• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /వకీల్‌సాబ్‌గా సునీల్.. మరో విలక్షణ పాత్రలో మర్యాద రామన్న..

వకీల్‌సాబ్‌గా సునీల్.. మరో విలక్షణ పాత్రలో మర్యాద రామన్న..

Sunil As Lawyer: సునీల్ కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. అంతేకాదు మనోడికి తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ కోవలో తెలుగులో తెరకెక్కుతోన్న ‘డ్యూడేట్‌’ మూవీలో వకీల్ సాబ్ పాత్రలో అలరించడానికి రెడీ అవుతున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 15, 2026, 03:39 PM IST|Updated: Oct 15, 2026, 09:42 PM IST
joinshare
వకీల్‌సాబ్‌గా సునీల్..  మరో విలక్షణ పాత్రలో మర్యాద రామన్న..
Image Credit: Sunil As Lawyer (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
YSRCP Candidates: స్థానిక సమరానికి వైఎస్సార్‌సీపీ సిద్ధం.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల

YSRCP Candidates: స్థానిక సమరానికి వైఎస్సార్‌సీపీ సిద్ధం.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల

2

Elnino reduce tips: ముంచుకొచ్చిన ఎల్ నినో గండం.. ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..?..

3

Bigg Boss 10 Elimination: బిగ్‌బాస్‌ 10లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీళ్లే? హౌస్‌లోకి ముందే స్క్రిప్ట్ వెళ్లిందా?

4

Vijayawada: మూల నక్షత్రం వేళ భక్తులకు శుభవార్త.. ఇంద్రకీలాద్రిపై రేపు వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు.!.

5

కిక్ కొడితే తల పగలాల్సిందే.. పాములను వేటాడే రాక్షస పక్షి.. సెక్రటరీ బర్డ్ వింత ప్రవర్తన వెనుక సీక్రెట్ ఇదే..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sunil New Avatar As Vakeelsaab: లోమేష్‌ పుడిపెద్ది కథానాయకుడిగా.. జయశ్రీ‌ కథానాయికగా నటిస్తోన్న చిత్రం ‘డ్యూడేట్’. కోర్టు డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ఇతర  ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. వరిష్‌ స్టూడియోస్‌ పతాకంపై పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.  ఆనంద్‌.కె. దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. అంతేకాదు ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ గత కొన్ని రోజులుగా  హైదరాబాద్‌లో కంటిన్యూస్‌గా  జరుగుతోంది.

తొలి షెడ్యూల్‌లో ఇంపార్టెంట్ సీన్స్‌ను పిక్చరైజ్ చేశారు మేకర్స్. రీసెంట్‌గా  కమెడియన్‌ కృష్ణభగవాన్‌ 'డ్యూ డేట్‌' షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. అంతేకాదు ఈ చిత్రంలో క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారు. చాలా గ్యాప్  తరువాత కృష్ణ భగవాన్‌ ఈ చిత్రంలో ఓ మంచి క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఆయన పాత్ర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచే అవకాశాలున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో నటుడు సునీల్‌ జాయిన్‌ అయ్యారు.

ఈ చిత్రంలో సునీల్‌ వకీల్‌సాబ్ ‌ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన కెరీర్‌ల్‌ ఇదొక డిఫరెండ్‌ క్యారెక్టర్‌గా నిలిచిపోనున్నట్టు మేకర్స్ చెబుతున్నారు.  ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటుడు సునీల్‌ పవర్‌ఫుల్‌ లాయర్‌ శేఖర్‌ చంద్రగా కనిపించబోతున్నాడట. ఈయన క్యారెక్టర్  ఈ చిత్రానికి  పెద్ద ఎస్సెట్‌గా ఉండనుంది. ప్రజెంట్‌ సొసైటీలో జరగుతున్న  బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామాగా రాబోతుంది.

కోర్టు ఇచ్చే డేట్‌ల ఆధారంగా ఈ సినిమాకు ‘డ్యూ డేట్’ అనే పేరు ఖరారు చేశారు. ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్‌ చుట్టు పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రాబోతుంది.  టైటిల్‌ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు ప్రేక్షకులకు  పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉండనున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించండతో పాటు  అందరిని ఆలోచింపజేస్తుందని చెప్పుకొచ్చారు.  

ఈ చిత్రంలో లోమేష్‌ పుడిపెద్ది, జయశ్రీ‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, కృష్ణ భగవాన్,  ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, అక్షర గౌడ   తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి జవ్వాడి నాయుడు ఆర్ట్ అందిస్తున్నారు. హరీష్‌ మీనన్‌ మాటలు,సత్య గిడుటూర్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చెంచు జింక డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తుండగా.. పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా  ఆనంద్‌.కె. దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News