SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తెలుగులో వస్తోన్న మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘రాజుగాడు రాజయ్యాడు’.. టీజర్‌కు సూపర్ రెస్పాన్స్..

Rajigadu Rajayyadu: ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ చిత్రంతో ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్తాఫ్ హసన్. ఆయన హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన మూవీ ‘రాజిగాడు రాజయ్యాడు’. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 19, 2026, 10:37 IST | Updated: Nov 19, 2026, 21:42 IST
Image Credit: Rajugadu Rajayyadu (X/Source)
Join

Rajigadu Rajayyadu Teaser:  శర్మాస్ ఫిలింస్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న చిత్రం ‘రాజుగాడు రాజయ్యాడు’.  బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. "రాజిగాడు రాజయ్యాడు" చిత్రంలో అల్తాఫ్ హసన్‌ సరసన  అను శ్రీ కథానాయిగా నటిస్తోంది. ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న ఈ చిత్రంలో  కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. ఈ రోజు "రాజిగాడు రాజయ్యాడు" సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

నటుడు అశోక్ రెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమా టైటిల్ లోనే ఒక రిథమ్ ఉంది. ఈ టైటిల్ ప్రేక్షకుల మనసులో నిలిచిపోవడం ఖాయం.  నేను ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో యాక్ట్ చేశారు.  ఇలాంటి మంచి రోల్ ఇచ్చిన డైరెక్టర్ అల్తాఫ్‌కి ధన్యవాదాలు.

ఈ కార్యక్రమంలో నటుడు కేశవ మాట్లాడుతూ - మంచి కాన్సెప్ట్, స్టోరీతో వస్తున్న మూవీ ఇది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు  ఎప్పుడూ ఆదరిస్తారు. అలాగే మా సినిమాను కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

నటి అను శ్రీ మాట్లాడుతూ -నేను గతంలో ‘దేవగుడి’ అనే చిత్రంలో నటించాను. ఆ సినిమాలో రాయలసీమ అమ్మాయిగా యాక్ట్ చేశాను.  ఈ చిత్రంలో తెలంగాణ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయాను. నేను  కోనసీమ అమ్మాయిని. ఈ సినిమాకు మంచి టీమ్ పనిచేశారు. అప్పట్లో జయసుధ, విజయశాంతి క్యారెక్టర్స్ ను డైరెక్టర్ ఎలా డిజైన్ చేశరో..  ఈ చిత్రంలో నా పాత్రను అల్తాఫ్ అలా  డిజైన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. మీ అందరికీ మా మూవీ బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చారు.

నిర్మాత చిన్ని మాట్లాడుతూ - రెండేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. నేను ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచీ ఉన్నాను. నేను సినిమాలను ఇష్టపడతాను. అయితే నేనే ప్రొడ్యూసర్ అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి కంప్లీట్ అయ్యేవరకు జరిగే జర్నీ నేను చూశాను. దాంతో నాకు సినిమాల మీద గౌరవం మరింత పెరిగిందన్నారు. మా టీమ్ లోని ప్రతి ఒక్కరి సపోర్ట్ వల్లే అడ్డంకులు దాటుకుని ఇక్కడిదాకా వచ్చినట్టు చెప్పుకొచ్చారు. మీ అందరికీ ఈ సినిమా  తప్పకుండా నచ్చుతుందన్నారు.

హీరో, డైరెక్టర్ అల్తాఫ్ హసన్ మాట్లాడుతూ - మా ప్రొడ్యూసర్ చిన్ని వల్లే మా అందరి కల సాకారమవుతుంది. విజయ్ భాస్కర్ రాసిన నాటకం ఈ సినిమాకు మూలం. ఆయనతో మూడు నెలల పాటు స్క్రిప్ట్ డిస్కషన్స్ చేసి సినిమాకు కథను అర్ధం చేసుకున్నాం. పల్లె కన్నీరు పెడుతుందో అనే గొప్ప పాట రాసిన గోరటి  ఈ సినిమాకు అలాంటి పాట రాయగలరని ఆయనను కలిశాము.  నాన్న పాత్ర కూడా ఆయనే చేయాలని కోరాము. ఈ సినిమాకు వర్క్ చేసిన వాళ్లు నా కుటుంబంలా భావిస్తాను. మా మూవీకి జగదీశ్ ఏడు ఆణిముత్యాల్లాంటి పాటలు అందించారు. ఆ పాటలు మా సినిమాకు ప్రాణంలా మారాయి. మా డీవోపీ చిత్రాన్ని అందంగా చూపించారు. మంచి సందేశం  ఉన్నచిత్రమింది. మీరంతా మా ప్రయత్నాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.

గీత రచయిత, నటుడు డా.గోరటి వెంకన్న మాట్లాడుతూ - చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధాలు కొందరు క్రియేట్ చేశారు. కానీ కళ అయిన సినిమాకు అలాంటి బేధ భావం లేదు. ఇతర భాషల చిత్రాలు ఆ బేధాలు చెరిపేస్తున్నాయి. తెలుగులో కూడా ఆ మార్పు వస్తుందన్నారు. ఈ చిత్ర కథా రచయిత ఎన్నో గొప్ప అవార్డ్స్ పొందిన వారు. ఆయన నాటకం కూడా నంది పురస్కారాలు పొందాయి. అలాంటి గొప్ప కథను ఈ సినిమాకు ఎంచుకోవడం  అల్తాఫ్ గొప్పతనం. నేను ఈ సినిమాను మూడు సార్లు చూశా ఎప్పుడూ బోర్ రాలేదన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో ఉన్నాయి. స చిత్రాలు భిన్నంగా అల్తాఫ్ ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో నేనొక మంచి పాత్ర ను చేసినట్టు చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతం నేపథ్యంతో వస్తున్న కథైనా మనకు హార్ట్ టచింగ్ గా ఉండాలి. మనసును తాకే ఆ తరహా కథతో వస్తున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. మరోవైపు ఈ సినిమాలోని నటీనటులు ఇతర సాంకేతిక నిపుణులు ఈ సినిమా విజయం సాధించాలని కోరారు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES