బౌన్స్ కేసుల్లో బండ్ల గణేష్ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News