SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

OH NA SIDDAYYA Song Promo: "ఓ నా సిద్ధయ్య" పాట ప్రోమో విడుదల.. త్వరలో పూర్తి పాట..!

OH NA SIDDAYYA Song Promo: భార్యాభర్తల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ, భావోద్వేగాలను కళ్లకు కట్టేలా రూపొందిన సరికొత్త “ఓ నా సిద్ధయ్య” పాట ప్రోమో హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ప్రముఖులు, వేలాది మంది విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ వేడుక జరిగింది. కేవలం పాట విడుదలకు మాత్రమే పరిమితం కాకుండా, 300 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకు ఉచిత బీమాను అందించారు సాంగ్ మేకర్స్.

Reported By Zee Telugu News Desk
Published: Sep 30, 2026, 06:20 PM IST | Updated: Sep 30, 2026, 06:24 PM IST
Image Credit: OH NA SIDDAYYA Song
Join

OH NA SIDDAYYA Song Promo: భార్యాభర్తల ప్రేమ, అనుబంధం, భావోద్వేగాలను ఆవిష్కరించేలా రూపొందిన “ఓ నా సిద్ధయ్య” పాట ప్రోమో ఘనంగా విడుదలైంది. సిద్దు రెడ్డి కందకట్ల, కాత్యాయనీ జగన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాట ప్రోమోను హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ పాట విడుదల కార్యక్రమానికి 2 వేల మందికి పైగా విద్యార్థులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రముఖులు హాజరయ్యారు. భారీగా తరలివచ్చిన అభిమానులతో కార్యక్రమం సందడిగా సాగింది. సినిమా ఆడియో లేదా మూవీ లాంచ్‌ను తలపించేలా ఈ కార్యక్రమం నిర్వహించారు.

300 ఆటో డ్రైవర్ కుటుంబాలకు బీమా

పాట ప్రోమో విడుదల కార్యక్రమంతో పాటు సిద్దు రెడ్డి కందకట్ల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా 300 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల బీమా కవరేజీని అందించారు. అనుకోని పరిస్థితుల్లో ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బీమా నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్న సందర్భాల్లో కుటుంబాలకు రూ.10.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

ప్రముఖుల సమక్షంలో టైటిల్, పోస్టర్ ఆవిష్కరణ

“ఓ నా సిద్ధయ్య” పాట టైటిల్‌తో పాటు అధికారిక పోస్టర్‌ను కార్యక్రమంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ వేడుకకు ప్రముఖ గీత రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, ప్రముఖ గీత రచయిత శ్యామ్ కాసర్ల, జానపద గాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్న, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

భార్యాభర్తల అనుబంధాన్ని చూపించే కథ

“ఓ నా సిద్ధయ్య” పాటలో భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, పరస్పర నమ్మకం, కుటుంబ అనుబంధాలను ప్రధానంగా చూపించినట్లు చిత్ర బృందం తెలిపింది. జీవితంలోని సంతోషాలు, భావోద్వేగాలు, కష్టసుఖాలను కలిసి ఎదుర్కొనే దంపతుల ప్రయాణాన్ని ఈ పాట ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. విడుదలైన ప్రోమోలో సిద్దు రెడ్డి కందకట్ల, కాత్యాయనీ జగన ఆకట్టుకున్నారు. “ఓ నా సిద్ధయ్య” పాట ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. పూర్తి పాటను త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ప్రోమోకు మంచి స్పందన లభిస్తుండగా, పూర్తి పాట కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సాంకేతిక బృందం

ఈ పాటకు రామ్ అద్నాన్ దర్శకత్వం వహించడంతో పాటు సాహిత్యం అందించారు. పలు ప్రముఖ పాటలకు సాహిత్యం అందించిన ఆయన ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అరుణ్ కొలుగూరి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే 2 వేలకు పైగా పాటలకు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
కాత్యాయనీ జగన కథానాయికగా నటించగా, సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

సిద్దు రెడ్డి కందకట్ల తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త, సామాజిక సేవకుడు, Kandakatla’s KSR Projects వ్యవస్థాపకుడు. వ్యాపార రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొంటున్నారు. 2024లో లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ISR Leader Award లభించింది. అలాగే Miss Ocean World 2025లో Global Philanthropy Award, Malaysia MyTA Award వంటి పురస్కారాలను అందుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


“ఓ నా సిద్ధయ్య” పాట బృందం

తారాగణం: సిద్దు రెడ్డి కందకట్ల & కాత్యాయని జగన
దర్శకుడు & గీత రచయిత: రామ్ అద్నాన్
సంగీత దర్శకుడు: కళ్యాణ్ కీస్
గాయకులు: రామ్ అద్నాన్ & శ్రీనిధి
సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్: అరుణ్ కొలుగూరి
ఆర్ట్ డైరెక్టర్: నవీన్ WNT టీమ్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: రమేష్ మాదాసు & శీలం భానుప్రసాద్
కాస్ట్యూమ్ డిజైనర్: పాలాది శ్రీనివాస్
డిజిటల్ భాగస్వామి: Hashfluence డిజి మార్కెటింగ్


YouTubeలో “ఓ నా సిద్ధయ్య” పాట ప్రోమో:

 

 

Disclaimer: This article is from the Brand Desk. User discretion is advised.

Add Zee News as a Preferred Source
TAGS:

ZEENEWS TRENDING STORIES