SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Samantha 9th Month Workout: నిండు గర్భంతో హీరోయిన్ సమంత జిమ్ వర్కౌట్స్..9వ నెలలోనూ వర్కౌట్స్ వదలట్లేదు!

Samantha 9th Month Workout Video: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ చివరి దశను ఆస్వాదిస్తున్నారు. 9వ నెల గర్భంతో ఉన్న ఆమె త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. గర్భంతో ఉన్నప్పటికీ తన ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల ఏమాత్రం రాజీ పడకుండా సమంత చూపుతున్న నిబద్ధత అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. తొమ్మిదో నెలలోనూ ఆమె వర్కౌట్స్ చేస్తున్న వీడియో షేర్ చేయగా.. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.

Written By Harish Darla
Published: Oct 30, 2026, 01:41 PM IST | Updated: Oct 30, 2026, 01:46 PM IST
Join

Samantha 9th Month Workout Video: ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు ప్రస్తుతం 9 నెలల గర్భంతో ఉన్నారు. అయితే గర్భవతిగా ఉన్నా ఆమె ఫిట్‌నెస్‌పై అదే శ్రద్ధ పెడుతున్నారు. తాజాగా గర్భవతిగా ఆమె 9వ నెలలో అడుగుపెట్టగా..నిండు గర్భంతోనూ ఆమె జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తోంది. వర్కౌట్స్ చేస్తున్న వీడియోను సమంత తాజాగా సోషల్ మీడియాలో పంచుకోగా.. ఇప్పుడా వీడియో తెగ వైరల్‌గా మారింది.

సమంత షేర్ చేసిన ఈ ప్రత్యేక వీడియో క్లిప్‌లో.. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు వివిధ దశల్లో ఆమె అనుసరించిన వ్యాయామ పద్ధతులు స్పష్టంగా తెలిసేలా వీడియో పోస్ట్ చేసింది. ముఖ్యంగా లేటెస్ట్ వర్కౌట్ క్లిప్‌లో, ఆమె తన ఛాతీ భాగానికి దగ్గరగా డంబెల్‌ను పట్టుకుని ఎంతో జాగ్రత్తగా వెయిటెడ్ స్క్వాట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

గర్భధారణ సమయంలో మహిళా శరీరంలో సంభవించే మార్పులకు అనుగుణంగా తన వ్యాయామ దినచర్యను మార్చుకున్న విధానాన్ని ఆమె గతంలో వివరించారు. "ఈ రోజుల్లో నా ట్రైనింగ్ కాస్త భిన్నంగా సాగుతోంది. ఎక్కువగా శ్రమపడటం కంటే శరీరం చెప్పే సంకేతాలను వినడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాను" అని సమంత పేర్కొన్న మాటలను ఈ వీడియో మరోసారి నిర్ధారిస్తోంది.

కుటుంబ విశేషాలు, సీమంతం వేడుక..
సమంత తన భర్త, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరుతో కలిసి తమ మొదటి సంతానానికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. కొద్ది వారాల క్రితమే ఈ జంట తమిళనాడులోని కోయంబత్తూరులో గల సద్గురు ఈశా ఫౌండేషన్‌లో తమ కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా సీమంతం వేడుకను జరుపుకున్నారు. సమంత, రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ నెలలో ఇదే ఈశా యోగా సెంటర్‌లోని ప్రసిద్ధ లింగ భైరవి ఆలయంలో శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

సామాజిక మాధ్యమాల్లో సమంత పోస్ట్ చేసిన ఫిట్‌నెస్ వీడియోపై అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ నటి కృతి కర్బందా ఈ పోస్ట్‌పై స్పందిస్తూ "మీ ముగ్గురికీ నా ప్రేమ" అని ఆప్యాయంగా కామెంట్ చేశారు. గర్భవతిగా ఉన్నప్పటికీ నిరంతరం చురుగ్గా ఉంటూ, సవాళ్లను అధిగమిస్తూ వ్యాయామాలు చేస్తున్న సమంత ఫిట్‌నెస్ స్ఫూర్తి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోందని నెటిజన్లు కొనియాడుతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES