SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఫ్యామిలీ ఆడియన్స్‌‌ టార్గెట్ ‌గా ‘రామాయణ’ .. నార్మల్ రేట్స్‌తో 2 వారాల ముందే బుకింగ్స్ ఓపెన్..

Ramayana Bookings: రేపు రిలీజ్ అనగా కానీ బుకింగ్స్ ఓపెన్ చేయడం లేదు. ఈ యేడాది ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ సినిమాకు ఎలాంటి హైక్స్ లేకపోవడంతో బుకింగ్స్ లేట్ నైట్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. అలాంటిది ఇపుడు ఏకండా రెండు వారాలు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ‘రామాయణ’ బుకింగ్స్ ఓపెన్ చేశారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 23, 2026, 03:23 PM IST | Updated: Oct 23, 2026, 03:28 PM IST
Image Credit: Ramayana Part 1 (X/Source)
Join

Ramayana Target Family Audience: ‘రామాయణ’  సినిమాను ఏకంగా 13 రోజుల ముందే టికెట్స్ ఇచ్చేసి రామాయణ సినిమా కొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతుందా అంటే ఔననే చెప్పాలి.  భారీ సినిమాకు దిల్ రాజు రేట్లు పెంచకుండా వేసిన మాస్టర్ స్కెచ్ హాట్ టాపిక్ అయినట్టు తెలుస్తుంది. కుటుంబ ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించేలా చేసిన టార్గెట్  ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..? రామాయణ ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందా అనే చర్చ మొదలైంది.  

బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌లో బుకింగ్స్ ఓపెన్.. 

తెలుగు రాష్ట్రాల్లో రామాయణ హక్కులు తీసుకున్న దిల్ రాజు.. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్స్‌లో బుకింగ్స్ ఓపెన్ చేసి అందరిని ఆశ్యర్యానికి గురిచేశారనే చెప్పాలి. విడుదలకు  ఇంత ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వడం ఈ మధ్య కాలంలో ఏ పాన్ ఇండియా సినిమాకు జరగలేదనే చెప్పాలి. కేవలం ఈ కారణంతోనే రామాయణ సినిమా అప్పుడే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఏపీలో గరిష్ఠ ధర రూ. 177.. తెలంగాణలో రూ. 295..

మామూలుగా ప్యాన్ ఇండియన్ సినిమాలు వచ్చినపుడు టికెట్  రేట్లు పెంచడం అనేది కామన్ అయిపోయింది.. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ రామాయణకు ఎలాంటి హైక్స్ లేకుండా  రెగ్యులర్ రేట్లకే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దిల్ రాజు. దీంతో  ఆడియన్స్‌కు సగం భారం తగ్గించినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో  మల్టీప్లెక్సుల్లో 177 రూపాయలతో,తెలంగాణలో  గరిష్టంగా 295 రూపాయలకు టికెట్స్ అందుబాటులో ఉంచడం విశేషం.

రామాయణకు ఫ్యామిలీ ప్రేక్షకుల సపోర్ట్.. 
ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద సినిమాలకు హైక్స్ నష్టం చేసాయే తప్ప లాభమైతే  రాలేదు.  అందుకే రామాయణకు ఫుట్‌ఫాల్స్ పెంచేలా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ హైక్స్ ఉంటే 50 నుంచి 100 రూపాయల అదనపు భారం పడేది. ఈ నిర్ణయంతో రామాయణ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ సాలిడ్‌గా దక్కడం ఖాయం. నవంబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES