SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Renu Desai: నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది..?.. పవన్ కళ్యాణ్‌తో విడాకులపై రేణుదేశాయ్‌ సెన్సెషనల్ కామెంట్స్..

Renu desai on Divorce: పవన్ కళ్యాణ్ తో తనకు 2012 లో డైవర్స్ అయ్యిందని రేణుదేశాయ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికి తనపై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య అంటూ ట్రోల్స్ చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన వనవాసం ఇంకా ఎప్పుడు ముగుస్తుందని అసహానం వ్యక్తం చేశారు.

Written By Inamdar Paresh
Published: Nov 06, 2026, 01:25 PM IST | Updated: Nov 06, 2026, 01:35 PM IST
Image Credit: renudesai(file)
Join

Renu desai sensational comments about her divorce with deputy cm pawan kalyan: నటి రేణు దేశాయ్ ఇటీవల కొన్ని వివాదాస్పద అంశాలతో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ముఖ్యంగా వీధి శునకాల విషయంలో రేణు దేశాయ్ గతంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి మరీ సుప్రీంకోర్టు తీర్పులు వ్యతిరేకంగా తన వాదన బలంగా విన్పించారు.  నోరులేని జీవాలపై కర్కశంగా ప్రవర్తించొద్దన్నారు.ఆ తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో వీధి శునకాల్ని రేణుదేశాయ్ ఇంటిలో వదిలేయాలని, ఆమె పిల్లలను కరిస్తే ఆ బాధ తెలుస్తొందని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. అంతే కాకుండా.. పవన్ కళ్యాణ్ ను మోసం చేశావని, నీకు తిక్క ఉందని కామెంట్స్ చేసి మరింత రెచ్చగొట్టారు. ఇక  మరికొంత మంది  ఒక అడుగు ముందుకేసి రేణు దేశాయ్ రెండో పెళ్లికి కూడా రెడీ అయ్యిందని కూడా రూమర్స్ వైరల్ చేశారు. 

ఈ కామెంట్స్ లకు రేణుదేశాయ్ సైతం తనదైన స్టైల్ లో ఘాటుగానే స్పందించారు. అంతే కాకుండా తనను, తన బిడ్డల్ని కొంత మంది బూతులు తిడుతూ కామెంట్స్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మరోసారి తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ట్రోల్స్ పై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. 

పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకుని 14 ఏళ్లు పూర్తయినా కూడా ఇప్పటికి పవన్ తో తనకు  ముడిపెట్టడంపై తీవ్రస్థాయలో ధ్వజమెత్తారు. శ్రీరాముడికి కేవలం 14 ఏళ్లలో మాత్రమే వనవాసం ముగిసిందని, తాను మాత్రం ఇప్పటికి వనవాసం అనుభవిస్తున్నట్లు ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలో పవన్ తో విడాకుల తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. ఒక సినిమా నిర్మించానని, దర్శకురాలిగాను, రచనలో కూడా రాణిస్తున్నట్లుచెప్పారు. 

మూగ జీవాలను కాపాడే  ఒక ఆర్గనైజేషన్ ను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. సనాతన ధర్మం కోసం తనవంతుగా బాధ్యతగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. అయిన గతంలో ముగిసిపోయిన అధ్యాయం గురించి ఇప్పటికి కూడా ట్రోల్స్ చేయడంపై నటి రేణుదేశాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శునకాల్ని కాపాడిన ట్రోల్స్ చేస్తారు.. ఏదైన యాత్రకు వెళ్లిన  కూడా ఇష్టమున్నట్లు వేధిస్తారని రేణుదేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు పవన్  కళ్యాణ్ , రేణూ దేశాయ్ 2012లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా,  ఏపీ డిప్యూటీ సీఎంగా కొన సాగుతున్నారు. రేణూ దేశాయ్ తో విడాకుల తర్వాత ఆయన అన్నా లెజ్‌ నోవాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం రేణుదేశాయ్ తన డైవర్స్ అంశంపై చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్గా మారాయి.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES