అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలతో.. సమ్మర్ హాలిడేస్‌తో బాక్సాఫీస్ సందడి..
Summer Holidays box office Collection: సినిమా అంటే కేవలం భారీ యాక్షన్ సీన్స్, స్టార్ హీరోల హంగామా, భారీ గ్రాఫిక్స్ మాత్రమే కాదు.. అప్పుడప్పుడు మనసుకు హత్తుకునే చిన్న చిన్న కథలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంటాయి. ముఖ్యంగా మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ, మనల్ని మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్లే సినిమాలు అపుడపుడు ప్రేక్షకులను చెమ్మగిల్లేలా చేస్తాయి. ఈ రూట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా 'సమ్మర్ హాలిడేస్'. పిల్లల సినిమాలా మొదలైన ఈ చిత్రం.. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిని అలరిస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.
Summer Holidays Success Meet: సాధారణంగా సమ్మర్ హాలిడేస్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అమ్మమ్మ ఊరు. స్కూల్‌కు సెలవులు రావడం.. బ్యాగులు సర్దుకుని అమ్మమ్మ ఇంటికి వెళ్లడం.. అక్కడ కొత్త స్నేహితులు, ఆటలు, అల్లరి, పల్లెటూరి వాతావరణం.. ఇలా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు మన కళ్ల ముందు కదలుూ ఉంటాయి. ముఖ్యంగా 90's, 2000'sలో బాల్యం గడిపిన వారికి ఈ అనుభూతులు మరింత ప్రత్యేకం. అలాంటి అందమైన జ్ఞాపకాలనే కథా నేపథ్యంగా తీసుకుని తెరకెక్కిన సినిమా 'సమ్మర్ హాలిడేస్' సినిమాన తెరకెక్కింది.
ఈ సినిమాలో ప్రధానంగా ఆకట్టుకునే అంశం కథలోని సహజత్వం. ఎలాంటి కృత్రిమ హంగులకు వెళ్లకుండా.. మన జీవితాల్లో ఎప్పుడో జరిగిన సంఘటనలను మరోసారి తెరపై చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. పిల్లల అల్లరి, స్నేహితులతో కలిసి చేసే సందడి, అమ్మమ్మ ఊరిలో గడిపే సరదా క్షణాలు.. ఇలా ప్రతి అంశం ప్రేక్షకులను తమ బాల్యాన్ని గుర్తుచేసుకునేలా చేస్తుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా పిల్లలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినప్పటికీ, పెద్దలను కూడా అంతే స్థాయిలో ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే చిన్నప్పుడు మనం అనుభవించిన ఆనందాలు, మనకు తెలియకుండానే కాలంతో పాటు దూరమైపోయిన అనుభూతులు ఈ కథలో కనిపిస్తాయి. సినిమా చూస్తున్నంతసేపు మన చిన్ననాటి స్నేహితులు, అమ్మమ్మ ఊరు, వేసవి సెలవులు.. అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయి.
ఇక పల్లెటూరి వాతావరణాన్ని చూపించిన తీరు కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రశాంతమైన గ్రామీణ నేపథ్యం, అక్కడి మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలు, పిల్లల మధ్య స్వచ్ఛమైన స్నేహం.. ఇవన్నీ కథకు మంచి ఫీల్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా నేటి డిజిటల్ ప్రపంచంలో మొబైల్స్, గేమ్స్ మధ్య ఎక్కువ సమయం గడుపుతున్న పిల్లలకు.. ఒకప్పటి బాల్యం ఎలా ఉండేదో పరిచయం చేసే ప్రయత్నం కూడా ఈ సినిమా ద్వారా కలిగించారు.
సినిమా మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగుతూనే భావోద్వేగాలను కూడా టచ్ చేస్తుంది. ఎక్కడా భారీ డ్రామా లేకపోయినా.. చిన్న చిన్న సంఘటనలతోనే ప్రేక్షకులను కథలో భాగం చేస్తుంది. అందుకే ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాల కోసం ఎదురుచూసే ప్రేక్షకులకు ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. కమర్షియల్ అంశాలు లేకపోయినా.. అందరినీ కదిలిస్తుంది.
ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ అనేవి కేవలం సెలవులు మాత్రమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి గుర్తుచేస్తుంది. బాల్యంలో గడిపిన ఆ అందమైన రోజులను తిరిగి తీసుకురాలేకపోయినా.. కనీసం రెండున్నర గంటల పాటు ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది.
మొత్తానికి 'సమ్మర్ హాలిడేస్' సినిమా చిన్నారులకే కాదు.. తమ బాల్యాన్ని మిస్ అవుతున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిన ఒక ఆహ్లాదకరమైన చిత్రంగా నిలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా సందడి చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మరి మీరు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకోవాలనుకుంటే.. ఈ సమ్మర్ హాలిడేస్ సినిమా మీకు మంచి అనుభూతిని అందించవచ్చు!