• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /మర్డర్ ప్లాన్ మామూలుగా లేదుగా! ఏడుగురి దారుణ హత్య వెనుక ఉన్న క్రైమ్ స్కెచ్ వివరించిన పోలీసులు!

మర్డర్ ప్లాన్ మామూలుగా లేదుగా! ఏడుగురి దారుణ హత్య వెనుక ఉన్న క్రైమ్ స్కెచ్ వివరించిన పోలీసులు!

బెంగళూరు 7 గురి మర్డర్‌ కేసులు ఉదయం నుంచి వైరల్‌ అవుతోంది. భార్యా ఆమె కుటుంబ సభ్యులను క్యాబ్‌ డ్రైవర్‌ అత్యంత దారుణంగా గ్రైండర్‌ రాయితో మోది చంపాడు. అయితే, నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు.

Written ByRenuka Godugu
Published: Nov 06, 2026, 03:10 PM IST|Updated: Nov 06, 2026, 03:14 PM IST
joinshare
మర్డర్ ప్లాన్ మామూలుగా లేదుగా! ఏడుగురి దారుణ హత్య వెనుక ఉన్న క్రైమ్ స్కెచ్ వివరించిన పోలీసులు!
Image Credit: Bengaluru Rajajinagar 7 murder case: X twitter

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Amitabh House Bomb Threat: ముంబైలో మరోసారి బాంబు కలకలం..ఏకంగా అమితాబ్ బచ్చన్ ఇంటికే స్పాట్ పెట్టిన దుండగులు!

Amitabh House Bomb Threat: ముంబైలో మరోసారి బాంబు కలకలం..ఏకంగా అమితాబ్ బచ్చన్ ఇంటికే స్పాట్ పెట్టిన దుండగులు!

2

వధూవరులను ఎత్తుకుని గిరగిరా తిరుగుతూ మహిళల డ్యాన్స్.. వీడియో వైరల్!

3

భూమి గుండ్రంగా ఉంటే మనం ఎందుకు కింద పడిపోము? భూమిపై నిలబడటం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!!

4

Karmabhoomi Fire Express: కర్మభూమి ఎక్స్ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు భోగీలు దగ్దం.. వీడియో..

5

"ఆమె ధైర్యమే నన్ను నిలబెట్టింది".. ఆమె క్యాన్సర్ పోరాటం నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ బౌలర్ ..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bengaluru Rajajinagar 7 murder case: రాజాజీ నగర్‌ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందు శేఖర్‌ అనే క్యాబ్‌ డ్రైవర్‌ భార్యతో గొడవపడి ఆమె పుట్టింటి వారిని కూడా దారుణంగా చంపేశాడు. ముందుగా భార్యను చంపి ఆమె విహారయాత్రకు వెళ్లిందని నమ్మించాడు. ఆ తర్వాత ఒక్కొక్కరినీ పక్కా స్కెచ్‌తో అంతమొందించాడు. అలా భార్య కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని కూడా చంపేశాడు.

అయితే, ఈ హత్యల్లో నిందితుడి మైనర్‌ కూతురు ప్రమేయం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.  పక్కా ప్రణాళికతో భార్యను హత్య చేశాడు. ఆమె కుటుంబ సభ్యులకు తెలియక ముందే ఆమె సోదరుడిని, ఆయన భార్యను కూడా ఇంటికి భోజనానికి పిలిచాడు. అయితే, వారు తినే ఫుడ్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. దీంతో వారు నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత వారిని గ్రైండర్‌ రాయితో తలపై మోది హత్య చేశాడు. డెడ్‌ బాడీలను కూడా తరలించడానికి నిందితుడు తన సొంత ఏటీఎస్‌ కారును ఉపయోగించాడు. అందులో మృతదేహాలను డిక్కీలోపెట్టాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు చనిపోయిన విషయం తెలియక చిన్నారి కూడా నిందితుడి పక్కే కూర్చొని ప్రయాణం చేశాడు. ఇక శివ కుమార్‌, దివ్య మృతదేహాలను నిర్మానుష్య ప్రదేశాల్లో పడేసి తిరిగ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత చిన్నారి పునీత్‌ను కూడా దారుణంగా హత్య చేసి నందిహిల్స్‌ సమీపంలో పడేశాడు.  

Read Also: బెంగళూరులో ఘోరం.. భార్యతోపాటు ఏడుగురిని గ్రైండింగ్ రాయితో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్! సహకరించిన కూతురు?
 

ఆ తర్వాత అదేవిధంగా భార్య మరో సోదరుడు శంకర్‌, భార్య నళినిని కూడా హత్య చేసి, వేర్వేరు ప్రాంతాల్లో వారి మృతదేహాలను పడేశాడు. అయితే,  వారి కుమారుడు యతీన్‌ను కూడా హత్య చేయాలని చూశాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. కార్పొరేషన్‌ సర్కిల్‌ పరిధిలో వదిలేశాడు. ఈ హత్యలకు మైనర్‌ కూతురి పాత్ర కూడా ఉందని భావిస్తున్నారు. ఇలా కుటుంబంలో ఏడుగురిని పొట్టనబెట్టుకున్నాడు క్యాబ్‌ డ్రైవర్‌. ఇక కేసు నమోదు చేసుకుని అరెస్ట్‌ చేసిన పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఉదయం నుంచి ఈ మర్డర్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఈరోజు బెంగళూరు వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కేవలం భార్యతో ఉన్న విభేదాలు, దానికి ఆమె పుట్టింటి వారు కూడా మద్ధతుగా ఉన్నారని ఈ హత్యలు చేసినట్లు సమాచారం. సునితతో ఇందు శేఖర్‌కు 20 ఏళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఇంటర్‌ చదవే కూతురు ఉంది.

 

Horror in Bengaluru! Cab driver, Indushekar arrested for murdering 7 people of a family including his wife & 7 year-old boy. Cops suspect he lured victims to his home & bludgeoned them with a grinding stone. Bodies dumped at different locations around Nandi Hills. Probe on. https://t.co/cyWY25Z1L9

— Deepak Bopanna (@dpkBopanna) November 6, 2026

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
National News
Telugu News