టాలీవుడ్‌లో డిఫరెంట్ పాత్రలతో దూసుకుపోతున్న ‘శ్రీ నందు’.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్..
Sri Nandu Got different Charectors: తెలుగు సినీ పరిశ్రమలో డిఫరెంట్ పాత్రలతో వైవిధ్యమైన కథలతో నటుడిగా రాణిస్తున్నాడు శ్రీ నందు. అంతేకాదు రచయతగా, నిర్మాతగా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.
Sri Nandu Crazy Projects: శ్రీ నందు మొదటి నుంచి ఒక మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ను అటెంప్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా సైకలాజికల్ థ్రిల్లర్స్ నుంచి రొమాంటిక్ డ్రామాలు, ఆపై కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. అంతేకాదు ఇపుడు నటుడిగా తన పారితోషకాన్ని కూడా పెంచడంపై ఆసక్తి నెలకొంది.
కేవలం హీరో పాత్రలే కాకుండా సైడ్ క్యారెక్టర్స్, విలన్‌గా నటిస్తూ మెప్పిస్తున్నాడు. 100% Love, సవారి, దండోరా వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన నందు, ప్రస్తుతం హీరో తరహా పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ కొత్త తరహా కథ, కథనాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.
*‘సైక్ సిద్ధార్థ్’తో నిర్మాతగా, రచయితగా కొత్త అడుగు*
శ్రీ నందు కెరీర్‌లో ‘సైక్ సిద్ధార్థ్’ సినిమాలో విభిన్న తరహా పాత్రలో కనిపించి కనువిందు చేశాడు. వరుణ్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నందు మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేశాడు. అంతేకాదు ఈ చిత్రానికి నిర్మాతగా, కథా రచనలోనూ భాగమయ్యారు. తనకు నచ్చిన కథను రాజీ పడకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నానికి మంచి గుర్తింపే దక్కింది.
‘అగ్లీ స్టోరీ’తో సైకలాజికల్ థ్రిల్లర్
అవికా గోర్‌తో కలిసి శ్రీ నందు నటించిన అగ్లీ స్టోరీ సైకలాజికల్ రొమాంటిక్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రణవ స్వరూప్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2026 మే 22న విడుదల కాబోతుంది. భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలతో కూడిన కథాంశంతో నందు మరో విభిన్నమైన జానర్‌ను ఎంచుకున్నాడు.
‘కాసు’తో పాన్ ఇండియా సినిమా
శ్రీ నందు నటిస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘కాసు’. ఇండు కుమార్‌తో కలిసి నందు నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్. హర్షవర్ధన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఇందు కుమార్, నరేంద్ర కొండ నిర్మిస్తున్నారు.
డబ్బు, అత్యాశ, వాటి వల్ల మనుషుల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
‘మగాళ్లు జిందాబాద్’తో వినోదాత్మక ప్రయాణం..
శ్రీ నందు నటిస్తున్న మరో చిత్రం ‘మగాళ్లు జిందాబాద్’. వెన్నెల కిశోర్, వైవా హర్ష కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ టైటిల్ లాంచ్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. థ్రిల్లర్స్, ఎమోషనల్ డ్రామాలతో పాటు వినోదాత్మక చిత్రాల్లోనూ నటిస్తూ తనలోని మరో కోణాన్ని చూపించేందుకు నందు ప్రయత్నిస్తున్నారు.
వరుస ప్రాజెక్టులు..
వరుస సినిమాలతో బిజీగా మారుతున్న శ్రీ నందు, నటుడిగా తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో పడ్డాడు. అందులో భాగంగా విభిన్నమైన కథలు, ప్రధాన పాత్రలు, నిర్మాణ రంగంలో రాణిస్తున్నాడు.
ప్రస్తుతం ‘కాసు’, ‘మగాళ్లు జిందాబాద్’ వంటి ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్న శ్రీ నందు, రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన తదుపరి సినిమాలు ఎలాంటి విజయాలను అందుకుంటాయో చూడాలి మరి.