SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

‘రణబాలి’ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడినట్టేనా..!!

Ranabaali First Review: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రణబాలి’. పెళ్లి తర్వాత ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై జోడిగా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందనేది సెన్సార్ రిపోర్ట్‌లో చూద్దాం.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 14, 2026, 03:26 PM IST | Updated: Oct 14, 2026, 03:33 PM IST
Image Credit: Ranabaali First Review (X/Source)
Join

Vijay Devarakonda Ranabaali Review: ఈ విజయ దశమి కానుకగా వస్తోన్న మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ చిత్రాల్లో  ‘రణబాలి’పై ప్రస్తుతం భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేకాదు గత కొన్నేళ్లుగా సరైన సక్సస్ లేని విజయ్‌కు ఈ సినిమా విజయం అనేది కీలకం అనే చెప్పాలి.  విజయ్‌తో ‘టాక్సీవాలా’ వంటి హిట్ మూవీ తర్వాత రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంతేకాదు విజయ్ దేవరకొండ తొలిసారి స్వాతంత్య్ర సమరయోధుడు శింగనమల రణబాలి పాత్రలో నటించడంతో ఆడియన్స్ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.  

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా కంటెంట్ ఆకట్టుకునే విధంగా ఉంది. సెన్సార్ వాళ్లు కూడా ఈ సినిమా చూసి చాలా రోజుల తర్వాత ఒక మంచి పేట్రియాటిజం ఉన్న మూవీ చూసినట్టు చెబుతున్నారు. కొన్ని సీన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగా మాస్ ఆడియన్స్‌‌కు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయనే టాక్ వుంది.

ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్ హైలెట్.. 

సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ దేవరకొండ నట విశ్వరూపం చూపించారట. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌.. చివర్లో హీరోను ఉరికంబం ఎక్కించే సీన్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయని చెబుతున్నారు. రష్మికతో ఈయన కెమిస్ట్రీ అదిరిపోయిందని చెబుతున్నారు. రష్మిక మందన్న జయమ్మ పాత్ర కీలకంగా నిలవనుంది. ముఖ్యంగా జయమ్మ చనిపోయే సీన్స్.. బ్రిటిష్ వాళ్లను రణబాలి తలలు తెగ నరికే ఎలివేషన్ సీన్స్.. మరోవైపు పోతరాజుగా విజయ్ సీన్స్ కథలో భాగంగా వస్తాయి.

హైలెట్ సీన్స్..

ముఖ్యంగా బ్రిటీష్ సైన్యం నాటి మన జనంపై చేసిన అరాచకాలు..మిగిలిన పీరియడిక్ సినిమాలతో పోలిస్తే.. రణబాలిలో రాహుల్ కొత్తగా ఏం చూపించాడనేది తెరపై చూడాల్సిందే.  

హీరో క్యారెక్టర్‌ను డైరెక్టర్ డిజైన్ చేసిన విధానమే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ స్థాయిలోనే ఉన్నాయి. కథకు తగ్గట్లుగానే మైత్రి మూవీ మేకర్స్ పెట్టిన ప్రతీ రూపాయి స్క్రీన్ మీద కనిపించాయి.  నాడు బ్రిటీష్ వాళ్లు మన వాళ్లపై చేసిన దారుణాలు, అరాచకాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే.. ఆ తర్వాత మన పరాక్రమాన్ని కూడా బాగా హైలైట్ చేసారు. రణబాలి తిరుగుబాటు మొదలైన తర్వాత మరో లెవల్‌కు వెళ్ళింది. అజయ్ అతుల్ బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్లో ఉంది. మొత్తంగా బ్లాక్‌బస్టర్ ఫీస్ట్ ఇచ్చిన విజయ్.. సినిమాతో ఏం చేయబోతున్నారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES