ఫ్రముఖ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసిన రజినీకాంత్ ‘జైలర్ 2’..
Jailer 2 OTT Streaming: రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జైలర్ 2’. జైలర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. తమిళ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్‌గా నడుస్తోన్న ఈ సినిమా ఈ రోజు నుంచి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
Jiler 2 OTT Response: అవును రజినీకాంత్ చొక్కా నలక్కుండా ఏకండా రూ. 832 కోట్ల గ్రాస్ వసూళ్లతో తమిళ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసాడు. 76 యేళ్ల వయసులతో రజినీకాంత్ రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హీరో మరెవరు లేరు. ఈ సినిమా తమిళంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఏకంగా తెలుగులో రూ. 100 కోట్ల గ్రాస్.. రూ. 60 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా థియేట్రికల్‌గా మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
రూ. 1000 కోట్లకు దూరంగానే జైలర్ 2..
అయితే ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్బులో చేరుతుందనుకున్న తమిళ అభిమానులకు నిరాశే మిగిల్చింది. తెలుగు, కన్నడ, హిందీ సినిమాలకు వర్కవుట్ అయిన థౌజెండ్ వాలా ఫార్ములా కోలీవుడ్‌కు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది.
తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టైతే హిందీ నుంచే ఈజీగా రూ. 300 నుంచి రూ. 500 కోట్లు లాగేస్తుంది. బాహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప, కల్కి లాంటి తెలుగు సినిమాలతో పాటు కన్నడ నుంచి వచ్చిన కేజీఎఫ్ 2కి కూడా నార్త్ నుంచే రూ. 450 కోట్లు వచ్చాయి.. అటు బాలీవుడ్ సినిమాలు జవాన్, పఠాన్, ధురంధర్ లాంటివి ఓవర్సీస్ మార్కెట్ సపోర్ట్‌తో చాలా ఈజీగా రూ. 1000 కోట్లు క్రాస్ చేసేసాయి.
కానీ కోలీవుడ్ సినిమాల విషయానికి వస్తే సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. వీళ్ళకు ఓవర్సీస్ బజ్ ఉన్నా నార్త్ ఆడియన్స్ నుంచి మాత్రం అస్సలు సపోర్ట్ దొరకడం లేదనే సంగతి అర్ధవుతుంది. భారీ అంచనాలతో వచ్చిన జైలర్ 2 కూడా మహా అయితే 800 కోట్ల దగ్గరే ఆగిపోయేలా క్లియర్‌గా కనిపిస్తోంది. హిందీ బెల్ట్ నుంచి కనీసం రూ. 50 కోట్లు కూడా రాకపోవడం వల్లే తమిళ సినిమాలకు ఈ 1000 కోట్ల మైలురాయి ఎప్పటికప్పుడు దూరమవుతోంది.
కేవలం తమిళ మార్కెట్, ఓవర్సీస్ మీద మాత్రమే ఆధారపడి రూ. 1000 కోట్లు కొట్టడం అనేది ఏ సినిమాకైనా ప్రాక్టికల్‌గా అసాధ్యమే. జైలర్ 2 మాత్రమే కాదు ఫ్యూచర్‌లో ఏ తమిళ సినిమాకైనా రూ. 1000 కోట్లు రావాలంటే కచ్చితంగా నార్త్ మార్కెట్ అందులో హిందీ ప్రేక్షకులు దయ తలిస్తేనే అవుతంది. హిందీ ఆడియన్స్‌ను మెప్పించే పాన్ ఇండియా కంటెంట్ పడితే తప్ప కోలీవుడ్‌కు ఈ 1000 కోట్ల కల తీరినట్లే. ఏది ఏమైనా థియేట్రికల్‌గా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ‘జైలర్ 2’ ఓటీటీ వేదికగా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి మరి.