రెండో రోజు ‘రామాయణ’కు షాకింగ్ కలెక్షన్స్.. ఇది ఊహించినది..
Ramayana 2nd Day Box Office Collection: రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా.. యశ్ రావణాసురుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రామాయణం’. దీపావళి కానుకగా గురువారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఫస్ట్ డే ఓ మంచి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు డీసెంట్ వసూళ్లను సాధిస్తోంది.
Ramayana box Office Collection: ‘రామాయణ’ సినిమాను తీయాలంటే తెలుగు వాళ్లే తీయాలి. బాపు సహా పలువురు తెలుగు దర్శకులు తెరపై చూపించిన ఎమోషన్‌ను బాలీవుడ్ దర్శకులు చూపించలేదనే కామెంట్స్ వినబడుతున్నాయి. మొత్తంగా రామాయణం అనేది హిందీ చిత్ర పరిశ్రమకు ఓ సరుకుగా మారింది.ఎవరెన్ని సార్లు ఏ రకంగా తెరకెక్కించినా చూస్తూనే ఉన్నారు.అందులో ఎమోషన్, డెప్త్, సహా అన్ని అంశాలు కుదిరితే నెత్తినపెట్టుకుంటారు. ఇక తెలుగు సహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘రామాయణ’ .. ఆదిపురుష్ కంటే బెటర్‌గా ఉంది కానీ.. రామాయణం ఫీల్ రాలేదనే కామెంట్స్ వచ్చాయి. సీతారాముల మధ్య బాండింగ్ సరిగా లేదనే కామెంట్స్ వినబడ్డాయి. మరోవైపు సీతాదేవిని యోధురాలి పాత్రలో చూపించడాన్ని రామాయణ ప్రియులు తప్పుపడుతున్నారు. రామాయణాన్ని ఉన్నది ఉన్నట్టు తెరకెక్కిస్తే తప్పు లేదు కానీ.. కల్పిత అంశాలను జోడించడం ఎందుకనే కామెంట్స్ వినబడ్డాయి. పైగా రామాయణాన్ని ఒకే పార్టులో తీసే అవకాశాలున్నా.. రెండు భాగాలుగా తీయడం ఏమిటనే కామెంట్స్ వినపడ్డాయి. మొదటి భాగాన్ని మూడు కాండల్లో అరణ్య కాండలో సీతాపహరణంతో ముగించాడు. రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎన్నేళ్లు వెయిట్ చేస్తారనేది చూడాలి.
రామాయణ విజువల్ గ్రాండియర్..
మొత్తంగా విజువల్ గ్రాండియర్‌గా ‘రామాయణ’ను వేలు పెట్టి చూడాల్సిన అవసరం రాలేదు. అక్కడక్కడ ఎమోషన్స్ గట్రా మిస్ అయినా.. ‘రామాయణ’ తొలి భాగానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అందులో ఓవర్సస్, హిందీ వెర్షన్ నుంచే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.
దీపాళి వీకెండ్ పై రామాయణ ఆశలు..
ఇక హిందీలో తొలి రోజు రూ. 47 కోట్లు.. శుక్రవారం రెండో రోజు రూ. 38.25 కోట్లు రాబట్టింది. మొత్తంగా హిందీ వెర్షన్‌లో రూ. 85.25 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మన దేశంలో అన్ని భాషల్లో కలిపి రూ. 135 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సస్‌లో రూ. 87 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. కన్నడలో 5.15 కోట్ల గ్రాస్.. తెలుగులో రూ. 4.75 కోట్ల గ్రాస్.. తమిళంలో రూ. 1.50 కోట్లు.. మలయాళంలో రూ. 1.15 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్న మాట. మొత్తంగా శనివారం, ఆదివారంతో పాటు సోమ, మంగళ, బుధవారాల్లో ఈ సినిమా ఏ మేరకు మంచి వసూళ్లను రాబట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బుక్ మై షోలో ఈ సినిమా గంటకు 70 వేల నుంచి 80 వేల టిక్కెట్స్ అమ్ముడుపోతున్నాయి.అవి కూడా 3డీ ఫార్మాట్‌లోనే ఎక్కువ మంది చూడటానికి మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా రామాయణం సినిమా మొదటి భాగం ఏ మేరకు వసూళ్లను రాబడుతుందనేది చూడాలి మరి.