• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /‘గోట్’ మూవీ రివ్యూ..!!సుడిగాలి సుధీర్ సుడి తిరిగినట్టేనా..!

‘గోట్’ మూవీ రివ్యూ..!!సుడిగాలి సుధీర్ సుడి తిరిగినట్టేనా..!

GOAT Movie Review: సుడిగాలి సుధీర్ ప్రముఖ న్యూస్‌ ఛానెల్‌లో ప్రసారమయ్యే కామెడీ రియాల్టీ షో జబర్దస్త్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అంతేకాదు సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తూనే హీరోగా తన లక్‌ను పరీక్షించుకుంటున్నాడు. ఈ కోవలో ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గోట్’ మూవీతో పలకరించాడు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మైమరిపించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 12, 2026, 01:52 PM IST|Updated: Nov 12, 2026, 04:56 PM IST
joinshare
‘గోట్’ మూవీ రివ్యూ..!!సుడిగాలి సుధీర్ సుడి తిరిగినట్టేనా..!
Image Credit: GOAT Movie Review (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
India Inflation Rate: సామాన్యులకు మరో షాక్.. 6 శాతం దాటిన ద్రవ్యోల్బణం..!

India Inflation Rate: సామాన్యులకు మరో షాక్.. 6 శాతం దాటిన ద్రవ్యోల్బణం..!

2

MP Rasgulla Bomb: వామ్మో.. నోట్లో పెట్టగానే బాంబులా పేలిన రసగుల్లా.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్..

3

డబ్బు ఆశ చూపి 43 మంది మహిళలకు వల.. అసలు గుట్టు బయటపెట్టిన పోలీసులు..!

4

Yadadri Temple: యాదగిరిగుట్ట బస్టాండ్ లో నాగు పాము కలకలం.. ప్రయాణికులు పరుగో పరుగు.!. చివరకు ఏంజరిగిందంటే..?..

5

1300 Dharani Rice In AP: సామాన్యులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.1,300కే 26 కేజీల బియ్యం బస్తా!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

సుడిగాలి సుధీర్ ‘జబర్ధస్త్’ కామెడీ రియాలిటీ షోతో ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటించిన చిత్రం ‘గోట్’. ఎపుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు వాయిదాల తర్వాత ఈ రోజు విడుదలైంది. మోగుళ్ల చంద్రశేఖర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేదవ్యాస్ డైరెక్ట్ చేశారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. రసూల్ ఎల్లోర్, సన్నీ కొర్రపాటిలు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

1986లో తూర్పు గోదావరి జిల్లా రుద్రవరంకు చెందిన ఓ మాజీ క్రికెటర్ అయిన వెంకట కృష్ణంరాజు (సర్వదమన్ బెనర్జీ) క్రికెట్స్, ఇతరత్రా బెట్టింగ్‌ వల్ల ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్న విషయాన్ని గమనిస్తారు. ఈ నేపథ్యంలో ఆ ఊర్లో ఒక కట్టుబాటు ఏర్పాటు చేస్తాడు. సంక్రాంతి రోజున తప్పించి మరే ఇతర రోజుల్లో ప్రజలెవరు బెట్టింగ్ ఆడకూడదనే షరతు విధిస్తాడు. అంతేకాదు సంక్రాంతి సంబరాల్లో పాల్గోనే జూదంలో మన సంపాదనలో 10 శాతం మాత్రమే అంటే 10 రూపాయల్లో 1 రూపాయి మాత్రమే జూదం ఆడాలని చెబుతాడు. ఈ కట్టుబాటును తప్పి తన ఇష్టానుసారం జూదం ఆడియన కారణంగా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడుతుంది. దీనికి కారణం ఆ జూదం ఆడించిన వ్యక్తి అని సూసైడ్ నోట్ వల్ల తెలుస్తుంది. దీంతో అతన్ని పోలీసులకు పట్టిస్తాడు రాజుగారు. దీంతో జూదానికి కారణమైన వ్యక్తి అక్కడే గన్‌తో కాల్చుకొని చనిపోతాడు. అతని భార్య సూసైడ్ చేసుకుంటుంది. దీంతో వాళ్ల అబ్బాయి ఊరి వాళ్లపై పగపట్టి.. ఆ ఊరి వాళ్లందరితో జూదానికి బానిసలయ్యేలా చేస్తాడు. జూదానికి బానిసలైన వాళ్లను ఎలా రాజు గారు మనవడు గణపతి రాజు (సుడిగాలి సుధీర్) విడిపించాడు. ఈ క్రమంలో ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.


కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు వేదవ్యాస్ .. ఈ చిత్రాన్ని జూదం లేదా బెట్టింగ్ లేదా పందెలా వల్ల ప్రజలు ఎలా దివాళా తీస్తున్నారు. దీని వలన ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీని కారణంగా కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్న విషయాన్ని చెప్పే ప్రయత్నం బాగుంది. అంతేకాదు ఊరిలో 
యేడాదికి ఒకసారి సంక్రాంతి రోజు జూదం ఆడాలనే కట్టుబాట్లు.. మన సంపాదనలో పది శాతం మాత్రమే పందెం కాయాలనే చెప్పే రూల్స్ ఆ ఊరిపెద్దతో చెప్పించే సీన్స్ బాగున్నాయి. ఇక ఊర్లో జూదం కారణంగా ఓ వ్యక్తి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం ..ఆ కారణంగా ఫ్యామిలీ పెద్ద ను జూదంలోకి లాగిన వ్యక్తిని పోలీసులకు పట్టించడం.. అతను అతని భార్య అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవడం.. దీంతో వాళ్ల కుమారుడు ఊరి వాళ్లపై పగపట్టి అందరిని జూదానికి బానిసలు చేయడం.. ఈ క్రమంలో పోలీస్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవడం సీన్స్ బాగానే రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌లో హీరో జైలు నుంచి విడుదలై తన పార్టనర్ శంకరన్న (బ్రహ్మాజీ) దగ్గర ఆనందపురంలో అనే గ్రామంలో ఓ అమ్మాయి పెళ్లి కాకుండా ఎత్తుకొస్తే.. రూ. 10 లక్షలు ఇస్తానని చెప్పడం. దీంతో ఈ బ్యాచ్ పోయి అమ్మాయిని తీసుకురావడం.. తీరా వాళ్లు తీసుకురావాల్సిన అమ్మాయి ఈమె కాకపోవడం అన్ని సినిమాటిక్‌గా సాగిపోతూ ఉంటాయి. ఆ అమ్మాయికి హీరో వాళ్ల ఫ్యామిలీతో రిలేషన్‌ను చూపెట్టి.. చివరకు ఊరి వాళ్లను జూదంతో పట్టి పీడిస్తున్న వ్యక్తిని హీరో ఎలా ఎదుర్కొని ఊరి ప్రజలను రక్షించాడనేదే పాయింట్. ఫస్ట్ హాఫ్‌లో సుడిగాలి సుధీర్.. అతని బ్యాచ్ కామెడీతో అంత సరదగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో రొటీన్ రివేంజ్ డ్రామా ను చూపెట్టాడు. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న కామెడీ ఓ 25 శాతం ఉన్న ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది. కథ, కథనం బాగానే ఉన్న.. సుడిగాలి సుధీర్ రేంజ్‌కు రివేంజ్ ఫైట్స్ ఎక్కువనట్టు కనిపిస్తుంది. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ ‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే..

సుడిగాలి సుధీర్ .. తన పాత్రలో ఒదిగిపోయాడు. సర్ తో పాటు గణపతి రాజు పాత్రలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఓ మొరటు రౌడీ తరహా పాత్రలో ఒదిగిపోయాడు. సినిమాలో తన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. దివ్యభారతి తన యాక్టింగ్‌తో మెప్పించింది. సర్వదమన్ బెనర్జీ తనదైన హుందా పాత్రలో మెరిసాడు. విలన్ పాత్రలో నటించిన నటుడు మంచి ఈజ్‌తో మెప్పించాడు. విలన్‌గా మంచి భవిష్యత్తు ఉంది. తమిళ గుండు మొట్టై రాజేంద్రన్ ఉన్నంత సేపు ప్రేక్షకులను నవ్వించాడు. మిగిలిన నటీనటులు ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు.  

పంచ్ లైన్.. ‘గోట్’.. ఓ మోస్తరుగా మెప్పించే యాక్షన్ కామెడీ డ్రామా..

రేటింగ్: 2.75/5

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News