SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ranabaali Twitter Review: 'రణబాలి' మూవీ ట్విట్టర్ రివ్యూ..మాస్ పాత్రలో విజయ్ దేవరకొండ 'రుద్ర తాండవం'!

Ranabaali Movie Twitter Review: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సోషల్ మీడియా, ట్విట్టర్‌లో ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించడమే కాకుండా బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ట్విట్టర్‌తో పాటు సోషల్ మీడియాలో 'రణబాలి' సినిమా రివ్యూ కామెంట్స్‌ ఓసారి గమనిద్దాం.

Written By Harish Darla
Published: Oct 16, 2026, 06:38 AM IST | Updated: Oct 16, 2026, 06:41 AM IST
Image Credit: Source: Zee Telugu News
Join

Ranabaali Movie Twitter Review: 'రణబాలి' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ నిర్మించగా, టీ-సిరీస్ సంస్థ సమర్పించింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం బ్రిటీష్ పాలనా కాలం నాటి కథాంశంతో తెరకెక్కింది. రాయలసీమ ప్రాంతంలో వచ్చిన తీవ్రమైన కరువు, అక్కడ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ప్రధాన స్టోరీలైన్‌గా తీసుకుని దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీని మలిచారు. గతంలో విజయ్ - రాహుల్ కాంబినేషన్‌లో వచ్చిన 'టాక్సీవాలా' చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

విజయ్ - రష్మికల కెమిస్ట్రీ
విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రా అండ్ రస్టిక్ లుక్‌లో తన నటనతో విశ్వరూపం చూపించారని, ఆయన కెరీర్‌లోనే ఇది ఒక మైలురాయి లాంటి చిత్రం అని నెటిజన్లు కొనియాడుతున్నారు. ముఖ్యంగా విజయ్ రాయలసీమ యాస, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్సిటీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

విజయ్, రష్మికల వివాహం జరిగిన తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న తొలి చిత్రం ఇది కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. గతంలో 'గీతాగోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల తర్వాత మళ్లీ వీరిద్దరి మధ్య ఆన్ - స్క్రీన్ కెమిస్ట్రీ ఎంతో సహజంగా, క్యూట్‌గా కుదిరిందని ప్రేక్షకులు పేర్కొన్నారు. అర్నాల్డ్ వాస్లూ, ఈశ్వరీ రావు కూడా తమ పాత్రల్లో అద్భుతంగా మెప్పించారు.

ట్విట్టర్ టాక్, సినిమా హైలైట్స్
ట్విట్టర్ రివ్యూల ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుండగా, ప్రీ-ఇంటర్వెల్ సీన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండి కథపై ఉత్సుకతను పెంచాయి. సెకండాఫ్, స్క్రీన్‌ప్లే మరింత సూపర్బ్‌గా ఉన్నాయని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 'ఏందయ్య సామి', 'కోబలి' పాటలతో ఆకట్టుకున్న అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి 'రణబాలి' చిత్రం థియేటర్లలో సూపర్‌హిట్ విజయంతో సందడి చేస్తోంది.

ఈ చిత్రానికి అజయ్ - అతుల్ స్వరాలు అందించగా, జిష్ణు భట్టాచార్జీ, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. సినిమా విడుదలకంటే ముందే యూఎస్ ప్రీమియర్స్ ప్రదర్శించగా, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 3 గంటల రన్ టైమ్‌తో U/A సర్టిఫికెట్ జారీ చేసింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES