• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /ఏళ్లుగా ఊరిస్తున్న కాంబినేషన్లు..! వెంకీ సినిమాలకు ఏమైంది అసలు..?

ఏళ్లుగా ఊరిస్తున్న కాంబినేషన్లు..! వెంకీ సినిమాలకు ఏమైంది అసలు..?

Venkatesh Miss Movies: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అనౌన్స్ అయినప్పుడే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఏర్పడుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, క్రేజీ డైరెక్టర్లు కలిసి సినిమా చేయబోతున్నారంటే అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. కానీ అనౌన్స్‌మెంట్ వచ్చినంత ఈజీగా ఆ సినిమాలు సెట్స్‌పైకి రావు. కథలు మారుతుంటాయి.. డేట్స్ సమస్యలు వస్తుంటాయి.. కొన్నిసార్లు ప్రాజెక్టులే తెరమరుగైపోతుంటాయి. ఇప్పుడు విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లోనూ ఇలాంటి పరిస్థితినే చూస్తున్నామనే చర్చ నడుస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 21, 2026, 14:34 IST|Updated: Nov 21, 2026, 14:39 IST
joinshare
ఏళ్లుగా ఊరిస్తున్న కాంబినేషన్లు..! వెంకీ సినిమాలకు ఏమైంది అసలు..?
Image Credit: Venkatesh (Source/File)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Venkatesh Crazy Combinations Miss: వెంకటేశ్‌తో సినిమా చేయాలని చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి క్రేజీ కాంబినేషన్లలో గత కొంతకాలంగా మూడు సినిమాల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీటిలో ఒకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎప్పుడో అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మిగిలిన రెండు తరుణ్ భాస్కర్, తేజలతో చేయాల్సిన ప్రాజెక్టులు. అయితే ఈ  సినిమాల విషయంలోనూ అభిమానులకు ఎదురుచూపులే ఎక్కువయ్యాయి.

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబో..

ముందుగా త్రివిక్రమ్, వెంకటేశ్ కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఇద్దరి కలయిక కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూశారు. గతంలోనే ఈ కాంబినేషన్‌పై ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఎట్టకేలకు 'ఆదర్శ కుటుంబం' రూపంలో ఈ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది. అయితే సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా అనుకున్నంతగా ప్రభావం చూపించలేకపోయినా.. వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌ను తెరపై చూసే అవకాశం మాత్రం ప్రేక్షకులకు దక్కింది.

తేజతో వెంకటేశ్ క్రేజీ ప్రాజెక్ట్.. ?

ఇక ఇప్పుడు మిగిలిన రెండు ప్రాజెక్టుల పరిస్థితి ఏంటన్నదే ఆసక్తికరంగా మారింది. అందులో మొదటిది దర్శకుడు తేజతో వెంకటేశ్ చేయాల్సిన ‘సావిత్రి’  సినిమా. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్పట్లో కొంతమేర పనులు కూడా జరిగాయి. వెంకటేశ్ లుక్ కోసం ఫొటోషూట్ నిర్వహించడంతో పాటు కొన్ని స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. దీంతో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కుతుందని అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఆ తర్వాత ఈ సినిమా గురించి పెద్దగా ఎలాంటి సమాచారం కూడా బయటకు రాలేదు. దీంతో ఈ కాంబినేషన్ ఇక కార్యరూపం దాల్చడం కష్టమేనని అభిమానులు భావిస్తున్నారు. ఆ తర్వాత అదే సావిత్రి టైటిల్‌తో నారా రోహిత్ సినిమా వచ్చేసింది.

వెంకీ - తరుణ్ భాస్కర్ మూవీ..

అయితే అందరికంటే ఎక్కువ ఆసక్తి కలిగించిన మరో కాంబినేషన్ వెంకటేశ్, తరుణ్ భాస్కర్‌లది. వైవిధ్యమైన కథలను తెరకెక్కించే దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. వెంకటేశ్‌తో సినిమా చేయబోతున్నాడనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ కాంబినేషన్‌లో ఎలాంటి కథ రాబోతుంది? వెంకటేశ్‌ను తరుణ్ భాస్కర్ ఎలా చూపించబోతున్నాడు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.

అంతేకాదు, ఈ ప్రాజెక్టు గురించి తరుణ్ భాస్కర్ గతంలో పలుమార్లు స్పందిస్తూ సినిమా ఉంటుందనే సంకేతాలు ఇచ్చాడు. దీంతో అభిమానులు కూడా ఈ సినిమా ఎప్పటికైనా సెట్స్‌పైకి వస్తుందని ఆశించారు. కానీ తాజాగా తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఈ ప్రాజెక్టుపై కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి.

వెంకటేశ్‌తో సినిమా చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, కేవలం ఒక కాంబినేషన్ కోసం తాను ఎదురుచూస్తూ ఉండబోనని తరుణ్ భాస్కర్ మాటలను బట్టి అర్థమవుతోంది. మార్కెట్ లెక్కలు, హీరోల ఇమేజ్‌లను దృష్టిలో పెట్టుకుని కాకుండా తనకు నచ్చిన మంచి కథను తయారు చేయడంపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాడట. అలాంటి కథ సిద్ధమైనప్పుడు కొత్తవారితో అయినా, అవసరమైతే తానే హీరోగా అయినా సినిమా చేసేందుకు సిద్ధమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

గతంలో ఒక హీరో కోసం కథను సిద్ధం చేసి, ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసే పరిస్థితి ఉండేదని.. ఇకపై మాత్రం అలా ఎవరి కోసం సమయం వృథా చేసుకోకూడదనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ప్రేక్షకులు కూడా కేవలం హీరో, దర్శకుడి కాంబినేషన్‌ను చూసి థియేటర్లకు రావడం లేదని, బలమైన కథ ఉంటేనే సినిమాకు ఆదరణ లభిస్తోందనే అభిప్రాయాన్ని తరుణ్ భాస్కర్ వ్యక్తం చేస్తున్నాడు.

ఈ వ్యాఖ్యలతో వెంకటేశ్‌తో చేయాల్సిన సినిమా సంగతేంటి అనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు అధికారికంగా రద్దయిందని మాత్రం చెప్పలేం. కానీ దర్శకుడి తాజా ఆలోచనలు చూస్తుంటే ఇప్పట్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలపై సందేహాలు మాత్రం పెరుగుతున్నాయి.

అటు పూరీ జగన్నాథ్‌తో వెంకీ సినిమా..

ఆ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్‌తో వెంకటేష్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. తీరా అది సెట్స్ పైకి రాకుండానే ఆగిపోయింది. మొత్తానికి త్రివిక్రమ్‌తో సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజతో చేయాల్సిన ప్రాజెక్టు మాత్రం చాలాకాలంగా ముందుకు కదలడం లేదు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ వ్యాఖ్యలతో ఆ సినిమా కూడా అనిశ్చితిలో పడినట్టే కనిపిస్తోంది. పూరీ జగన్నాథ్ సినిమా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరి వెంకటేశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మిగిలిన మూడు  కాంబినేషన్లు నిజంగానే తెరమరుగవుతాయా? లేక భవిష్యత్తులో అనూహ్యంగా మళ్లీ పట్టాలెక్కుతాయా? అనేది చూడాలి. ఏదేమైనా కాంబినేషన్ ఎంత క్రేజీగా ఉన్నా.. దానికి సరైన కథ, సరైన సమయం కుదరకపోతే సినిమా ముందుకు వెళ్లడం ఎంత కష్టమో ఈ ప్రాజెక్టులు మరోసారి గుర్తుచేస్తున్నాయి.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie