• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కొత్త బాదుడు.. ఏకంగా 29 నెలల కరెంట్ బిల్లు కట్టాల్సిందే!

టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కొత్త బాదుడు.. ఏకంగా 29 నెలల కరెంట్ బిల్లు కట్టాల్సిందే!

Current Bills: కొన్నేండ్ల క్రితం వినియోగించుకున్న విద్యుత్ కు ఇప్పుడు డిస్కంలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో.. సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల మోత మోగుతోంది.

Written ByBhoomi
Published: Nov 06, 2026, 02:58 PM IST|Updated: Nov 06, 2026, 02:59 PM IST
joinshare
టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కొత్త బాదుడు.. ఏకంగా 29 నెలల కరెంట్ బిల్లు కట్టాల్సిందే!
Image Credit: Current Bills:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
వధూవరులను ఎత్తుకుని గిరగిరా తిరుగుతూ మహిళల డ్యాన్స్.. వీడియో వైరల్!

వధూవరులను ఎత్తుకుని గిరగిరా తిరుగుతూ మహిళల డ్యాన్స్.. వీడియో వైరల్!

2

భూమి గుండ్రంగా ఉంటే మనం ఎందుకు కింద పడిపోము? భూమిపై నిలబడటం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!!

3

Karmabhoomi Fire Express: కర్మభూమి ఎక్స్ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు భోగీలు దగ్దం.. వీడియో..

4

"ఆమె ధైర్యమే నన్ను నిలబెట్టింది".. ఆమె క్యాన్సర్ పోరాటం నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ బౌలర్ ..!!

5

‘సమ్మర్ హాలీడేస్’ తెలుగు మూవీ రివ్యూ రేటింగ్.. మెప్పించిందా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Current Bills: కొన్నేండ్ల క్రితం వినియోగించుకున్న విద్యుత్ కు ఇప్పుడు డిస్కంలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో.. సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల మోత మోగుతోంది. తాజాగా నవంబర్ నెల కరెంట్ బిల్లుల నుంచే ఈ ట్రూప్ అప్ వసూల్లు అధికారికంగా ప్రారంభం అయ్యాయి. గతంలో వాడిన కరెంట్ కు సంబంధించిన బిల్లులను ఇప్పుడు చెల్లించాల్సి వస్తుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాలు, ఇతర ఖర్చులతో సతమతువుతున్న సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఈ అదనపు విద్యుత్ ఛార్జీల వసూలు పెద్ద భారంగా పరిణమించింది.

ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగి ఇప్పటికే బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి తోడుగా ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు కూడా కలవడంతో సామాన్య ప్రజలకు బిల్లులు మరింత భారంగా మారాయి. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వ్యవసాయేతర విద్యుత్ కొనుగోళ్ల కోసం చేసిన అదనపు వ్యయాన్ని రాబట్టేందుకు ఈ ఛార్జీలను విధిస్తున్నారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో రూ. 4,222. 93 కోట్ల వసూలుకు విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. దీనిలో హైదరాబాద్ పరిధి వాటానే ఏకంగా 60శాతం ఉంది. దీని ప్రకారం కేవలం హైదరాబాద్ వాసులపైనే రూ. 2, 533 కోట్ల భారం పడుతోంది.

ఈ ట్రూప్ అప్ ఛార్జీలను వినియోగదారులు దాదాపు 29 నెలల పాటు  చెల్లించాల్సి వస్తుంది. సగటున ప్రతి నెలా రూ. 87కోట్లకుపైగా వసూలు చేయను్న్నారు. వచ్చే డిసెంబర్ నెల నుంచి యూనిట్ కు 50 పైసల చొప్పున వసూలు చేస్తారు. దీంతో రానున్న రోజుల్లో వినియోగదారులపై భారం మరింత పెరుగుతుంది.  ఈ ట్రూ అప్ వడ్డన సాధారణ ఇండ్లకే కాకుండా గేటెడ్ కమ్యూనిటీలకు భారీగా వస్తోంది. ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలిలో ఉన్న మై హోం విహంగ వంటి పెద్ద పెద్ద సొసైటీలకు ఈనెల ఒక్క రోజు ట్రూ అప్ రూపంలో రూ. 2.39 లక్షల బిల్లు వచ్చింది. ఇలా లక్షల్లో బిల్లులు వస్తుండటంతో నివాసితులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే నగరంలో చాలా మంది అద్దె దారులు తరచుగా ఇండ్లు మారుతుంటారు. నాలుగేండ్ల క్రితం నాటి విద్యుత్ వినియోగానికి సంబంధించిన బకాయిలను ఇప్పుడు వసూలు చేస్తుండటంతో సమస్య తలెత్తుతోంది. అప్పట్లో వేరేవాళ్లు వినియోగించిన విద్యుత్ ఇప్పుడు ఇక్కడ ఉంటున్న అద్దెదారులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఇళ్ల యజమానులకు, అద్దెదారులకు మధ్య వాగ్వాదాలు జరుగుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.

Also Read: 

ఆస్ట్రిచ్ ఎఫెక్ట్.. మీరు కళ్ళు మూసుకుంటే పులిలా వెంటాడే సమస్య మిమ్మల్ని వదిలేస్తుందా?


 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News