SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sai Durgha Tej Engage: మెగా కుటుంబంలో పెళ్లి సందడి.. ఘనంగా సుప్రీమ్‌ హీరో సాయిదుర్గా తేజ్‌ నిశ్చితార్థం

Sai Durgha Tej Wedding Engagement: సినీ పరిశ్రమలో మరో నటుడు వివాహం చేసుకోబోతున్నాడు. యువ నటుడు సాయి దుర్గా తేజ్‌ వ్యక్తిగత జీవితంలో కీలక అడుగు వేశాడు. అతడి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. కొద్దిమంది కుటుంబసభ్యులు.. బంధుమిత్రులు వేడుకకు హాజరయ్యారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 05, 2026, 11:07 PM IST | Updated: Nov 05, 2026, 11:12 PM IST
Image Credit: Sai Durgha Tej And Kiranmayimayi Engagement
Join

Sai Durgha Tej Get Engaged With Kiranmayi: సినీ పరిశ్రమలో మరో నటుడు బ్యాచిలర్‌ లైఫ్‌కు వీడ్కోలు పలకనున్నాడు. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న యువ నటుడు సాయి దుర్గా తేజ్‌ అలియాస్‌ ధరమ్‌ తేజ్‌ ఓ ఇంటి కాబోతున్నాడు. వచ్చే నెలలో వివాహం చేసుకోబోతుండగా దానికి ముందు నిశ్చితార్థ వేడుక జరిగింది. కొణిదెల కుటుంబం, అల్లు కుటుంబంతోపాటు కొద్ది మంది బంధుమిత్రుల మధ్య ఈ నిశ్చితార్థ వేడుక జరగ్గా దానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

40 ఏళ్ల టాలీవుడ్ నటుడు సాయిదుర్గ తేజ్ ఎట్టకేలకు వివాహం చేసుకోబోతున్నాడు. కిరణ్మయి అనే యువతితో హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న హిల్టన్ రిసార్ట్స్‌లో గురువారం ఈ వేడుకను ఘనంగా జరగ్గా.. ఈ శుభకార్యానికి కొణిదెల, అల్లు కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున కుటుంబసభ్యులు హాజరయ్యారు. అంతేకాకుండా ప్రముఖ నటీనటులు, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మధ్య వైభవంగా నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాల ఆశీర్వాదాలతో ఈ నూతన జంట తమ జీవితంలో సరికొత్త అధ్యాయానికి అడుగుపెట్టింది. డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్‌లోనే సాయిదుర్గా తేజ్‌, కిరణ్మయి‌ల వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. అయితే వధువు కిరణ్మయి‌ ఎవరనే విషయం మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. కిరణ్మయిమయి ఎవరో కాదని సాయిదుర్గా తేజ్‌ చిన్ననాటి స్నేహితురాలు అని తెలుస్తోంది.

కాగా నిశ్చితార్థ వేడుకలో సాయిదుర్గ తేజ్ తల్లిదండ్రులు డాక్టర్ శివ ప్రసాద్, విజయ దుర్గ, ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్, అల్లు అర్జున్-స్నేహ రెడ్డి దంపతులు, అల్లు బాబి-నీలా షా జోడీ, వరుణ్ తేజ్-లవణ్య త్రిపాఠి దంపతులు, నాగబాబు-పద్మజ, నిహారిక కొణిదెల, అల్లు అరవింద్-అల్లు నిర్మల, అల్లు శిరీష్-నయనిక రెడ్డి, అకిరా నందన్, ఆద్య తదితరులు కుటుంబసమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక సాయిదుర్గాతేజ్‌కు ఆత్మీయ మిత్రులైన మంచు మనోజ్-భూమ మౌనిక రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ, హర్ష చెముడు, వెంకీ కుడుముల, నవదీప్, హర్షిత్ రెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు. పవన్‌ కల్యాణ్‌ కుమారుడు అకీరానందన, అతడి కుమార్తె కూడా ఈ వేడుకలో ఉన్నారు.

ప్రాణాపాయం నుంచి తప్పించుకుని
చిరంజీవి సోదరి కుమారుడు సాయిదుర్గ తేజ్ సినీ పరిశ్రమలో నటుడుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో బైక్‌ ప్రమాదానికి గురయి సాయి దుర్గాతేజ్‌ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి దుర్గా తేజ్‌ కోలుకోవడానికి దాదాపు ఏడాదిపైన సమయం పట్టింది. కోలుకున్నాక సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES