చిరు పేరులో ‘N’ వెనుక అసలు ట్విస్ట్ ఇదే..! మెగావర్స్‌కు కౌంట్ డౌన్ షురూ..
Megaverse: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈయన నెట్‌ఫ్లిక్స్ కోసం ‘మెగావర్స్’ అనే టాక్ షో చేస్తున్నారు. ఇందులో పలువురు సెలబ్రిటీలను చిరంజీవి ఇంటర్వ్యూ చేయడంతో పాటు వాళ్లతో తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. గత కొన్ని రోజులుగా ఈ షోకు సంబంధించిన పోస్టర్స్ వెలుబడ్డాయి. అందులో చిరంజీవి ఇంగ్లీష్ అక్షరాల్లో CHIRA JEEVI అంటూ పోస్టర్స్ వెలిశాయి. ఈ నేపథ్యంలో చిరు పేరులోని మిస్ అయిన ‘N’ వెనక ఉన్న అసలు ట్విస్ట్‌ను రివీల్ చేశారు.
Chiranjeevi As Host: చిరంజీవి.. ఈ నాలుగు అక్షరాలు గత నాలుగు దశాబ్దాలుకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. చిరు అంటే నటనతో పాటు డాన్సులతో పాటు కొన్ని పంచ్ డైలాగులు ఉండాల్సిందే. దాదాపు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించేందుకు రెడీ అయ్యారు. ఇన్నాళ్లూ కథానాయకుడిా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన చిరు.. మరోసారి హోస్ట్‌గా మారి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ లో సందడి చేయనున్నారు. ఇక ఈ టాక్ షోకు సంబంధించిన పలు ప్రచార చిత్రాల్లో చిరంజీవి మొత్తం పేరు కాకుండా ‘N’లేకుండా chira jeevi అంటూ పోస్టర్స్ వెలిశాయి.
చిరంజీవి తన పేరును చిరంజీవి నుంచి చిర జీవిగా మార్చుకున్నారా అనే డౌట్స్ వచ్చాయి. తాజాగా ఈ విడుదలైన ప్రోమోలో చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తోన్న టాక్ షో కాబట్టి ‘N’పెట్టి ఇది నా అడ్డా అంటూ చెప్పుకొచ్చారు. మొత్తంగా CHIRA‘N’JEEVI లో N అంటే నెట్‌ఫ్లిక్స్ కోసం చేసే ప్రోగ్రామ్ అంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటికే మెగావర్స్ కార్యక్రమానికి సంబంధించిన కీలక ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. హరీష్ శంకర్ ఈ టాక్ షోను డైరెక్ట్ చేశారు. ఈ షోలో నాగార్జున, వెంకటేష్, రవితేజ, రజినీకాంత్, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి హీరోలు సందడి చేయనున్నారు. అంతేకాదు చిరుతో 80లలో ఆడిపాడిన భామలు కూడా సందడి చేయబోతున్నట్టు సమాచారం. త్వరలో హైదరాబాద్‌లో ఈ టాక్ షోకు సంబంధించి గ్రాండ్ లాంఛ్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. మెగావర్స్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందనే విషయాన్ని త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో చిరంజీవి హోస్ట్‌గా ఉంటూనే తన దగ్గరకు వచ్చే గెస్ట్‌లకు సంబంధించిన విషయాలను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. మొత్తంగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తర్వాత మరోసారి చిరు హోస్ట్‌గా చేయనున్న ఈ టాక్ షో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి మరి.