SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Samantha Baby Boy: సమంతకు మగబిడ్డ.. 12 ఏళ్ల క్రితమే ప్రదీప్ షోలో జ్యోతిష్యుడు చెప్పిన మాట నిజమైందా?

Samantha Baby Boy:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో కొత్త ఆనందం వచ్చి చేరింది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. నవంబర్ 19న సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

Written By Vishnu Priya
Published: Nov 21, 2026, 17:48 IST | Updated: Nov 21, 2026, 18:03 IST
Join

Samantha Baby Boy: తమ కుమారుడికి 'దేవ్ నిడిమోరు' అని పేరు పెట్టినట్లు ప్రకటించింది. ఈ వార్తతో సమంత అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు సమంతకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 12 ఏళ్ల క్రితం ఓ టీవీ షోలో ఆమె గురించి చెప్పిన జ్యోతిష్యం ఇప్పుడు వైరల్ అవుతోంది.

ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు గతంలో నిర్వహించిన 'కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' కార్యక్రమానికి సమంత అతిథిగా హాజరైంది. ఆ ఎపిసోడ్‌లో భాగంగా ఓ జ్యోతిష్యుడిని తీసుకొచ్చి ఆమె జాతకం గురించి అడిగారు. సమంత చేతి రేఖలను పరిశీలించిన ఆ జ్యోతిష్యుడు ఆమెకు ఇద్దరు పిల్లలు కలుగుతారని చెప్పాడు. అంతేకాదు, మొదటి సంతానంగా మగబిడ్డ పుడతాడని కూడా అంచనా వేశాడు. ఈ కార్యక్రమం 2014లో ప్రసారమైంది.

ఇప్పుడు సమంతకు నిజంగానే కుమారుడు జన్మించడంతో అప్పటి వీడియో మరోసారి తెరపైకి వచ్చింది. పాత వీడియోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం చెప్పిన మాట ఇప్పుడు నిజమైందంటూ చర్చించుకుంటున్నారు.


ఇక సమంత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఆమె జీవితంలో రాజ్ నిడిమోరు ప్రవేశించారు. 2025 డిసెంబర్ 1న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

అప్పటి నుంచి ఈ జంటకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సమంత గర్భధారణకు సంబంధించిన ఫోటోలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. తన బేబీ బంప్ ఫోటోలను ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. గర్భధారణ సమయంలో కూడా వ్యాయామం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసింది. డెలివరీకి రెండు రోజుల ముందు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్న విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంది.

తమ బిడ్డకు ఏ పేరు పెట్టాలనే విషయంపై ముందుగానే నిర్ణయం తీసుకున్నామని సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అమ్మాయి పుడితే ఒక పేరు, అబ్బాయి పుడితే మరో పేరు పెట్టాలని తాము అనుకున్నట్లు తెలిపింది. ఇప్పుడు కుమారుడు జన్మించడంతో 'దేవ్ నిడిమోరు' అనే పేరును ప్రకటించారు.


వృత్తిపరంగా కూడా సమంత, రాజ్ నిడిమోరుకు మంచి అనుబంధం ఉంది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి వెబ్ సిరీస్‌లతో సమంత ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే సమంత నిర్మించిన 'శుభం' సినిమాకు రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఈ సంతోషకరమైన వార్తతో పాటు 12 ఏళ్ల నాటి జ్యోతిష్యం వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

Read More: ఏళ్లుగా ఊరిస్తున్న కాంబినేషన్లు..! వెంకీ సినిమాలకు ఏమైంది అసలు..?


Read More: Kavya Maran Gold Ring Gift: ఉద్యోగులకు కావ్యా మారన్ పెళ్లి స్పెషల్ గిఫ్ట్..ఒక్కోక్కరికి బంగారంతో విలువైన బహుమతి!


 

Add Zee News as a Preferred Source

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ZEENEWS TRENDING STORIES